బొత్స మండలిలో ప్రతిపక్ష నేత?

Publish Date:Aug 15, 2024

Advertisement

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లే. కూటమి నుంచి అభ్యర్ధిని నిలుపకపోవడమే అందుకు  కారణం. బొత్స ఎన్నిక కాగానే ఆయనను మండలిలో ప్రతిపక్ష నేత గా పార్టీ ప్రకటిస్తుందని వైసీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. బొత్స బలంగా మండలిలో తమ పార్టీ వాణిని వినిపిస్తారని జగన్ నమ్ముతున్నారు. మండలిలో వైసీపీ కి బలం ఎక్కువ గానే ఉంది. ప్రస్తుతం మండలిలె వైసీపీ పక్ష నేతగా అప్పిరెడ్డి వ్యవహరిస్తున్నారు. జగన్ కు అసెంబ్లీ కి వచ్చే ఆలోచన లేకపోవడానికి తనను ప్రతిపక్ష నేతగా స్పీకర్ అంగీకరించకపోవడం కూడా ఒర కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు.

అందుకే మండలిలో పార్టీ వాణిని గట్టిగా వినిపించేందుకు బొత్సను ఎమ్మెల్సీ అభ్యర్థిగా   జగన్ ఎంపిక చేశారంటున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికలో మొత్తం  849 ఓట్లు ఉంటే వాటిలో కూటమికి 200 వరకూ ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇటీవల వైసీపీ నుంచి చేరికలతో  మరో వంద ఓట్లు కూటమికి దఖలు పడ్డాయని  సమాచారం. ఇంకా వైసీపీకి ఐదు వందల పైగా ఓట్లు ఉన్నాయని, వారిని ఇప్పటికే వైసీపీ క్యాంప్ లకు తరలించింది. మాజీ సీఎం జగన్ వారితో మాట్లాడుతూ వేరే వారికి ఓటు వేసి తన పరువు తీయవద్దని విజ్ఞప్తి  కూడా చేసారు. బొత్స అయితే గట్టి అభ్యర్థిగా పోటీ ఇస్తారని భావించారు.

అయితే బలం లేని చోట పోటీ చేయడం చంద్రబాబుకు  ఇష్టం లేదు. అంతేకాక అధికారంలోకి వచ్చి రెండు నెలల్లో పోటీ చేసి ఓటమి పాలు కావడం కంటే, లేదా పెద్ద సంఖ్యలో వైసీపీ నుంచి స్ళానిక సంస్థల ప్రతినిధులను పార్టీలో చేర్చుకుని బరిలోకి దిగడం కంటే  పోటీకి దూరంగా ఉండటమే మేలని చంద్రబాబు భావిస్తున్నారు.  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సామ దాన బేధ దండోపాయాల ద్వారా స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు మాత్రం అటువంటి అప్రజాస్వామిక విధానాలను అవలంబించడానికి ఇష్టపడటం లేదు. దీంతో విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీకి కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించారు.  

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.