ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికే బీఆర్ఎస్ సాహసించలేదు... కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా గులాబీ పార్టీ బరిలోకి దిగలేదు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఒక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ సత్తా చాటుకుంది.. దాంతో రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ శకం ముగిసినట్లే అని.. పొలిటికల్ రేసులో నుంచి గులాబీ పార్టీ ఎలిమినేట్ అయిపోయినట్లే అన్న టాక్ వినిపిస్తుంది
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా జరుగుతాయి .. కానీ, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ పార్టీల ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యిందంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు దానికి మొదటి అడుగుగా చెప్తున్నారు. తెలంగాణ రాజకీయ అవని పై ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సరికొత్త రాజకీయ సమీకరణాలను ఆవిష్కరించాయి. పొలిటికల్ రేసులో నుంచి నెమ్మదిగా బీఆర్ఎస్ ఎలిమినేట్ అవుతుంటే... బీజేపీ అంతలా ఎలివేట్ అవుతోంది. ఇది భవిష్యత్ తెలంగాణ రాజకీయాలకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
యుద్ధం చేయకుండానే చేతులెత్తేసినట్లుగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యవహరించింది. ఆ లొంగుబాటు బీజేపీకా? లేక వ్యూహాత్మకమా? అన్న చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పరోక్షంగా సహకరించినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పెద్దలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కమల నాథులకు దాసోహం అన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వాస్తవానికి రాజకీయాలు పాత రోజుల్లా లేవు. నిత్యం రేసులో ఉండాల్సిందే. లేదంటే గేమ్ నుండి ఔట్ అయ్యే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి.
ఈ పరిస్థితులను కేసీఆర్ అంచనా వేయలేకపోతున్నారా? లేక బీజేపీ కోసం తన లెక్కలు మార్చుకుంటున్నారా? అన్నది అంతుపట్టడం లేదు. వాస్తవానికి బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు పోయినా ఇప్పటికీ దానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కేడర్, లీడర్లు ఉన్నారు. ఆర్థికంగా కూడా ఆ పార్టీ మిగిలిన పార్టీల కంటే బలంగా ఉంది. ఐనా కేసీఆర్ ఎమ్మెల్సీ రేసు నుండి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
మనం తప్పుకోవడం వ్యూహాత్మక తప్పిదం అవుతుంది... మనం తప్పు కుంటే ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తుంది. అది పార్టీ ఉనికికి చాలా ప్రమాదమని హరీష్ రావు లాంటి నేతలు కేసీఆర్ కు చెప్పినా ఆయన పెడచెవిన పెట్టారంట. ఈ నేపథ్యంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఓడటం, నిన్నటి దాకా అధికారంలో ఉండి ఎన్నికల బరి నుండి బీఆర్ఎస్ ముందే ఔట్ కావడం తెలంగాణ రాజకీయాలను కీలక మలుపు తిప్పే పరిణామాలుగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం కేసీఆర్ వ్యూహమో? వ్యూహాత్మక తప్పిదమో? కాని తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుండి బీఆర్ఎస్ ఎలిమినేట్ అయ్యి ఆ స్థానంలో బీజేపీ ఎలివేట్ అవుతున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-heading-towads-elemination-39-194007.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.