నేను సైతం అంటున్న బొత్స

Publish Date:Nov 30, 2013

Advertisement

 

పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ నిన్న ఒక మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఏర్పాటుకి చాలా తీవ్రంగా కసరత్తు చేస్తున్నపటికీ, సాంకేతిక లేదా రాజకీయ కారణాల వలన రాష్ట్ర విభజన జరగకపోవచ్చని నా రాజకీయ అనుభవంతో చెపుతున్నాను’ అని చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉంది.

 

ఇంతవరకు సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, కేంద్రమంత్రులు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగబోదని చివరి వరకు హామీలు గుప్పిస్తూ, రాజినామాలంటూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. ఇప్పుడు వారే ప్యాకేజీల గురించి గట్టిగా కృషిచేస్తున్నట్లు మీడియా ముందు చాలా హడావుడి చేయడం ప్రజలు చూస్తూనే ఉన్నారు.

 

ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగబోదని గట్టిగా హామీలు ఇచ్చినవారు ఇప్పుడు ప్యాకేజీల గురించి పోరాడుతుంటే, “హిందీ ఓళ్ళకి పది రాష్ట్రాలుండగా, మనోళ్ళకి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేటి?” అంటూ నిన్నమొన్నటి వరకు రాష్ట్ర విభజన సమరిస్తూ వచ్చిన బొత్ససత్యనారాయణ, ఇక నేడో రేపో రాష్ట్ర విభజన జరగబోతున్న ఈ తరుణంలో తను సమైక్యవాదినని, రాష్ట్ర విభజన జరుగకపోవచ్చునని అనడంలో ఉద్దేశ్యం ఏమిటి?

 

రాజకీయ లేదా సాంకేతిక కారణాలతో విభజన ప్రక్రియ ఆగిపోవచ్చని ఆయనకు తెలిసిన విషయం మరి కాంగ్రెస్ అధిష్టానానికి తెలియదా లేక తెలిసినప్పటికీ ఏమి తెలియనట్లు ముందుకు సాగుతోందనుకోవాలా? లేకపోతే కాంగ్రెస్ అధిష్టానానికి ఈ విషయంపై ఉన్న అవగాహన, వ్యూహం గురించి బొత్సకే అవగాహన లేదనుకోవాలా? రాష్ట్రంలో తమ కాంగ్రెస్ నేతలే ఈ గందరగోళానికి కారకులని చెపుతున్న బొత్ససత్యనారాయణ మరి తను చేస్తున్నదేమిటి?

By
en-us Political News

  
ప్రధాని మోడీ  ఎపి పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ప్రధాని విఖాఖ రానున్నారు. సిరిపురం జంక్షన్‌లో రోడ్‌షో, ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
 పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 25 ( సోమవారం)  నుంచి ప్రారంభం కానున్నాయి.  ఈ  నేపథ్యంలో  అఖిల పక్ష సమావేశం ఆదివారం జరిగింది.  కేంద్ర పార్లమెంటరీ  వ్యవహారాల శాఖామంత్రి కిరణ్ రిజిజు  పార్లమెంటు ఉభయసభల్లో వివిధ రాజకీయ పార్టీల  నేతలతో సమావేశమయ్యారు.
వరంగల్ స్మశాన వాటిక నుంచి గుజరాత్ వెళ్లిపోతానని ప్రకటించిన వివాదాస్పద అఘోరీ మళ్లీ ఎపిలో ప్రత్యక్షమైంది. కర్నూలు జిల్లాలో  పెట్టుడు మీసం, గడ్డంతో కనిపించి
  బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.  ఎపికి మరో మారు తుఫాను ముప్పు పొంచి ఉంది.  నవంబర్ 25న (సోమవారం) వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు ఎంత భంగం కలిగించాలో అంతా కలిగించారు. తిరుమల కొండపై పారిశుద్ధ్యం అధ్వానంగా మార్చేశారు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నాశనం చేశారు. కలియుగ వైకుంఠంగా భక్తులు భావించే తిరుమలలో జగన్ హయాంలో ఎన్ని అరాచకాలు జరగాలో అన్ని అరాచకాలూ జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వంద శాతం ఫలితాలను సాధించిన జనసేన.. ఆ మ్యాజిక్ ను మళ్లీ మహారాష్ట్రలో రిపీట్ చేసింది. మహారాష్ట్ర ఎన్నికలలో జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగింది. రోజంతా చలి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం (నవంబర్ 25) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు సహా మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటిలో ఐదు కొత్త బిల్లులు ఉన్నాయి. అయితే అందరి దృష్టీ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపైనే ఉంది.
వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ పార్టీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. పార్టీకీ, ఎమ్మెల్సీ పదవికీ కూడా రాజీనామా చేస్తూ తన రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపారు. కైకలూరుకు చెందిన జయమంగళం వెంకటరమణ గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
జగన్ అధికారంలో కొన‌సాగిన ఐదేళ్లూ సోష‌ల్ మీడియాలోనూ, మీడియా స‌మావేశాల్లోనూ ప్రత్యర్థి పార్టీ నేతలపై, ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్, ఆ పార్టీ నేతలు, అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అస‌భ్య‌, అనుచిత వ్యాఖ్యలతో వైసీపీ నేత‌లు రెచ్చిపోయారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా చంద్ర‌బాబు, ప‌వ‌న్ కల్యాణ్‌, లోకేశ్ , వారి కుటుంబాల్లోని ఆడ‌వారిపైనా ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా అస‌భ్య‌ పోస్టులు పెట్టి రాక్ష‌సానందం పొందారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కొరియో గ్రాఫర్ కు తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఇక వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. వీటిలో ప్రధానంగా కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గ ఫలితంపై సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.