Publish Date:Apr 10, 2026
పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ప్రియుడు ప్రియురాలికి ఇంజక్షన్ ద్వారా ఎయిడ్స్ రక్తంఎక్కించిన ఘటన తీవ్ర సంచ లనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో కూడా తన ఇష్టానికి వ్యతిరేకంగా కుమార్తె ప్రేమ వివిహం చేసుకోవడానికి సిద్ధపడటంతో కుమార్తెకు సిరెంజి ద్వారా ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తాడు. సరిగా జనగాం జిల్లాకు చెందిన మనోహర్ తనతో వివాహానికి నిరాకరించిందన్న కోపంతో ప్రియురాలు రమణికి ఎయిడ్స్ రక్తం ఎక్కించాడు. అయితే మనోహర్ ఎయిడ్స్ రక్తం ఎక్కించిన యువతి ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెడితే.. యువతి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో చీకట్లు కమ్ముకున్నాయి.
జనగాం జిల్లాకు చెందిన మనోహర్ కుటుంబం 13 ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి పోచారం పరిధిలో నివాసం ఉంటున్నారు. మనోహర్ మరదలు రమణి హైదరా బాద్ నగరంలోని పోచారం ఐటి కారిడార్ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ కొద్ది కాలం కిందటే వివాహం నిశ్చయమైంది. అయితే.. హెచ్ఐవి పాజిటివ్ తో ఇటీవల మనోహర్ తల్లి మరణించింది. మనోహర్ తండ్రికి కూడా ఎయిడ్స్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
దీంతో మనోహర్ కూడా ఎయిడ్స్ ఉండి ఉండొచ్చని భావించిన రమణి తల్లిదండ్రులు పరీక్ష చేయిస్తే మనోహర్ కు కూడా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రమణి మనోహర్ ను వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహం చెందిన మనోహర్ ఎయిడ్స్ రక్తంతో ఉన్న ఇంజక్షన్ యువతికి ఇస్తే తనకు కూడా ఎయిడ్స్ వస్తుందని అప్పుడు తనను వివాహం చేసుకుంటుందని భావించాడు.
పథకం ప్రకారం.. మార్చి 11న రమణ కి బలవంతంగా ఇంజక్షన్ ద్వారా ఎయిడ్స్ రక్తం ఎక్కించాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు మనోహర్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే ఎయిడ్స్ రక్తాన్ని తనకు సిరంజి ద్వారా ఎక్కించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమణి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం (ఏప్రిల్ 10) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/boyfriend-transfuses-aids-infected-blood-36-217073.html
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియోలోని వి మార్క్ ఇండియా మల్టీబ్యాగర్ స్టాక్ ఒక్కరోజే 81% పతనమైందా ఇన్వెస్టర్లు ఎందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదో, 5:1 బోనస్ షేర్ల వెనుక ఉన్న అసలు మార్కెట్ లెక్కలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.
కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 8 శాతం పడిపోయాయి. ఆదాయం పెరిగినప్పటికీ, ప్రత్యర్థి టైటాన్ కంపెనీ ఫలితాల ప్రభావం మరియు మార్కెట్ అంచనాల వల్ల ఈ భారీ పతనం సంభవించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నోబుల్ సంస్థ సరికొత్తగా తెచ్చిన నోబుల్ ఆస్ప్రే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ పూర్తి రివ్యూ. $199 ధర, బ్లూటూత్ 6.0, LDAC సపోర్ట్ ఉన్నా ఈ ఇయర్‌బడ్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయో ఇక్కడ చదవండి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వైరల్ హిట్ నింజా లక్స్ కేఫ్ ప్రీమియర్ ఎస్ప్రెస్సో మెషిన్‌పై ఏకంగా 53% భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఆస్ట్రేలియాలో ఆల్-టైమ్ లో ధరకు దొరుకుతున్న ఈ త్రీ-ఇన్-వన్ కాఫీ మేకర్ ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ చూడండి.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు కానుందా? రాబోయే 12 నెలల్లో సెన్సెక్స్ లక్ష మార్కును తాకడానికి ఉన్న అవకాశాలు, బుల్ మార్కెట్ ర్యాలీని ప్రేరేపించే కీలక ఆర్థిక అంశాలపై మోర్గాన్ స్టాన్లీ Morgan Stanley నివేదిక పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో సెన్సెక్స్ వచ్చే 12 నెలల్లో 1,00,000 మార్కును తాకే అవకాశం ఉందని గ్లోబల్ బ్రోకరేజ్ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. మార్కెట్ తదుపరి భారీ ర్యాలీకి కారణమయ్యే బుల్, బేస్, బేర్ కేస్ సినారియోల పూర్తి వివరాలు మీకోసం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI బ్యాంకింగ్ రంగంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వినియోగంపై కొత్త డ్రాఫ్ట్ రూల్స్ తెచ్చింది. మోడల్ రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం తెచ్చిన ఈ నిబంధనలతో బ్యాంకింగ్ రంగంలో ఏఐ గవర్నెన్స్, మోడల్ వాలిడేటర్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జూలై 7న దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 100 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ఏకంగా రూ. 13,600 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ సహా మీ నగరంలో నేటి 22K, 24K పసిడి లేటెస్ట్ రేట్లను ఇప్పుడే తెలుసుకోండి!