ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ఆహ్వానితుల హాజరు అనుమానమే!

Publish Date:Jan 9, 2023

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి,భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధినేత  కల్వకుట్ల చంద్రశేఖర రావు, జాతీయ రాజకీయ ప్రస్థానంలో వడివడిగా అడుగులు వేద్దామనుకుంటున్నారు. అయితే కారణాలేవైనా ఆ అడుగులు తడబడుతున్నాయి. నిజం చెప్పాలంటే  కేసీఅర్, గత కొన్నేళ్లుగా జాతీయ రాజకీయాల ప్రస్థానం గురించి ఇదిగో అదిగో అంటూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తెరాస నాయకులు కుడా ఆయనకు వంత పాడుతున్నారు.  

ఒకటి కాదని మరోటి వ్యూహాలు మారుస్తూ వచ్చారు. ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమి, ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ ఇంకో ఫ్రంట్,  మరో  ఫ్రంట్  అంటూ రకరకాల ప్రయత్నాలు చేసి అవన్నీ విఫలం కావడంతో    ఫ్రంట్ , టెంట్ ఆలోచనలను వదిలేసి కేసీఆర్  తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును, భారత రాష్ట్ర సమితిగా మార్చి  జాతీయ రాజకీయాలలోకి దూకేశారు. మంచి ముహూర్తం చూసుకుని  దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర  కార్యాలయం కూడా ప్రారంభించేశారు. ఇక అక్కడ నుంచీ ఆయన జాతీయ రాజకీయ ప్రస్థానం మూడడుగులు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. ఢిల్లీలో బ్రహ్మాండమైన బహిరంగ సభ అన్నారు. ఏపీలోనూ సభలు నిర్వహిస్తామన్నారు. ఇంకా చాలా చాలా చెప్పారు. కానీ చివరకు బీఆర్ఎస్ తొలి మహాసభకు ఖమ్మం వేదికగా మారింది. అది కూడా కేవలం బీఆర్ఎస్ మహాసభగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం లేదు. ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవం  చేసేందుకు అక్కడకు వెళుతున్న కేసీఆర్ పనిలో పనిగా బీఆర్ఎస్ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసేశారు.  

ఘనంగా హస్తిన వేదికగా నిర్వహించాల్సిన తొలి సభను స్వరాష్ట్రంలో అందునా ఖమ్మంలో ఏర్పాటు చేయడానికి కారణం ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర పార్టీల నాయకుల నుంచి ఆశించిన విధంగా మద్దతు రాకపోవడమేనని పరిశీలకులే కాదు.. సొంత పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. అయితే కింద పడ్డా పైచేయి అనిపించుకోవాలని ఖమ్మం సభకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లను ఆహ్వానించామనీ, వారు వస్తున్నారనీ బీఆర్ఎస్ ఘనంగా ప్రచారం చేసుకుంటున్నది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు వీరెవరు కూడా ఇంకా సభకు తమ హాజరుపై స్పష్టత ఇవ్వలేదని సమాచారం. వారి నుంచి సభకు వస్తున్నట్లు ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదని అంటున్నారు.  

గతంలో కూడా ఇక్కడ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రకటన సందర్భంలో కానీ, ఆ తరువాత అధికారికంగా బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి కానీ.. కర్నాటక మాజీ సీఎం వినా ఎవరూ హాజరైన దాఖలాలు లేవు. అలాగే ఢిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగరంలో ఉండి కూడా ఢిల్లీ సీఎం హాజరు కాలేదు. ఆ కార్యక్రమానికి కూడా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ మాత్రమే హాజరయ్యారు. ఇప్పుడు ఖమ్మం సభకు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంల హాజరుపై స్పష్టత లేదు. ఇక ఇప్పటి వరకూ బీఆర్ఎస్ కార్యక్రమాలకు హాజరైన వారిలో కొద్దో గొప్పో చెప్పుకోదగ్గ పేర్లు ఏమైనా ఉన్నాయంటే అవి కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాత్రమే.  

ఇక డిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి  పంజాబ్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి రైతు నాయకులుగా చెప్పుకుంటున్న కొందరు హాజరైనా వారి వారి రాష్ట్రాలలో వారికి ఉన్న క్రెడిబులిటీ ఏమిటన్నది తెలియదు.  దేశంలో రైతు నాయకుడిగా   గుర్తింపు ఉన్న తికాయత్ బీఆర్ఎస్ కార్యక్ర మాలకు దూరంగా ఉన్నారు. స్వాగత తోరణాల్లో కనిపించిన బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా  భారాస హస్తిన కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకలో కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఖమ్మం సభకు హాజరయ్యేది ఎవరన్న విషయంలో సర్వత్రా సందిగ్దతే వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా జాతీయ రాజకీయాలంటూ ఆర్భాటంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేసి భారత్ చేర్చి కొత్త పార్టీని ఏర్పాటు చేసినా  ఆ కొత్త పార్టీ కూడా రాష్ట్రానికే పరిమితమైందా అన్న  అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.