డబ్బులు అడిగితే బూతులు.. 4ఏళ్లుగా ఎమ్మెల్యే టార్చర్
Publish Date:Mar 25, 2021
Advertisement
అతనో కిరాణ వ్యాపారి. నాలుగేళ్ల క్రితం ఓ ఎమ్మెల్యే అతనికి 36 లక్షల ఆర్డర్ ఇచ్చాడు. పని అయిపోయాక డబ్బులు ఇవ్వమంటే ఛీ పొమ్మన్నాడు. ఇలా ఒకటి, రెండు కాదు.. నాలుగేళ్లుగా డబ్బులివ్వకుండా వేధిస్తున్నాడు. లేటెస్ట్‌గా మరోసారి మనీ అడిగితే.. ఈసారి బండ బూతులు తిట్టాడు ఆ ఎమ్మెల్యే. ఆ ఫోన్ వాయిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఎమ్మెల్యే తీరుపై అంతా మండిపడుతున్నారు. ఆ ఎమ్మెల్యే.. టీఆర్ఎస్‌కు చెందిన నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్. నాలుగేళ్ల క్రితం రంజాన్ పండుగకు బోధన్ ఎమ్మెల్యే షకీల్.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన అభిషేక్ కిరాణా వ్యాపారి అయిన మురళీధర్‌కు 6వేల తోఫా ప్యాకెట్లను ఆర్డర్ చేశాడు. ఒక్కోటి 600 చొప్పున 6000 ప్యాకెట్లకు ఆర్డర్ ఇచ్చాడు. వాటి విలువ 36లక్షలు. అందులో 12లక్షలు అడ్వాన్స్‌గా కిరాణ షాపు యజమాని మురళీధర్‌కు ఇచ్చాడు ఎమ్మెల్యే షకీల్. మిగతా ఎమౌంట్ పెండింగ్‌లో పెట్టాడు. అంతలోనే 2019 ఎన్నికలు రావడంతో.. ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగా క్యాటరింగ్ ఏర్పాటు చేసిన మురళీధర్‌కు మరో 4లక్షలు బాకీ పడ్డాడు. ఇలా మొత్తం సుమారు 30 లక్షలు మురళీధర్‌కు ఇవ్వాల్సి ఉంది బోధన్ ఎమ్మెల్యే షకీల్. 30 లక్షలు బాకీ డబ్బుల కోసం రెండేళ్లుగా ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నాడు ఆ వ్యాపారీ. అయినా, సదరు నేత నుంచి కనీస స్పందన లేదు. దీంతో బాధితుడు ఎమ్మెల్యే సన్నిహితుడి దగ్గర బాధను చెప్పుకోగా.. ఆ వ్యక్తి ఎమ్మెల్యే షకీల్‌తో రెండు రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడించాడు. ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే.. వ్యాపారి మురళీధర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. నీకు డబ్బులు ఇచ్చేది ఎక్కడిదంటూ బండ బూతులు తిట్టాడు. ఆ ఫోన్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటు డబ్బులూ రాక.. అటు తిట్లు తినాల్సి రావడంతో.. ఆ వ్యాపారి లబోదిబో మంటున్నాడు. ఎమ్మెల్యే షకీల్ తీరును ప్రజలు తప్పుబడుతున్నారు.
http://www.teluguone.com/news/content/bodhan-mla-shakeel-warning-to-businessman-phone-audio-viral-25-112526.html





