బీఆర్ఎస్ రైతు రుణమాఫీకి తిలోదకాలిచ్చేసిందా?

Publish Date:Oct 24, 2023

Advertisement

బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ఊసే లేకపోవడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రుణమాఫీకి బీఆర్ఎస్ తిలోదకాలిచ్చేసిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతాంగం రుణమాఫీ  హామీ ఏమైందని బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తలదన్నేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని  బీఆర్ఎస్ వర్గాలు తమ భుజాలను తామే చరుచుకుంటుంటే.. రైతులు మాత్రం  పెదవి  విరుస్తున్నారు. రైతు బంధు సహా పది హామీలను ప్రకటించిన కేసీఆర్ రుణమాఫీని మాత్రం పూర్తిగా విస్మరించారు. పాత విధానాలు అన్ని  యథావిథిగా కొనసాగుతాయని మేనిఫెస్టోలో ప్రకటించినా.. రైతు రుణమాఫీ ప్రస్తావనే లేకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

 తెలంగాణ ఏర్పడిన కొత్తలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్ష వరకు రుణమాఫీపై బీఆర్ఎస్ (అప్పడు టీఆర్ఎస్) విస్పష్ట హామీ ఇచ్చిన సంగతి విదితమే. ఆ హామీని 2018 ఎన్నికల సమయంలోనూ పునరుద్ఘాటించింది. ఫస్ట్ టర్ములో నాలుగు విడతల్లో అమలు చేసినట్లుగానే రెండో టర్ములో కూడా సంపూర్ణం చేస్తామని అసెంబ్లీ వేదికగానే కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ నాలుగున్నరేండ్లు పూర్తయ్యి ఎన్నికలకు వెళ్తున్నా ఇంకా బకాయిలు ఉండిపోయాయి.

గత రెండు ఎన్నికలలోనూ మేనిఫెస్టోల్లో రుణమాఫీ గురించి విస్పష్ట హామీ ఇచ్చిన కేసీఆర్.. ఈసారి  మేనిఫెస్టోలో కనీసంగానైనా ప్రస్తావించకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  2014 మేనిఫెస్టోలోనూ,  2018 ఎన్నికల మేనిఫెస్టోలో నూ చేర్చినా.. ఇప్పుడు మాత్రం దానిని కనీసం ప్రస్తావించకపోవడంతో  కేసీఆర్ రుణమాఫీపై చేతులెత్తేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  దీనిపై జనం ప్రశ్నలకు బీబర్ఎస్ నేతలు సమాధానం ఇవ్వడం లేదు.  గత ఎన్నికల సమయంలో రుణమాఫీ హామీ ఇచ్చినా  అది సంపూర్ణంగా నెరవేరకపోవడంతో.. బకాయిల సంగతేమిటని రైతులు నిలదీస్తున్నారు.  రుణమాఫీ అంశంలో కేసీఆర్ మౌనంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలలో తమ సత్తా చాటుతామని హెచ్చరిస్తున్నారు.  

ఇలా ఉండగా కాంగ్రెస్ ఇప్పటికే రైతులకు రెండు లక్షల రూపాయల వరకూ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.   ఇప్పుడు రుణమాఫీ వ్యవహారం బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. 

By
en-us Political News

  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.