అదానీ విషయంలో బీఆర్ఎస్ వింత‌ డిమాండ్‌!

Publish Date:Nov 25, 2024

Advertisement

దిగ్గజ పారిశ్రామిక‌వేత్త అదానీ ఇష్యూ దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది. విద్యుత్ ఒప్పందాల విషయంలో లంచాలు ఇచ్చినట్లుగా అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ మేర‌కు అదానీ స‌హా మ‌రో ఎనిమిది మందిపై కేసులు కూడా న‌మోద‌య్యాయి. విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డితో స‌హా మ‌రో నాలుగు రాష్ట్రాల అధికారుల‌కు అదానీ కంపెనీ నుంచి ముడుపులు చెల్లించినట్లు అమెరికాలో నమోదైన కేసు చార్జిషీట్ లో ఉంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ఈ వ్య‌వ‌హారం అగ్రరాజ్యం అమెరికా, భారత్ సంబంధాల మీద‌ అంతో ఇంతో ప్రభావాన్ని చూపుతుందన్న వాదన కూడా వినిపిస్తుంది. అయితే, ఈ అంశంపై ఇంకా భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.  వైట్ హౌస్ స్పందించింది. దర్యాప్తు సంస్థలు ఖచ్చితమైన సమాచారంతోనే ముందుకెళ్తాయని.. ఇలాంటి పరిస్థితుల్ని రెండు దేశాలు సమర్థంగా ఎదుర్కొంటాయని ప్రకటించింది.  మ‌రోవైపు, త‌మ కంపెనీపై వచ్చిన ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించింది. కానీ అమెరికా న్యాయస్థానాల నుంచి ఆయన తప్పించుకోవడం అంత తేలిక కాదు. భారత్,  అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. అయితే అదానీని భారత్ అంత తేలికగా అప్పగించే అవకాశాలు లేవు.

అవినీతి ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన అదానీని తక్షణమే అరెస్ట్‌ చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. అదానీ గురించి తాము ఇన్నాళ్లుగా చెబుతున్నది నిజమని అమెరికా అధికారుల ఆరోపణలు నిరూపించాయన్నారు. అదానీ భారత్‌లోనేగాక అమెరికాలోనూ చట్టాలను ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోందని, అలాంటి వ్యక్తి బయట స్వేచ్ఛగా ఎలా తిరగగలుగుతున్నారో ఆశ్చర్యంగా ఉందన్నారు. స్వలమైన ఆరోపణలపై ఏకంగా ముఖ్యమంత్రులనే అరెస్టు చేస్తున్నప్పుడు.. రూ.2,200 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న అదానీ స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారని, ఎలా తిరగనిస్తున్నారనీ రాహుల్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మ‌రోవైపు, పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమ‌వారం(నవంబర్ 25)  ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన తొలిరోజే విపక్ష సభ్యులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ ఇష్యూపై చర్చ కోసం పట్టుబట్టారు. స‌భ‌ను నినాదాలతో హోరెత్తించారు. దీంతో తొలి రోజే స్పీకర్ ఓం బిర్లా సమావేశాలను నవంబర్ 27వ తేదీకి వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగింది. గౌతమ్ అదాని వ్యవహారంపైన చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సభను ఎల్లుండికి వాయిదా వేశారు.

అదానీ ముడుపుల వ్యవహారంపై అమెరికా కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణలో ఆయన ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసిన ప్రభుత్వాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్లు విరాళంగా ప్ర‌క‌టించారు. అయితే, వాటిని స్వీకరించ కూడదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు నిర్ణ‌యించింది. స్కిల్‌ యూనివర్సిటీకి రూ.100 కోట్లు బదిలీ చేయవద్దని.. అదానీ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం తరఫున లేఖ సైతం రాయ‌డం జ‌రిగింది. అయితే, తెలంగాణ‌లో అదానీ కంపెనీ అధికార పెట్టుబ‌డుల‌పై సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు స్వీకరించినట్లు వెల్లడించారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగవద్దని ప్రతిపక్షాలకు ఆయ‌న‌ సూచించారు. కానీ  మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హ‌రీశ్ రావు మాట్లాడుతూ.. స్కిల్‌ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్లు నిధులు వెనక్కి ఇచ్చారు సరే.. అదానీ అవినీతిపై రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్‌లో మీరు అదానీతో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని, అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు.

వాస్త‌వానికి బీఆర్ఎస్  హ‌యాంలోనే అదానీ కంపెనీ రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబ‌డులు పెట్టింది. మామిడిప‌ల్లిలో అదానీ ఎల్బిట్ సిస్ట‌మ్స్ పేరిట డిఫెన్స్ యూనిట్ ఏర్పాటుకు కేసీఆర్ నేతృత్వంలోనే బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆమోదించింది.  25 ఎకరాల్లో ఏర్పాటైన ఈ యూనిట్  2025 జ‌న‌వ‌రి నుంచి ఉత్ప‌త్తి ప్రారంభించ‌నుంది. సీఎం కేసీఆర్ తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన నెల‌రోజుల‌కే గౌత‌మ్‌ అదానీతో భేటీ అయ్యారు. 2018 దావోస్ స‌ద‌స్సులో అప్ప‌టి మంత్రి కేటీఆర్ అదానీని క‌లిసి విమాన విడిభాగాల త‌యారీ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాల‌ని గ‌తంలో అదానీ కంపెనీని కేసీఆర్ ఆహ్వానించారు. ఇలా బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో అదానీతో ప‌లు ఒప్పందాలు చేసుకున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు వాదిస్తున్నారు. వాట‌న్నింటిని ప‌క్క‌న‌పెట్టి.. రూ. 100 కోట్ల విరాళాన్ని తిర‌స్క‌రించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని.. ప్రాజెక్టు ఒప్పందాల‌పై ఏం చేస్తార‌ని హ‌రీశ్ రావు ప్ర‌శ్నించ‌డం విడ్డూరంగా ఉంద‌ని కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.