బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా

Publish Date:Jul 7, 2022

Advertisement

బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడటంతో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. ప్రధాని బోరిస్ రాజీనామా డిమాండ్ తో ఆయన మంత్రివర్గంలోని 15 మంది మంత్రులు రాజీనామా చేయడంతో పదవిని పట్టుకు వేళాడడానికి బోరిస్ చేసిన ప్రయత్నాలు  విఫలమయ్యాయి.

  బోరిస్ ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడంతో  తొలుత ఈ నెల 5న ఆర్థిక మంత్రి రుషి సూనక్, ఆర్థిక శాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ రాజీనామా చేశారు. వారితో మొదలైన మంత్రుల రాజీనామాల పర్వం చివరిగా రాజీనామా చేసిన 15 మందితో కలిసి మొత్తంగా ప్రభుత్వం నుంచి వీడిన వారి సంఖ్య 40కి చేరుకుంది. వీరందరి డిమాండ్ ప్రధానిగా బోరిస్ వైదొలగడమే కావడంతో ముందర ‘తగ్గేదే’ లేదంటూ ధీమా ప్రదర్శించిన బోరిస్ చివరికి రాజీనామా చేయక తప్పలేదు. నేర చరిత్ర ఉన్న క్రిస్ పించర్ ను కీలక పదవిలో బోరిస్ నియమించడంతో వివాదం ఆరంభమై చివరికి ప్రధాని పదవి నుంచి బోరిస్ వైదొలిగే వరకూ వచ్చింది.

గతంలో ఒక సారి విశ్వాస పరీక్ష ను గట్టెక్కిన బోరిస్ ఈ సారి మాత్రం వ్యతిరేకతకు తలొగ్గి రాజీనామా చేయక తప్పలేదు. దాదాపు నెల రోజుల కిందట జరిగిన పార్లమెంటరీ స్థానాల ఉప ఎన్నికలలో అధికార కన్జర్వేటరీ అభ్యర్థులు పరాజయం పాలైనప్పుడే బోరిస్ సర్కార్ మునిగిపోయే నావగా పరిశీలకులు అభివర్ణించారు. వారి విశ్లేషణలు సరైనవేనని గురువారం (జూలై 7) ప్రధాని పదవికి బోరిస్ రాజీనామా చేయడంతో రుజువైంది.

రాజీనామా చేసిన బోరిస్ మాట్లాడుతూ తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకూ ఆపద్ధర్మ ప్రధానిగా కోనసాగుతానని చెప్పారు. అక్టోబర్ నాటికి నూతన ప్రధాని ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.  నూతన ప్రదానిగా బోరిస్ కు వ్యతిరేకంగా తొలుత రాజీనామా చేసిన భారత సంతతికి చెందిన రుషి సూనక్ ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

దాదాపుగా మూడేళ్లు బ్రిటీష్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన బోరిస్ రాజీనామా అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ పదవిని వీడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానిగా తన విజయాల పట్ల గర్వంగా ఉందనీ, అదే సమయంలో ప్రధానిగా తన వైఫల్యాల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాననీ పేర్కొన్నారు. సహచర కన్జర్వేటివ్ ఎంపీలు, మంత్రివర్గ సహచరుల నిర్ణయాన్ని శిరసావహిస్తూ రాజీనామా చేసినట్లు చెప్పారు. 

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.