తెలంగాణలో వేగంగా పడిపోతున్న బీఆర్ఎస్ గ్రాఫ్.. కేసీఆర్ జాతీయ ఆకాంక్షే దెబ్బ కొట్టిందా?

Publish Date:Jul 7, 2023

Advertisement

ఇక్క‌డే ఉండి ఏద‌న్నా చేసుకో న‌గ‌రానికి వెళ్లి ఏం వెల‌గ‌బెడ‌తావ్‌? అంటుంది బామ్మ మ‌న‌వ‌డి హైద‌రా బాద్ ఉత్సాహాన్ని చ‌ల్ల‌బ‌రుస్తూ. చిన్నోచిత‌కో ఉన్న‌వూళ్లో చేసుకుంటే బాగుంటుందేగాని ఎవరూ తెలీని న‌గ‌రానికెళ్లి ఉద్ధ‌రించేదేవిట్రా పిచ్చి స‌న్నాసీ! అని ఆమె   హెచ్చ‌రిక‌.  అధినేత కేసీఆర్ కేంద్రంలో పాగా వేసే ప్ర‌య‌త్నం అత్యాస, వృధా ప్రయాసగా మిగిలిందని.. ఇప్పుడు పరిశీలకులు అంటున్నారు.   

చిన్న‌రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేసి అధికారంలోకి రావ‌డం ఒక ఎత్తు. కానీ అదే ధీమాతో న‌లుగురినీ చేర్చుకుని కేంద్రా నికి గాలం వేయాల‌నుకోవ‌డ‌మే తొంద‌ర‌పాటు. ఆ తొందరపాటు ఫలితమే ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న పరిస్థితి అని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ కాలికి బలపం కట్టుకు తిరిగినా ఎవరి మద్దతూ సంపాదించలేకపోయారు.  కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశం, ప్రస్థానం వెనుక పదవీ కాంక్షను ఇతర రాష్ట్రాల బీజేపీయేతర పార్టీలు గమనించాయని పరిశీలకులు అప్పట్లో విశ్లేషణలు చేశారు. ఏది ఏమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు చేసిన యత్నాలు సత్ఫలితాలిచ్చాయి. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆయన లెఫ్ట్, రైట్ పార్టీలను కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చారు. ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకోవడం, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని ఎదిరించడం అన్న ప్రజాస్వామ్య కారణాలతోనే ఎన్టీఆర్ నాడు జాతీయ స్థాయిలో  పార్టీల ఐక్యతకు ప్రయత్నించారు.  

ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన నేపథ్యంలో  తెలంగాణా ముఖ్య‌మంత్రిగా, టీఆర్ ఎస్ అధినేత‌గా కేసీఆర్ తెలంగాణాలో చ‌క్రం తిప్పారు బాగుంది. కానీ తెలంగాణలలో తనకు లభించిన ఎదురు లేని పరిస్థితి జాతీయ స్థాయిలో కూడా ఉంటుందన్న ధీమాతో టీఆర్ఎస్ ను  బీఆర్ ఎస్ గామార్చి భంగపడ్డారు. కనీసం సాటి తెలుగు రాష్ట్రం ఏపీలో కూడా ఆయన ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయారు.  కేసీఆర్ జాతీయ ఆకాంక్షలను తెలంగాణం కూడా హర్షించినట్లు కనిపించడం లేదు. అందుకే తెలంగాణాలోనే  కేసీఆర్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత గట్టిగా కనిపిస్తోందని అంటున్నారు.  ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణాల్లో కేసీఆర్ తనయ కవితపై వచ్చిన ఆరోపణలు, విచారణల తరువాత ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ పై కేసీఆర్ విమర్శల దాడి ఆగిపోవడంతో.. కేసీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తడం వెనుక ఏదో స్వార్థ ప్రయోజన కాంక్ష ఉందన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి.  

 తాజాగా  ఒక జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలంగాణలో బీఆర్ఎస్ తిరోగమనంలో సాగుతోందని తేలింది. నిజం గత రెండు అసెంబ్లీ ఎన్నికలలోనూ కారు ఎంత జోరుగా సాగిందో ఇప్పుడు కూడా అంతే స్పీడుగా రివర్స్ గేరులో పయనిస్తోందని సర్వే ఫలితం చెబుతున్నది. దాదాపు 90 స్థానాలలో ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ అతి కష్టం మీద 30 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని తేలింది.   రాజకీయాలతో సంబంధం లేని ఒక జాతీయ సర్వే సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో జరిపిన అధ్యయనం మేరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ వెగంగా పడిపోతోంది. ఆ పార్టీ నమ్మకం పెట్టుకున్న సంక్షేమ పథకాలు కాపాడే అవకాశం లేదని సర్వే పేర్కొంది.  ఖమ్మంలో రాహుల్ గాంధీ సభకు ముందు జరిగిన ఈ సర్వే ఒక్కో నియోజకవర్గంలో సగటున 250 శాంపిళ్లను తీసున్నట్లు పేర్కొంది. 

By
en-us Political News

  
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.