ఎమ్మెల్సీ పోరుకు బీఆర్ఎస్ దూరం?.. ఓటమి భయమే కారణమా?

Publish Date:Feb 4, 2025

Advertisement

 తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మాటలు కోటలు దాటుతున్నాయి. అయితే చేతలు మాత్రం ఫామ్ హౌస్ గడప కూడా దాటని పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికలలో పోటీకి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ఇప్పటికింకా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.. కానీ ఆ పార్టీ తీరు చూస్తుంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టమౌతోంది. పార్టీ క్యాడర్ కు అదే సంకేతాలను పంపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ పార్టీకీ మద్దతు ఇచ్చేది లేదని చెబుతుండటమే స్వయంగా బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపడం లేదని చెప్పేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉండనుంది. 

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇరువురూ కూడా రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు అధికారం అప్పగించామా అని వగస్తున్నారనీ, అవకాశం ఉంటే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ను అధికార పీఠంపై కూర్చోపెట్టేందుకు రెడీగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. నిజంగా అలాంటి పరిస్థితే కనుక ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దిగితే తాము చెప్పే మాటలలో వాస్తవం ఎంత ఉందో ఫలితాలలో తేలిపోతుంది. అయితే ఆలా తేల్చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు.  

ఇప్పటికిప్పుడు కేసీఆర్ ను సీఎంను చేయడానికి ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని ఢంకా బజా యించి చెబుతున్న కేటీఆర్ కానీ, కాంగ్రెస్ కు అధికారపగ్గాలు ఇచ్చినందుకు జనం బాధపడుతు న్నారని చెప్పుకుంటున్న కేసీఆర్ కానీ తాము చెబుతున్న మాటలను తామే విశ్వసించడం లేదనడానికి నిదర్శనం ఎమ్మెల్సీ బరిలోకి దిగకపోవడమేనని విశ్లేషకులు అంటున్నారు. వారు చెబుతున్న విధంగా  రేవంత్ సర్కార్ పై నిజంగానే ప్రజలలో వ్యతిరేకత ఉంటే.. దానిని బీఆర్ఎస్ కు అనుకూలంగా మలచుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక అందివచ్చిన అవకాశంగా భావించాల్సిన బీఆర్ఎస్ ఆ ఎన్నికలకు దూరం అవ్వడం అంటే.. ప్రజలలో తమ పార్టీ పట్ల సానుకూలత లేదని అంగీకరించడమేనని చెప్పాలి.

వాస్తవంగా గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ప్రజల మూడ్ ను చాటి చెబుతుంది. ఎందుకంటే ఆ రెండు వర్గాలూ కూడా ప్రజలపై ప్రభావం చూపగలిగే వర్గాలే.  అటువంటి టీచర్, గ్యాడ్యుయేట్   ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి బీఆర్ఎస్ వెనుకాడటం చూస్తుంటే.. ప్రజలలో తమ పార్టీకి ఏమంత పలుకుబడి లేదని బీఆర్ఎస్ అంగీకరిం చేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.