బ్రాహ్మణి.. తెలుగుదేశం అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం!

Publish Date:Sep 19, 2023

Advertisement

నారా బ్రాహ్మణి.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు కోడలు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమార్తె. ఇప్పటి వరకూ ఆమె  రాజకీయ యవనికపై కనిపించలేదు. వినిపించలేదు. కుటుంబ వ్యాపారం చూసుకుంటున్నారు. అయితే  తెలుగుదేశం పార్టీకి ఆమె ఒక నాయకురాలిగా ఆవిర్భవించారు. సంక్షోభం నుంచి నేతలు పుట్టుకొస్తారు అన్న నానుడికి నిలువెత్తు సాక్ష్యంగా ఇప్పుడు నారా బ్రాహ్మణి తెలుగుదేశం నాయకురాలిగా ఆవిష్కృతమయ్యారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని జగన్ సర్కార్ స్కిల్ స్కాం పేర నిబంధనలను తుంగలో తొక్కి అరెస్టు చేసిన సమయంలో అప్పటి వరకూ ప్రణాళికా బద్ధంగా ఎన్నికలకు సమాయత్తమౌతున్న తెలుగుదేశం పార్టీలో ఒక కుదుపు ఏర్పడింది. జిల్లాల పర్యటనల్లో ఉన్న చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చి.. తండ్రి అరెస్టుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే పనిలో హస్తినలో ఉన్నారు. మిగిలిన నేతలంతా.. చంద్రబాబు అరెస్టునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో ఎక్కడికక్కడ బిజీగా ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకూ రాజకీయాల ఊసే ఎత్తని నారా బ్రహ్మణి ధైర్యంగా నేనున్నానంటూ ముందుకు వచ్చారు. భర్త  ఢిల్లీలో ఉంటే.. తాను జనంలోకి వస్తానంటూ ముందుకు వచ్చారు. ఒక్క మీడియా సమావేశంతో ఆమె రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో అందరి అట్రాక్షన్ ను తన వైపునకు తిప్పుకున్నారు. మీడియా ప్రతినిథుల ప్రశ్నలకు నదురూబెదురూ లేకుండా ఆమె ఇచ్చిన సమాధానాలు అందరికీ ఆకట్టుకున్నాయి. స్పష్టమైన అవగాహనతో  జగన్ సర్కార్ తీరును ఎండగట్టిన తీరు బ్రాహ్మణిలోని నాయకత్వ పటిమను ఎత్తి చూపింది. తెలుగుదేశం అధినేత  చంద్రబాబును అరెస్టు చేయడంలోని ఔచిత్యాన్ని ఆమె  ప్రశ్నించిన తీరు మహామహా  రాజకీయ నాయకులనే అబ్బురపరిచింది. భర్త అరెస్టుతో దిగాలు పడిన అత్తగారు భువనేశ్వరికి  ఒక పక్క ధైర్యం చెబుతూనే..  మొత్తం పార్టీ శ్రేణులకు కూడా ఆందోళన వద్దు నేనున్నానన్న భరోసా ఇచ్చారు. 

తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు తర్వాత, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  లోకేష్‌ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.హస్తిన నుంచి రాజమహేంద్రవరం చేరుకోగానే లోకేష్‌ను కూడా అరెస్టు చేసి.. తెలుగుదేశం ధైర్యాన్ని, స్థైర్యాన్నీ నిర్వీర్యం చేసే లక్ష్యంతో జగన్ సర్కార్ పావులు కదుపుతోందన్న వార్తల నేపథ్యంలో  నారా బ్రాహ్మణి ముందుకు వచ్చారు. తన భర్తనూ అరెస్టు చేయవచ్చు.. ఇంకా ఇతర నాయకులను కూడా అరెస్టు చేసినా చేస్తారు. అయినా తెలుగుదేశం బెదరదు, అదరదు అంటూ నినదించారు.

ఒక వైపు  లోకేష్ ఢిల్లీలో న్యాయకోవిదులతోపాటు, జాతీయ మీడియా ప్రతినిధులుతో వరస భేటీలు అవుతున్నారు.  జాతీయ మీడియాలో లోకేష్ లైవ్ టాక్ షోలు, ఇంటర్వ్యూలు  అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో బాబు అరెస్టుకు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా వెల్లువెత్తుతున్న నిరసనలు, జాతీయ మీడియాలో జగన్ సర్కార్ అడ్డగోలు, అరాచక విధానాలను లోకేష్ ఎండగడుతున్న తీరు కేంద్రంపై కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించక తప్పని ఒత్తిడిని రోజురోజుకూ పెంచుతోంది. 

ఇక మరో వైపు చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా చూస్తే  చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా దేశం మొత్తం నిరసన గళం వినిపిస్తున్నది. ఇదంతా ఒకెత్తు అయితే.. నారా బ్రాహ్మణి చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. పార్టీ శ్రేణులకు ధైర్యాన్నిస్తూ రాజకీయ యవనికపై అడుగుపెట్టడం తెలుగుదేశం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. 

తెలుగుదేశం పార్టీకి గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారన్న వార్తలు.. ఎంత కాదనుకున్నా ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా పరిణమించాయి. జూనియర్ ఎన్టీఆర్ వినా మొత్తం నందమూరి కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నప్పటికీ.. పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు అది వేరే సంగతి. కానీ జూనియర్ ఎన్టీఆర్ దూరం మాత్రం ఎలా చూసినా తెలుగుదేశం పార్టీ జవాబు చెప్పుకోవలసిన అంశంగా ఇంత కాలం.. అంటే నారా బ్రాహ్మణి  మీడియా ముందుకు వచ్చే వరకూ ఉంటూ వచ్చింది. ఆమె రాజకీయ అరంగేట్రం.. రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంతో ఘనంగా చేశారు. ఎన్టీఆర్ వారసత్వం మొత్తం తెలుగుదేశం పార్టీతోనే ఉందన్న సంకేతాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఆమె వైఫ్ ఆఫ్ లోకేష్ మాత్రమే కాదు.. డాటరాఫ్ నందమూరి బాలకృష్ణ.   

ఇంత కాలం హెరిటేజ్ వ్యవహారాలు చూసుకునే యువ వ్యాపార వేత్తగా మాత్రమే అందరికీ తెలిసిన బ్రాహ్మణి.. రాజమహేంద్రవరంలో మీడియా ఎదుట స్కిల్ స్కామ్ పేరుతో జగన్ సర్కార్ ఎంత అడ్డగోలుగా, ఎంత అప్రజాస్వామికంగా తన మామ, పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిందో వివరించిన తీరు.. పొలిటికల్ గా ఆమె పరిణితికి అద్దం పట్టాయి. తన మీడియా సమావేశంలో ఆమె ఎక్కడా ఏపీ సీఎం జగన్ పేరెత్తలేదు. పూర్తిగా చంద్రబాబుపై బనాయించిన కేసులు, వాటి డొల్ల తనం, అరెస్టు వెనుక ప్రస్ఫుటంగా కనిపిస్తున్న కక్ష సాధింపు ధోరణి వంటి అంశాలకే పరిమితమై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన తీరు బ్రాహ్మణిలోని నాయకురాలిని ప్రపంచానికి చాటింది. ఉన్నత విద్యావంతురాలైన బ్రహ్మణి  విద్యాభ్యాసం మొత్తం ఇంగ్లీషు మీడియం అయినా ఆమె తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా ఉంది. మీడియా ప్రశ్నలకు బదులీయడంలో ఎక్కడా తడబాటు కనిపించలేదు. తొట్రుపాటు కనిపించలేదు.  తన భర్త లోకేష్‌ను కూడా అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయనను కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయనీ, అయినా తామేమీ భయపడేది లేదనీ చాటిన బ్రహ్మణి.. ఒక దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి తెలుగుప్రజలంతా  అండగా ఉండాలంటూ ఇచ్చిన పిలుపు నేరుగా ప్రజల మనస్సులలో నాటుకుంది.

ఆమె ఒక్క పిలుపుతో రా ష్ట్రంలో మహిళాలోకం ఒక ప్రభంజనంలా కదిలారనడానికి రాజమహేంద్రవరంలో బ్రాహ్మణి, భువనేశ్వరి పాల్గొన్న కొవ్వొత్తుల ప్రదర్శన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలే సారథులుగా నిరసన ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి.  అన్ని వర్గాల ప్రజలూ భయం వీడి రోడ్లెక్కి బాబుకు మద్దతుగా ఆందోళన బాట పట్టారు.   ఇక  నెటిజన్లు అయితే   నందమూరి తారకరామారావు నిజమైన వారసురాలు బ్రాహ్మణియే అంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.  మొత్తం మీద నారా బ్రాహ్మణి నందమూరి, నారా కుటుంబాల నుంచి వచ్చిన మరో సమర్ధవంతమైన, ప్రతిభామంతమైన నాయకురాలిగా జనం మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారనడంలో సందేహం లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.