చట్ట సభల్లో ఉభయ రాష్ట్రాలదీ ఒకటే తీరు..
Publish Date:Mar 7, 2022
Advertisement
చట్ట సభలలో రాజకీయ ప్రసంగాలు చేయరాదనే నిబంధన ఏదైనా వుందో లేదో గానీ, మన దేశంలో చాలా వరకు చట్ట సభలు రాజకీయ వేదికలను మించి రాజకీయ చర్చలకు వేదిక అవుతున్నాయి. అవును, పార్లమెంట్ మొదలు పంచాయతీ వరకు అదికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో యుద్ద భూమిని తలపిస్తున్నాయి. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల విషయం అయితే, చెప్పనే అక్కరలేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలా..వద్దా .. అనే విషయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ,ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి వచ్చిందంటే, పరిస్థితి ఏమిటో వేరే చెప్పనక్కర లేదు. నిజానికి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఆరోజు సభలో ఏమి జరిగిందో, ఎందుకు, ప్రతిపక్ష నేత, సభలో కన్నీరు పెట్టుకున్నారో, విలేకరుల సమవేశంలో టం సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ నాడూ లేని విధంగా కన్నీరు, మున్నీరుగా విలపించారో ..వేరే చెప్పనక్కరలేదు. అధికార పార్టీ, ప్రతిపక్ష నేతకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వక పోగా, ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యులను అవమాన పరిచే వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు, ఈరోజుకు కూడా అధికార పార్టీ ధోరణిలో మార్పు లేదు. అందుకే, సభకు హాజరు కావాలా వద్దా, అనే విషయంలో ప్రధాన ప్రతిపక్షం ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి వచ్చింది,అయితే, ప్రతిపక్ష నేత చంద్రాబాబు నాయుడు విజ్ఞతతో వ్యవహరించడంతో, చంద్రాబాబు మినహా తెలుగు దేశం పార్టీ నిర్ణయించింది.అయితే,అధికార పార్టీ ఏ మేరకు విజ్ఞతతో వ్యవహరిస్తుందో అనే అనుమనాలు మాత్రం అలాగే, ఉన్నాయి. మరో వంక తెలంగాణా విషయానికి వస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ చూపంతా ఢిల్లీ మీదనే ఉందని పిస్తోంది. అందుకే, కావచ్చును ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా తెలంగాణ ఘనతను, విజయాలను దేశమంతటికీ చాటిచెప్పాలని మంత్రులకు సూచించారు. ఎనిమిదేళ్ల స్వల్ప సమయంలోనే రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని, తెలంగాణ మాదిరే దేశం కూడా ఇదే స్థాయికి రావాలనే ఆకాంక్షను ప్రతీ ఒక్కరిలో కలగించాలన్నారు.: 2022-23 బడ్జెట్ ఆమోదమే ప్రధాన అజెండాగా ప్రగతిభవన్‌లో సాగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. వివిధ అంశాలపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రగతిని ఆవిష్కరించాలని మంత్రివర్గ సహచరులకు సూచించారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం తాను ఇప్పటికే ప్రయత్నాలు చేపట్టానని, దీనికి తెలంగాణయే స్ఫూర్తి అని చాటుతున్నానన్నారు. రాష్ట్రం సాధించిన ప్రగతిని చెప్పుకోవడం తప్పు కాదు,అలాగే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసుంటే, ఆ వివరాలను కూడా సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియ చేయవచ్చును. నిజానికి ఈ విషయంగా రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు కొత్తగా చెప్పవసింది లేదు. గత మూడు నాలుగు నెలలుగా, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార తెరాస నాయకులు అదే విషయాన్ని, పదే పదే చెపుతూనే ఉన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జాతీయ ఆకాంక్షలకు శాసనసభను వేదిక చేసుకోవడం విషయంలో సహజంగానే అభ్యంతారాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాదు, మంత్రి పై హత్యా యత్నం మొదలు, రాష్ట్రంలో జరుగతున్న హత్యాలు, రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు , వంటి సమస్యల కు సంబందించి ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత కుడా ప్రభుత్వం ఫై వుంది. అయితే, ముఖ్యమంత్రి కేసేఆర్ మంత్రి వర్గ సమావేశంలో వ్యక్త పరిచిన అభిప్రాయాలు మాత్రం, అసెంబ్లీ వెలుపల సాగుతున్న రచ్చే సభలోపలా సాగుతుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రజా సమస్యలను పక్కకు పోయి రాజకీయ రచ్చ సభలుగా, శాసన సభ సమావేశాలు సాగడం ఖాయంగా కనిపిస్తోందని, అంటున్నారు.
ఈ రోజు ఉభయ తెలుగు రాష్ట్రల శాసన సభ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. అయితే, అటు ఏపీలో ఇటు తెలంగాణలో రాజకీయ వాతావణం నివురు గప్పిన నిప్పులా భగ్గుమనేందుకు సిద్ధంగా ఉన్న నేపధ్యంలో మొదలైన సమావేశాలు ఎంతవరకు సజావుగా సాగుతాయో, ఎంతగా అభాసుపాలవుతాయో వేరే చెప్పా నకక్ర లేదు. నిజానికి, రేపటి పరిస్థితి ఏమిటి అనేది ఉహించే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
http://www.teluguone.com/news/content/both-the-telugu-states-sailing-on-the-same-path-39-132682.html





