జైస్వాల్ మనసుదోచిన బ్రిటిష్ సుందరి మ్యాడీ హామిల్టన్

Publish Date:Apr 9, 2026

Advertisement

 

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్  యశస్వి జైస్వాల్ ప్రస్తుతం ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ, తన అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. కే మైదానంలో తన బ్యాటింగ్ పరాక్రమంతోనే కాకుండా, ఇప్పుడు  వ్యక్తిగత జీవితం ద్వారా కూడా వార్తల్లోకెక్కుతున్నాడు.  యశశ్వి ఒక విదేశీ భామతో ప్రేమలో ఉన్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో  తెగ వైరల్ గా మారింది. ఆ లక్కీ లేడీ ఎవరంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. 

జైశ్వాల్  ఒక విదేశీ యువతితో తరచుగా కనిపిస్తుండటంతో అభిమానులలో ఆసక్తి నెలకొంది. ఆమె పేరు మ్యాడీ హామిల్టన్.   బ్రిటిషర్ అయిన ఈమెతో జైస్వాల్ ప్రేమలో ఉన్నాడని చెబుతున్నారు. వీరిద్దరి మధ్యా గత నాలుగేళ్లుగా పరిచయం ఉందని సమాచారం.  

మ్యాడీ హామిల్టన్ గురించి సోషల్ మీడియాలో పరిమిత సమాచారమే ఉన్నప్పటికీ, జైస్వాల్‌కు ఆమె అత్యంత సన్నిహితురాలని అంటున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. వీరిద్దరి మధ్యా గత నాలుగేళ్లుగా.. అంటే 2022 నుంచీ మంచి అనుబంధం ఉందని నెట్టింట వార్తలు హల్ చెల్ చేస్తున్నాయి.  ఇక 2024 ఐపీఎల్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లను చూసేందుకు మ్యాడీ స్టేడియానికి రావడంతో మొదటిసారి వీరి అనుబంధం గురించి ప్రపంచానికి తెలిసింది.  2025లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో శతకం బాదిన తర్వాత గ్యాలరీలో ఉన్న మ్యాడీ వైపు చూస్తూ సైస్వాల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, హార్ట్ ఎమోజీని చూపించడం కెమెరా కంటికి చిక్కడంతో వీరి బంధం మరింత ప్రస్ఫుటంగా అందరికీ తెలిసింది.  

అతి చిన్న వయసులోనే కటిక పేదరికం నుంచి స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన   జైస్వాల్ ప్రస్తుతం  అటు కెరీర్ పరంగానూ, ఇటు వ్యక్తిగత జీవితం పరంగానూ ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మ్యాడీ హామిల్టన్ ఆయనకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తున్నట్లు సమాచారం. ఈ యువ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, మైదానంలో వారు పంచుకున్న భావోద్వేగాలు వారి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుతున్నాయి.  

By
en-us Political News

  
న్యాయ వివాదాల పరిష్కార ప్రక్రియలో, ముఖ్యంగా మధ్యవర్తిత్వ రంగంలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
దేశ రాజకీయాల్లో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ గాయని సత్యవతి ముడావత్ (మంగ్లీ) ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన ఓ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది.
ఆశా భోంస్లే మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తున్నారు
నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే
పెళ్లి పీటలపై కట్నం డబ్బుల కోసం డిమాండ్ చేయడం గానీ, ఇతర వివాదాస్పద కోర్కెలతో పెళ్లి ఆగిపోవడం గానీ మనం విన్న విషయాలే.
భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక అడుగు వేసింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఓ వాహనదారుడు వేసిన కొత్త ఎత్తు చివరకు పోలీసులకే షాక్ ఇచ్చింది.
అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి తన కఠిన వైఖరిని రుచిచూపించింది.
వయసు పైబడితే చాలు విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. 60 ఏళ్లు దాటాయంటే మోకాళ్ల నొప్పులని, ఓపిక లేదని ఇంటికే పరిమితమవుతారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం శనివారం ఒక అరుదైన మరియు ఆత్మీయ దృశ్యానికి వేదికైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.