ప్రేమికులు, దంపతులు ఇలా ఎవరి మధ్య అయినా ముద్దు.. ముచ్చట ఉంటేనే వారి బాంధవ్యం కలకాలం నిలుస్తుందంటారు. అలాంటిది ఒక్క ముద్దు జస్ట్ ఒక్క ముద్దు పీటల మీదే పెళ్లిని పెటాకులు చేసేసింది. ఎలాగూ మూడుముళ్లూ వేస్తాను కదా అన్న ధీమాతో దండలు మార్చుకున్న వెంటనే పెళ్లి పీటల మీదనే కొంటెగా చిరు ముద్దు పెట్టాడు. అంతే పెళ్ల కుమార్తెకు చిర్రెత్తుకొచ్చింది.
ఈ మొగుడు నాకు వద్దంటే వద్దని పీటల మీద నుంచి లేచి చక్కా వెళ్లి పోయింది. సర్ది చెప్పడానికి పెళ్లి పెద్దలు, తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరికి పెళ్లి కొడుకు క్షమాపణలు చెప్పినా కాదు పొమ్మంది. దీంతో ఈ పంచాయతీ పోలీసుల వరకూ కూడా వెళ్లింది. ఒకింత ఆశ్చర్యం కలిగించే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో సంభల్ జిల్లాలో పరిగింది. బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిస్లీ గ్రామానికి చెందిన ఓ యువకుడికి, సంభల్ జిల్లా పవాసకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. నవంబర్ 26న ముహూర్తం ఫిక్స్ చేశారు. అంత వరకూ బానే ఉంది.
దండలు మార్చుకున్న తరువాత వధువుకు వరుడు ముద్దు పెట్టాడు. ఆ ముద్దే వధువుకు కోపం తెప్పించింది. వెంటనే పెళ్లిపీటల పై నుంచి లేచి వెళ్లిపోయింది. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పంచాయతీ పోలీసుల వరకూ వెళ్లింది. అందరి ముందూ ముద్దు పెడతాడా అని పెళ్లి కూతురు కోపగించింది. అతడు భర్తగా వద్దే వద్దని భీష్మించింది. చివరకు చేసేదేం లేక పెళ్లి రద్దు చేసుకుని ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bride-rejects-marriage-as-geoome-kissed-her-25-147951.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.