వంద‌ల కోట్ల దోపిడీ.. క‌రోనాతో వ్యాపార‌మా? ప్ర‌భుత్వాల చేత‌గాని త‌న‌మా?

Publish Date:Apr 26, 2021

Advertisement

పుట్టిన‌ప్ప‌టి నుంచీ ఆక్సిజ‌న్ పీలుస్తూనే బ‌తుకుతున్నాం. క‌రోనా వ‌స్తే మాత్రం కృత్రిమంగా ఆక్సిజ‌న్ పెడితేనే బ‌తికే ప‌రిస్థితి. సెకండ్ వేవ్‌ కొవిడ్ క‌ల్లోలంలో ఆక్సిజ‌న్‌కు ఫుల్ డిమాండ్‌. అందుకే అదిప్పుడు వ్యాపార వ‌స్తువు. 

రెమ్‌డెసివిర్‌. ఇది క‌రోనాకు క‌చ్చిత‌మైన మెడిసిన్ కాకపోయినా.. ప్ర‌స్తుత స‌మ‌యంలో కొవిడ్ నుంచి ప్రాణాల‌ను కాపాడే సంజీవిని. క‌రోనాతో ప్రాణాపాయంలో ఉన్న రోగిపై రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్లు బాగా ప‌ని చేస్తున్నాయి. కొవిడ్‌కు చికిత్స వ‌చ్చేలోగా.. రెమ్‌డెసివిరే మెరుగైన మందు. అందుకే, ఈ ఇంజెక్ష‌న్‌ను బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ వేల‌కు వేలు దండుకుంటున్నారు.

క‌రోనా సెకండ్‌వేవ్ తీవ్రంగా ఉంది. చాలా మందికి ప్రాణాంత‌కంగా మారింది. హాస్పిట‌ల్‌లో చేరాల్సిన వారి సంఖ్య భారీగా ఉంటోంది. అందుకే, హాస్పిట‌ల్ బెడ్స్‌కు బాగా గిరాకీ. అందుకే, ప్రైవేట్‌ హాస్పిట‌ల్స్.. బిజినెస్ సెంట‌ర్స్‌గా మారాయి. కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాయి.  

ఆక్సిజ‌న్‌, రెమ్‌డెసివిర్‌, బెడ్స్‌.. ఈ మూడు ఇప్పుడు ఏపీ, తెలంగాణ‌లో అంగ‌ట్లో వ‌స్తువులు. కాయ్ రాజా కాయ్ అన్న‌ట్టు.. ఎవ‌రు ఎక్కువ ధ‌ర పెడితే వారికే ఆ సేవ‌లు. అంతా కృత్రిమ కొర‌త‌. అడ్డ‌గోలు దందా.

రెమ్‌డెసివిర్‌. ఒక్కో ఇంజెక్ష‌న్ ధ‌ర సుమారు 3వేలు. కానీ, 3వేలు పెడితే మార్కెట్లో రెమ్‌డెసివిర్ దొర‌క‌దు. డౌట్ ఉంటే ఓసారి ట్రై చేసి చూడండి. మీకే తెలిసొస్తుంది. 3వేలు ఇస్తే.. ఇంజ‌క్ష‌న్లు స్టాక్‌ లేవ‌నే స‌మాధానం వ‌స్తుంది. అదే, ధ‌ర ఎంతైనా ప‌ర్లేదు అని చెప్పి చూడండి. వెంట‌నే.. ఎన్ని కావాలి? సార్‌.. అనే ఆన్స‌ర్ వ‌స్తుంది. ఒక్కో రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్‌ను బ్లాక్‌మార్కెట్‌లో సుమారు 30వేల‌కు అమ్ముతున్నారు. 3వేలు ఎక్కడ‌? 30 వేలు ఎక్క‌డ‌? ఎంత తేడా.. ఎంత ప్రాణాపాయం ఉన్నా.. మ‌రీ అంత నిలువుదోపిడీ చేయాలా?  రెమ్‌డెసివిర్ మెడిసిన్‌ను ఇలా బ్లాక్ మార్కెటింగ్ చేస్తుంటే.. ప్ర‌భుత్వాలు ఏం చేస్తున్న‌ట్టు?  మందుల‌తో ఇలా అడ్డ‌గోలు వ్యాపార‌మేంటి? అని అడిగినా.. పట్టించుకునే పాల‌కుడే లేడు. అందుకే వాళ్లు అలా బ‌రితెగిస్తున్నారు. 

కేవ‌లం రెమ్‌డెసివిర్ మాత్ర‌మే కాదు.. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ది అంత‌కు మించి దగా. క‌రోనా కాలంలో కాదేదీ అక్ర‌మ వ్యాపారానికి అన‌ర్హం. కొవిడ్ పాజిటివ్‌తో ఆసుప‌త్రుల్లో చేరుతున్న వారిలో పావు వంతు మందికి ఆక్సిజ‌న్ అవ‌స‌రం అవుతోంది. మెడిక‌ల్ ఆక్సిజ‌న్ షార్టేజ్ వ‌ల్ల చాలా హాస్పిట‌ల్స్‌లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్‌ను రోగుల‌నే తెచ్చుకోమంటున్నారు. ఇదే ఇప్పుడు మంచి వ్యాపార అవ‌కాశంగా మారింది. ఏపీ, తెలంగాణ‌లో  ఆక్సిజ‌న్ దొర‌క‌డం క‌ష్ట‌త‌ర‌మైంది. ఆక్సిజ‌న్ అందించే ప్లాంట్లు త‌క్కువ‌గా ఉండ‌టం.. వాటి ముందు భారీ క్యూ లైన్లు క‌నిపిస్తున్నాయి. డిమాండ్ అమాంతం పెరిగిపోవ‌డంతో.. ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు.. హాస్పిటల్ మేనేజ్ మెంట్లు.. ఎవ‌రికి వారే.. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను బ్లాక్ చేస్తున్నారు కేటుగాళ్లు. నో స్టాక్ బోర్డులు పెట్టి.. బ్లాక్ మార్కెట్లో అడ్డ‌గోలు ధ‌ర‌ల‌కు అమ్ముకుంటున్నారు. 

విజ‌య‌న‌గ‌రం మ‌హారాజా హాస్పిట‌ల్‌లో ఆక్సిజ‌న్ అంద‌క ప‌లువురు చ‌నిపోయారు. అర్థ‌రాత్రే ఆ ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ నిలిచిపోయింద‌ని అంటున్నారు. తాము అప్ప‌టిక‌ప్పుడు బ‌య‌టికి వెళ్లి.. 16వేల‌కు ఒక సిలిండ‌ర్ చెప్పున.. 32వేలు పెట్టి రెండు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు కొని తెచ్చామ‌ని రోగి బంధువులు చెప్పారు. ఏపీలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల బ్లాక్ మార్కెటింగ్ ఏ రేంజ్‌లో సాగుతోందో చెప్ప‌డానికి ఈ ఘ‌ట‌న ఓ ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే ఇలా అక్ర‌మార్కులు బ‌రితెగించ‌డానికి కార‌ణం. ప్ర‌స్తుత పాండ‌మిక్ సిట్యూయేష‌న్‌లోనూ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల అమ్మ‌కంపై స‌ర్కారు స‌రైన విధానం అవ‌లంభించ‌క‌పోవ‌డం.. అక్ర‌మార్కుల‌పై ఉక్కుపాదం మోప‌క‌పోవ‌డం వ‌ల్లే ఇలా ప్రాణాలు నిల‌పాల్సిన ప్రాణ‌వాయువు అంగ‌డి స‌రుకుగా మారింద‌నే విమ‌ర్శ వినిపిస్తోంది. 

ఇక‌, ప్రైవేట్ హాస్పిట‌ల్స్ దోపిడీ అయితే చెప్ప‌న‌వ‌స‌ర‌మే లేదు. చిన్నా, పెద్దా తేడా లేదు.. గ‌ల్లీలో ద‌వాఖానా అయినా.. కార్పొరేట్ హాస్పిట‌ల్ అయినా.. ఒక‌టే బాదుడు. ముందు నో బెడ్స్ అంటారు. బాధితుడు ప్రాణ‌భ‌యంలో ఉంటాడు. బిల్‌ ఎంతైనా క‌డ‌తానంటాడు. ఇదే క‌దా వారికి కావ‌ల‌సింది. పేషెంట్‌ని అడ్మిట్ చేసుకోకుండానే.. ల‌క్ష‌ల్లో డిపాజిట్ చేయిస్తారు. అలా, ల‌క్ష‌లు క‌ట్టించుకున్నాకే.. బెడ్ ఇస్తారు. ఆ త‌ర్వాత ఎన్ని రోజులు హాస్పిట‌ల్స్‌లో ఉంటే.. అన్ని ల‌క్ష‌ల బిల్లు కామ‌న్‌. ముక్కుపిండి మ‌రీ వ‌సూలు చేస్తారు. ఎవ‌రైనా బిల్లు క‌ట్టలేక‌పోతే.. దౌర్జ‌న్యాల‌కు తెగ‌బ‌డుతున్నారు. త‌మ‌కు అధికంగా బిల్లు వేశారంటూ.. మంత్రుల‌ ట్విట్ట‌ర్ ఖాతాల‌కు నిత్యం అనేక ఫిర్యాదులు వ‌స్తుంటాయి. అయినా, ఏ పాల‌కుడూ వాటిని ప‌ట్టించుకోడు. ఇలా, కోట్ల‌లో సాగుతోంది కార్పొరేట్ హాస్పిట‌ల్స్ దందా. ప్రాణం పోసే వాడు దేవుడే.. మ‌రి, ప్రాణం పోయేంత బిల్లు వ‌సూలు చేసేవాడిని ఏమ‌నాలి? ఈ దారుణాల‌ను అడ్డుకోని పాల‌కుల‌ను ఎవ‌రు నిల‌దీయాలి?

ఇలా.. క‌రోనా కాలంలో మందులు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, ఆసుప‌త్రి బెడ్లు.. అన్నిటినీ వ్యాపార వ‌స్తువుగా మార్చేశారు. వీటి బ్లాక్ మార్కెటింగ్ విలువ‌.. వంద‌ల కోట్ల‌లోనే ఉంటుంది. పాల‌కులు క‌న్నెర్ర చేస్తేనే గానీ.. ఈ పాపం ఆగ‌దు? మ‌రి, మొద్దు నిద్ర‌లో ఉన్న నాయ‌కులు.. ఈ దారుణాల‌ను అడ్డుకుంటారా? క‌రోనాతో క‌ష్ట‌కాలంలో ఉన్న త‌మ ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటారా? 
 

By
en-us Political News

  
తెలంగాణ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది.
రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దహీ-చూరా విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు.
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.