బోండా ఉమా వర్సెస్ వైసీపీ..బెజవాడలో హైటెన్షన్?
Publish Date:Aug 6, 2026
Advertisement
బోండా ఉమ వర్సెస్ వైసీపీ విజయవాడలో రచ్చరచ్చగా మారింది. మెగా డీఎస్సీ లో అక్రమాలంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలలో ఏ మాత్రం పస లేదని ఏపీ హైకోర్టు నిర్ద్వంద్వంగా తేల్చేసి సీబీఐ దర్యాప్తు జరపాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన తరువాత వైసీపీ సైలంట్ అవ్వక తప్పదని అంతా భావించారు. అయితే వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. అందులో భాగంగానే విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ నేతృత్వంలో వై సీపీ నాయకులు, కార్యకర్తలు రిలే నిరశన చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్సీ నియామక ప్రక్రియలో కోట్ల రూపాయల చేతులు మారాయని, అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఈ నియామకాలపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ముందస్తు అనుమతి లేకుండా నిరశన శిబిరం ఏర్పాటు చేశారంటూ టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా తన మద్దతుదారులతో కలిసి ధర్నా చౌక్ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను నియంత్రించి చెదరగొట్టారు. Bonda versus ycp in Vijayawada, Mega DSC 2025, Bonda Uma vs YSRCP, Vijayawada Dharna Chowk Protests, AP Teacher Recruitment Scam, Nara Lokesh Resignation, AP Political News
http://www.teluguone.com/news/content/bonda-versus-ycp-in-vijayawada-39-228188.html





