అడ్డంగా బుక్కయ్యారు!

Publish Date:Jul 10, 2023

Advertisement

తాజాగా విశాఖపట్నంలో ఆర్మీడ్ రిజర్వ్ సీఐ స్వర్ణలత.. నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరు వ్యక్తులను బెదిరించి నగదు గుంజుకొన్న కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో ఏపీ పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉల్కిపడింది. అయితే తాజాగా సీఐ స్వర్ణలత వ్యవహారం, గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి సీఐ, ప్రస్తుతం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఒకేలా ఉన్నాయనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో అలా ఇలా కాదు ఓ రేంజ్‌లో ఊపందుకొంది. 

స్వర్ణలత.. సీఐగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘానికి ఉపాధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారని.. ఇటీవల విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆమె స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. అవి కాస్తా వివాదాస్పదం కావడంపై ఓ చర్చ సైతం సదరు సర్కిల్‌లో నడుస్తోంది.   

అలాగే సీఐ స్వర్ణలత సినిమాల్లోకి వేళ్లాలని భావిస్తున్నారని... ఆ క్రమంలో ఆమె.. తన ఆటపాటలతో డ్యాన్సులు చేస్తున్న వీడియోలు.. సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయని.. అలాంటి వేళ సీఐ స్వర్ణలత వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమవుతోందని అంటున్నారు. పోలీస్ అధికారి అయి ఉండి.. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టడం ఏమిటనే ఓ వాదన అయితే గతంలో గట్టిగానే నడిచిందనే టాక్ పోలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. అదీకాక నోట్ల మార్పిడి వ్యవహరంలో కొందరు వ్యక్తులను బెదిరించి లక్షలాది రూపాయిలు కొట్టేశారంటూ అభియోగాల నేపథ్యంలో సీఐ స్వర్ణలత అరెస్ట్ అయ్యారు. 

మరోవైపు 2019 ఎన్నికలకు ముందు దాదాపుగా ఇదే తరహాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి సీఐగా గోరంట్ల మాదవ్ విధులు నిర్వహిస్తున్నారని.. ఆ సమయంలో తాడిపత్రిలో స్థానికంగా చోటు చేసుకొన్న ఓ వివాదం.. చినికి చినికి గాలీ వానగా మారడం.. ఆ సమయంలో అనంతపురం ఎంపీ, టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై వ్యాఖ్యలు చేయడం.. ఈ నేపథ్యంలో కదిరి సీఐ ప్లస్ పోలీస్ ఉద్యోగు సంఘం నాయకుడు గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి మీసం మెలేస్తూ.. జేసీకి వార్నింగ్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయని... ఈ అంశం నాడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆ తర్వాత గోరంట్ల మాధవ్‌.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి..  జగన్ పార్టీలో చేరి హిందూపురం నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే. కానీ గతేడాది గోరంట్ల మాధవ్‌ది అంటూ చెబుతున్నో ఓ నగ్న వీడియో అయితే.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. 

అటు గోరంట్ల మాధవ్, ఇటు స్వర్ణలత.. ఈ ఇద్దరు పోలీస్ శాఖలో సీఐలుగా ఉన్నారని.. ఈ ఇద్దరు పోలీస్ అధికారుల సంక్షేమ సంఘంలో కీలక పదవుల్లో ఉన్నారని... అలాగే ఈ ఇద్దరు సీఐలుగా ఉండి.. స్వయంగా ప్రెస్‌మీట్లు పెట్టి.. టీడీపీ సీనియర్ నేతలపై విమర్శలు గుప్పించారనే అంటున్నారు. 
 
దీంతో గోరంట్ల మాధవ్ తరహాలోనే సీఐ స్వర్ణలత సైతం తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. పోలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. రానున్న ఎన్నికల్లో ఏదో ఓ పార్టీ నుంచి పోటీ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.