మాస్కో నౌకా బీమాకు విస్తృత అనుమతి.. ఆంక్షల మధ్య ఇండియా ఇంధన భద్రతా వ్యూహం

Publish Date:Apr 24, 2026

Advertisement

రష్యా నుండి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరుతున్న వేళ.. ఆ సరఫరా గొలుసు నిరంతరాయంగా కొనసాగేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాశ్చాత్య ఆంక్షలు, సముద్ర రవాణా ప్రమాదాలు, హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతల మధ్య..  రష్యా నౌకలకు బీమా కల్పించే సంస్థల జాబితాను విస్తరించడం ద్వారా న్యూ ఢిల్లీ తన ఇంధన భద్రతా వ్యూహాన్ని మరింత పటిష్టం చేసింది.  

 చైనా తర్వాత రష్యా చమురును కొనుగోలు చేసే రెండవ అతిపెద్ద దేశం భారత్ అన్న సంగతి తెలిసిందే.  మార్చిలో రోజుకు 2.25 మిలియన్ బ్యారెళ్లు  ఇప్పటివరకు అత్యధిక స్థాయి.     ఏప్రిల్ చివరి నాటికి రోజుకు 2.1 మిలియన్ బ్యారెళ్ల దిగుమతులు కొనసాగనున్నట్లు అంచనా. భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా దాదాపు 50శాతానికి చేరింది.  ఆంక్షల ఒత్తిడిని లెక్కచేయకుండా, భారత ఇంధన బిల్లును గణనీయంగా తగ్గిస్తున్న ప్రధాన కారకం. 
 ఈ నేపథ్యంలోనే.. భారత్, రష్యా నౌకలకు రక్షణ  నష్టపరిహార  కవరేజీ ఇవ్వగల ఆమోదిత బీమా సంస్థల సంఖ్యను 11కి పెంచింది. వీటిలో  గాజ్ప్రోమ్ ఇన్సూరెన్స్, రోస్గోస్స్ట్రాఖ్ ఇన్సూరెన్స్ వంటివి ఉన్నాయి.ఈ ఇన్సూరెన్స్ కవరేజి  వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ చెల్లుబాటు అవుతుంది. అలాగే బ్యాలెన్స్ ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ చెల్లుబాటు ఈ ఏడాది ఆగస్టు 19 వరకూ ఉ:టుంది.   సోగ్లాసీ, స్బేర్బ్యాంక్ ఇన్సూరెన్స్, ఉగోరియా, ఏఎస్టికె ఇన్సూరెన్స ల కవరేజీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వరకూ, అలాగే.. విఎస్కె, సోగాజ్, అల్ఫాస్ట్రాఖోవానియే, ఇంగోస్స్ట్రాఖ్ ల కవరేజీ కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ పొడిగించింది.  

ఇది కాకుండా అదనంగా దుబాయ్ కి చెందిన  ఇస్లామిక్ ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటి క్లబ్ ను కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 వరకు సముద్ర సంబంధిత కవరేజీకి భారత్ గుర్తించింది.  ప్రపంచ సముద్ర రవాణాలో..  ప్రధాన బాధ్యత కవరేజీని అందించే అంతర్జాతీయ పీఐక్లబ్బులదే..     ఇవి ఎక్కువగా పాశ్చాత్య దేశాల ఆధిపత్యంలో ఉన్న సంస్థలు. రష్యా చమురుపై ఆంక్షల కారణంగా ఇప్పటి వరకూ ఈ క్లబ్బులు రష్యా సరుకులకు దూరంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా చమురుతో నిండిన ట్యాంకర్లకు రష్యన్ బీమా సంస్థలే ప్రధాన ఆధారం. ఇప్పుడు ఇండియా.. ఆ సంస్థలను అధికారికంగా గుర్తించడమే కాకుండా..  పాశ్చాత్య బీమా వ్యవస్థకు వెలుపల ఒక ప్రత్యామ్నాయ భద్రతా వలయం సృష్టిస్తోంది. బీమా లేకుండా చమురు కదలదు.. చమురు కదలకపోతే.. ఆర్థిక వ్యవస్థ  స్తింభించిపోతుంది. భారత్ తీసుకున్న నిర్ణయానికి ఇదే కారణం అనడంలో సందేహం లేదు.  
 ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి ఇప్పుడు హై రిస్క్ జోన్ గా మారింది. ఇరాన్ చమురు, గల్ఫ్ సరఫరాలపై అనిశ్చితి పెరగడంతో..  భారత్ తాత్కాలిక మినహాయింపులను ఉపయోగించి రష్యా చమురుపై ఆధారపడుతోంది.

భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దారు. అలాగే చమురు వినియోగదారు కూడా. దీంతో చమురు సరఫరా గొలుసులో చిన్నపాటి అంతరాయం కూడా భారత్  లో ద్రవ్యోల్బణం, కరెన్సీ ఒత్తిడి, వాణిజ్య లోటు, పరిశ్రమల ఇంధన వ్యయంపై విపరీతమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.  

ఇకపోతే.. చమురు రవాణాలో సముద్ర బీమా ఎందుకు కీలకం అంటే..  పర్యావరణ ప్రమాదం, వ్యక్తిగత గాయాలు, నష్టం, శుద్ధి ఖర్చులు  వంటి భారీ బాధ్యతలకు గురయ్యే అవకాశం ఉంది.  అందుకే అండ్ ఐ  కవరేజీ లేకుండా పెద్ద ట్యాంకర్లు ప్రయాణించడాన్ని చాలా దేశాలు, పోర్టులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు అంగీకరించవు. పాశ్చాత్య బీమా సంస్థలు రష్యా చమురుకు దూరంగా ఉంటే..  రష్యన్ బీమా + భారత గుర్తింపు అనే మోడల్ తప్ప మరో మార్గం లేదు.
భారత్ తన నిర్ణయం ద్వారా మీ ఆంక్షలు మీవి.. అవసరం మాది అన్న స్పష్టమైన సంకేతాలు పంపిందని చెప్పవచ్చు.  
1. ఇంధన భద్రత ముందుగా  జియోపాలిటిక్స్, ఆంక్షలు, బ్లాకులు అన్నీ ఒక వైపు, దేశీయ ఇంధన అవసరాలు, ధరల స్థిరత్వం మరో వైపు.
2. బహుళ ధ్రువ ప్రపంచానికి అనుగుణంగా ,  పాశ్చాత్య బీమా వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రష్యా–దుబాయ్ బీమా నెట్వర్క్ను అంగీకరించడం.
3.  రష్యా చమురు సరఫరా కొనసాగుతుంది” అనే స్పష్టమైన సందేశం. దీని వల్ల ఫ్యూచర్స్ మార్కెట్లలో కూడా కొంత స్థిరత్వం ఎర్పడుతుంది.  

తక్కువ ధరల రష్యా చమురు వల్ల ఇండియా ఇంధన దిగుమతి బిల్లు గణనీయంగా తగ్గుతుంది. దీని వల్లఅ ఫ్యూయెల్ సబ్సిడీల ఒత్తిడీ తగ్గుతుంది.  అలాగే పరిశ్రమల ఇన్ పుట్ వ్యయాలు నియంత్రణలో ఉంటాయి.  అదే సమయంలో పాశ్చాత్య ఆంక్షల వ్యవస్థకు వెలుపల ఎక్కువగా నడవడం వల్లఫైనాన్షియల్, ఇన్సూరెన్స్, షిప్పింగ్ రంగాల్లో  గ్రే జోన్  రిస్క్ పెరుగుతుంది.   ఇవి అన్నీ కలిపి చూస్తే..  భారత్ ఒక స్పష్టమైన సందేశం ఇస్తోందని స్పష్టమౌతుంది.  ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం,  ఇవి మా కోసం చర్చకు లేని ప్రాధాన్యతలు. ఇది కేవలం చమురు కథ కాదు. ఇది భారత విదేశాంగం, ఆర్థిక వ్యూహం, మరియు బహుళ ధ్రువ ప్రపంచంలో తన స్థానాన్ని మళ్లీ నిర్వచించుకునే ప్రక్రియలోని మరో కీలక అధ్యాయం.

సంకలనం, సంచలనం : సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
ఏపీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు.. కేబినెట్ సంచలన నిర్ణయం..
అభయాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించిన 2,750 గజాల విలువైన భూమి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలు తీవ్రరూపం దాల్చాయి.
సిలికాన్ సిటీలో ట్రిపుల్ మర్డర్ కలకలం..
మహారాష్ట్రలోని చారిత్రాత్మక లోహగఢ్‌ కోట పర్యాటక ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక యువ వ్యాపారవేత్త మరణం కేసులో ఊహించని మలుపు తిరిగింది.
లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయ టకు తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీ పంలోని ఆస్పత్రులకు తర లించి చికిత్స అందిస్తు న్నారు.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకంలో రోజుకు రూ.100 చొప్పున నెలసరి రూ.3000 పొదుపు చేయడం ద్వారా 6.7% వడ్డీతో ఐదేళ్లలో రూ.2.14 లక్షల కంటే ఎక్కువ మెచ్యూరిటీ మొత్తాన్ని ఎలా పొందాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
పాన్-ఆధార్ కార్డుల లింకింగ్ గడువు ముగిసింది. రూ. 1,000 జరిమానాతో ఆన్‌లైన్‌లో మీ అకౌంట్ యాక్టివేట్ చేసుకోండి. లేదంటే 20% టీడీఎస్ కట్ అవుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జూన్ 23 మంగళవారం నాడు దేశీయంగా బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడి రేట్లు ఎంత తగ్గాయో మరియు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో నేటి లేటెస్ట్ ధరల పూర్తి వివరాలు మీకోసం.
అమెరికా ప్రభుత్వ భూముల్లో చమురు, గ్యాస్ తవ్వకాలు జరిపే సంస్థల ఖర్చులను భారీగా తగ్గిస్తూ ట్రంప్ సర్కార్ సంచలన ప్రతిపాదనలు చేసింది. బాండ్ల ధరలను భారీగా తగ్గించడంతో పాటు పర్మిట్ల గడువును కుదించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ ఆసియా సంయుక్త అధిపతిగా హరి గోపాలకృష్ణన్ నియమితులయ్యారు. భారత్‌లో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ప్రైవేట్ ఈక్విటీ వృద్ధిపై ఈక్యూటీ సరికొత్త వ్యూహాలు మరియు గణాంకాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
చాట్‌జీపీటీ మేకర్ OpenAIతో గెట్టి ఇమేజెస్ (Getty Images) చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భారీ మల్టీ-ఇయర్ డీల్ ప్రభావంతో గెట్టి ఇమేజెస్ స్టాక్ ఒక్కసారిగా 145 శాతం పైగా పెరిగి రికార్డు సృష్టించింది. ఈ ఆసక్తికరమైన బిజినెస్ సక్సెస్ స్టోరీ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆయిల్ పామ్ సాగుపై 44 శాతం దిగుమతి సుంకం పునరుద్ధరణ, రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్ యూరియా పూర్తి కేటాయింపులతో పాటు తెలంగాణ పారిశ్రామిక ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి శ్రీధర్ బాబు జరిపిన కీలక భేటీ వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.