వలంటీర్ల పై రచ్చ.. తెలుగుదేశంకు లాభించిందా?

Publish Date:Jul 22, 2023

Advertisement

పవన్ కల్యాణ్ వలంటీర్లపై  చేసిన వ్యాఖ్యలు రాజకీయ హీట్ ను విపరీతంగా పెంచేశాయి. వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల రచ్చ.. జనసేన, వైసీపీల మధ్య మాటల రణాన్ని పీక్స్ కు తీసుకు వెళ్లింది. ముఖ్యమంత్రి జగన్ కూడా హోదాను తగ్గించుకుని మరీ బూతు పురాణాన్ని విప్పేశారు. మొత్తంగా ఏపీలో రాజకీయ వాతావరణం అంతా జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారిపోయింది.

దీంతో పొలిటికల్ ఫైట్  జనసేన, వైసీపీల మధ్యే అన్నట్లుగా సీన్ మారిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ను తగ్గించేందుకు బీజేపీ అనుసరించిన వ్యూహమే ఇక్కడ ఆ పార్టీ ప్రోత్సాహంతో, ప్రమేయంతో జగన్ అనుసరించి తెలుగుదేశం పెద్దగా వార్తలలో నిలవకుండా నియంత్రించేందుకు అమలు చేశారని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. వాస్తవానికి పై నుంచి చూసే వారికి కూడా నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం, వైసీపీల మధ్యే పోరు అన్నట్లుగా ఉన్న వాతావరణం పవన్ కల్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్రలో భాగంగా స్వరం పెంచి అధికార పార్టీపై విమర్శల దాడిని, వేడినీ పెంచారో అప్పటి నుంచీ సీన్ మొత్తం పవన్ వర్సెస్ జగన్ అన్నట్లుగా మారిపోయింది.

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై విమర్శలతో మొదలు పెట్టి.. వాలంటీర్లపై వ్యాఖ్యల దాకా పవన్ అధికార వైసీపీని, జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేసి పొలిటికల్ మైలేజ్ సంపాదించేశారని అనిపించే పరిస్థితి నెలకొంది. పవన్ కల్యాణ్, జగన్ ల మాటల యుద్ధం వెనుక ఉన్నది బీజేపీ వ్యూహమన్నది పరిశీలకుల విశ్లేషణ కాగా, ఆ వ్యూహం కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం వెనుకబడిందన్న అంచనాలు కూడా వెలువడుతున్నాయి. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని వైసీపీ, జనసేన వర్గాలే చెబుతున్నాయి. పొలిటికల్ హీట్ పెరిగేలా జనసేన, వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే.. ఆ రచ్చలో వేలు పెట్టకుండా తెలుగుదేశం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం అవుతోందని  అంటున్నారు. ఎ

న్నికలలో సత్ఫలితాలు సాధించేందుకు మిగిలిన అన్నివిషయాల కంటే అత్యంత ప్రధానమైనది క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం అయ్యే చర్యలు చేపట్టడమేనన్నది అందిరికీ తెలిసిన విషయమే. అయితే తెలుగుదేశం పార్టీని డిఫెన్స్ లో పడేయాలన్న ఏకైక లక్ష్యంతో వైసీపీ ఆ పనిని వదిలేసి తమ ప్రధాన ప్రత్యర్థి జనసేన మాత్రమేనని ఎస్టాబ్లిష్ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతూ వ్యూహాలను అమలు చేస్తున్నది. ఈ వ్యూహాలకు బీజేపీ అన్ని విధాలుగా అండదండలు అందించడమే కాకుండా.. తన మిత్ర పక్షమైన జనసేనను కూడా ఆ వ్యూహంలో భాగం చేసింది. అలా చేయడం ద్వారా తెలుగుదేశంను దెబ్బకొట్టగలిగామని సంబరపడుతోంది. అయితే వాస్తవానికి వాలంటీర్లపై రాజకీయ రచ్చ తెలుగుదేశం పార్టీకే లాభించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన, వైసీపీ శ్రేణుల నుంచి కూడా అదే అభిప్రాయం వ్యక్తమౌతోంది. తులుగుదేశం పార్టీని విస్మరించి వైసీపీ చేస్తున్న విమర్శల ఆస్త్రాలన్నీ తెలుగుదేశం చాపకింద నీరులా విస్తరించేందుకు, క్షేత్రస్థాయిలో బలపడేందుకు దోహదపడుతోందని చెబుతున్నారు. 

By
en-us Political News

  
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.