సికింద్రాబాద్‌లో బోనాల జాతర.. భారీగా ట్రాఫిక్ ఆంక్షలు..!
Publish Date:Jul 31, 2026
Advertisement
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు చేపట్టనున్నారు. ఆగస్టు 2 నుంచి 4వ తేదీన జాతర ముగిసే వరకు ఆలయం చుట్టూ సుమారు 2 కిలోమీటర్ల పరిధిలో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నట్లు ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఆగస్టు 1/2 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 4 ఉదయం 3 గంటల వరకు పలు మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. పొగాకు బజార్, హమాలీ విగ్రహం నుంచి మహంకాళి ఆలయం వైపు వెళ్లే మార్గాలతో పాటు సుభాష్ రోడ్లో బాటా క్రాస్ రోడ్స్ నుంచి రోచా బజార్ వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. అలాగే హిల్ స్ట్రీట్‌లో అడవియ్య క్రాస్ రోడ్స్ నుంచి మహంకాళి ఆలయం వైపు వెళ్లే రహదారి, జనరల్ బజార్ నుంచి మహంకాళి ఆలయం వైపు వెళ్లే మార్గాలను కూడా మూసివేయనున్నారు. కర్బాలా మైదాన్, రాణిగంజ్, ఓల్డ్ పీఎస్ రాంగోపాల్‌పేట్, ప్యారడైజ్, సీటీఓ, ప్లాజా, ఎస్బీఐ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, ప్యాట్నీ, పార్క్ లేన్, బాటా, ఘాస్మండి, బైబిల్ హౌస్, మినిస్టర్స్ రోడ్, రసూల్‌పురా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఎస్బీఐ క్రాస్ రోడ్స్, ప్యారడైజ్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్, మినిస్టర్ రోడ్ లేదా క్లాక్ టవర్, సంగీత్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ, ముషీరాబాద్, కవడిగూడ మీదుగా ట్యాంక్‌బండ్ వైపు మళ్లించనున్నారు. ప్యారడైజ్ నుంచి బైబిల్ హౌస్ వైపు వెళ్లే వాహనాలను ఎస్బీఐ లేదా క్లాక్ టవర్ వైపు మళ్లిస్తారు. క్లాక్ టవర్ నుంచి ఆర్పీ రోడ్ వైపు వెళ్లే వాహనాలను కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. కర్బాలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, సాధారణ వాహనాలకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. మినిస్టర్ రోడ్, రసూల్‌పురా, పీఎన్టీ ఫ్లైఓవర్, సీటీఓ, ఎస్బీఐ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, గోపాలపురం మీదుగా రైల్వే స్టేషన్‌కు చేరుకునేలా మళ్లింపులు ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, కవడిగూడ, మారియట్ హోటల్ మీదుగా ట్యాంక్‌బండ్‌కు వెళ్లాలి. జాతరకు వచ్చే భక్తుల వాహనాల కోసం ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. హరిహర కళాభవన్, యశోద పార్కింగ్, మహబూబ్ కాలేజీ, సీఎంఆర్ షాపింగ్ మాల్, ఓల్డ్ జైలు ఖానా ఖాళీ స్థలం, ఇస్లామియా హైస్కూల్, ప్రభుత్వ అడవియ్య మెమోరియల్ హైస్కూల్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. నల్లగుట్ట జీహెచ్ఎంసీ గ్రౌండ్, వెస్లీ కాలేజీ, జింఖానా గ్రౌండ్, స్వప్నలోక్ కాంప్లెక్స్, తాజ్ త్రిస్టార్ ప్రాంతాల్లోనూ వాహనాలను నిలిపేందుకు ఏర్పాట్లు చేశారు. వీఐపీ వాహనాలకు ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక పార్కింగ్ కేటాయించారు. బోనాల జాతర సమయంలో అత్యవసరం కాని ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవాలని, తప్పనిసరి ప్రయాణాలు చేసేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రయాణికులు తాజా ట్రాఫిక్ సమాచారం తెలుసుకుంటూ పోలీసులకు సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626ను సంప్రదించవచ్చని తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నందున వాహనదారులు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. Bonala fair in Secunderabad, Traffic restrictions, Sri Ujjain Mahakali, Bible House, Ministers Road, Rasoolpura
http://www.teluguone.com/news/content/bonala-fair-in-secunderabad-36-227682.html





