బీఆర్ఎస్.. జాతీయ, ప్రాంతీయ ద్విపాత్రాభినయం..క్లిక్ అయ్యేనా?

Publish Date:Oct 13, 2022

Advertisement

అనుకున్నట్లే జరిగింది. రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) భారత రాష్ట్ర  సమితి (భారాస) గా పేరు మార్చుకుంది. జాతీయ పార్టీగా ఎదిగే దిశగా తొలి అడుగు వేసింది. తెరాస /భారాస అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు 68 ఏళ్ల వయసులో తమ రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అయితే, పేరు మారినా, ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా కొత్తగా ప్రస్థానం మొదలు పెట్టినా, పార్టీ కార్యక్షేత్రం మారలేదని, కొత్త పాత పార్టీల వ్యవస్థాపక అధ్యక్షుడు హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, స్పష్టం చేశారు. భారత రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నాన్నామని చెప్పారు. అంతే,కాదు, ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకుండా, రాకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా తానే ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే, దేశమంతా పర్యటిస్తానని కేసేఆర్ స్పష్టం చేశారు. అలాగే, కార్యక్షేత్రం వదిలేది లేదని, ఈ విషయంలోనూ  ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని  చెప్పారు. 
అయితే, నిజంగానే కేసీఆర్ ఎప్పటిలా జోడు పదవుల్లో కొనసాగుతారా ? సమయం సందర్భం చూసుకుని, ముఖ్యమంత్రి పదవిని మరొకరికి అప్పగిస్తారా,అనేది చూడవలసి వుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి స్వయంగా కేసీఆర్ చేసిన, నిన్నటి (బుధవారం) ముగింపు ప్రకటన వరకు ఆయనే తెరాస  పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. అలాగే, 2014 నుంచి ఈ రోజు వరకు పార్టీ అధ్యక్ష పదవితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ  జోడు పదవులలో కొనసాగుతున్నారు. అఫ్కోర్స్, కుమారుడు కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా, చేదోడు వాదోడుగా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. 
అయితే, రాష్ట్ర  స్థాయిలో సాధ్యమైన జోడు పదవుల స్వారీ జాతీయ స్థాయిలో సాధ్యమవుతుందా? ఈ ఏర్పాటు ఎంత కాలం కొనసాగుతుంది? అనేది, ఇప్పుడే తెలిసే విషయం కాదు. నిజమే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదివితో పాటు, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా జోడు పదవులు తనకే కావాలని కోరుకున్న ఆ రాష్ట ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,అశోక గెహ్లాట్ ఎదురైన అవరోధాలు, అడ్డంకులు, కేసేఆర్’ కు లేవు. కాంగ్రెస్ పెట్టుకున్న ఒక వ్యక్తికి ఒకే పదవి నియమం తెరాసకు పెట్టుకోలేదు. అంతేకాదు, అది తెరాస అయినా భారాస అయినా,గులాబీ పార్టీ కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే కాబట్టి, రాజస్థాన్’ పరిణామాలను ఇప్పటి కిప్పుడు తెలంగాణలో ఉహించలేము.  
కానీ, కేంద్ర ఎన్నికల సంఘం తెరాస పేరు మార్పును అధికారికంగా గుర్తించి, తెరాస అధ్యక్షుడు కేసేఆర్, భారాస అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత, సంస్థాగత మార్పులు చేపట్టక తప్పక పోవచ్చును. అలాగే, అలాంటి ఆలోచన గులాబీ బాసుకు లేక పోలేదని అంటున్నారు. అయితే, తెరాస పేరు మార్పు,అనుకున్నట్లుగా ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుందా, లేదా అనేది, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, సో అంత వరకు  సంస్థాగత మార్పులు ఉండవనే అంటున్నారు.
అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్,ఓ వంక జాతీయ వాదాన్ని ఎత్తు కుంటూనే, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాదాన్ని వదిలేది అంటున్నారు. ముఖ్యమంత్రి కేసేఆర్ తమకున్న అనుభవంతో జోడు పదవులను సమర్ధవంతంగా నిర్వర్తించ వచ్చునేమో కానీ, జోడు విధానాలను, జోడు వాదాలను ఎలా, సమన్మయ పరచు కుంటారు అనేది, ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా వుందని అంటున్నారు. రెండు దశాబ్దాల తెరాస చరిత్ర, కేసీఆర్ రాజకీయ జేవిత చరిత్ర మొత్తం తెలంగాణ కేంద్రంగానే సాగిందనేది కాదన లేని నిజం.   
కేసేఅర్’ కు జాతీయ స్థాయిలో ఏదైనా గుర్తింపు ఉందంటే, అది తెలంగాణ ఉద్యమ నేతగా, తెలంగాణ అస్తిత్వ వాదంతో ముడిపడి ఉన్నగుర్తింపే కానీ, మరొకటి కాదు. అయితే, ఆ ప్రస్తావన ఎక్కడా రాకుండా, ఎనిమిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలనే జాతీయ ఎజెండాలో చేర్చారు. అందులోనూ ప్రధానంగా సంక్షేమ పధకాలను, మరీ ముఖ్యంగా కౌలు రైతలకు కాదని, వందల ఎకరాల భూములు, వందల కోట్ల ఆస్తులు ఉన్న మంత్రి మల్లా రెడ్డి వంటి భూస్వాములు, రాజకీయ, వ్యాపార రంగాలలో స్థిరపడిన ధనినికులు, ప్రభుత్వ ఉద్యోగులకు సహా భూస్వాములకు ప్రజల సొమ్మును దోచి పెడుతున్నారనే ఆరోపణలున్న రైతు బంధు, ఇంకా రాష్ట్ర్రంలోనే పూర్తి స్థాయిలో పట్టాలేక్కని  దళిత బంధు, గిరిజనబందు వంటి పథకాలనే తెలంగాణ మోడల్’ గా ప్రముఖంగా పేర్కొంటున్నారు. ఈ ఎజెండాకు దేశ ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనేది ఎలా ఉన్నా, జంట పదవులు, జోడు వాదాలలో భారాస ప్రస్థానం ఎలా ముందుకు సాగుతుంది అనేది, చూడవలసి ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.