బీజేపీ, వైసీపీ లవ్ బ్రేకప్పేనా?

Publish Date:Aug 22, 2023

Advertisement

 కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అద్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ స్నేహ సంబంధాలు చాలా చిత్రంగా ఉంటాయి. అ రెండు పార్టీలు మిత్ర పక్షాలు కాదు. అలాగని శతృ పక్షాలు ఏ మాత్రం కాదు. బీజేపీ సారధ్యంలోని అధికార ఎన్డీఎ కూటమిలో వైసీపీ భాగస్వామ్య పక్షం కాదు. అయినా, బీజేపీ సహా ఎన్డీఎ భాగస్వామ్య పార్టీల నాయకులకంటే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నాయకులు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా కు ఎక్కువ గౌరవం ఇస్తారు. అడుగులకు మడుగులొత్తుతారు. ఎందుకు ఏమిటీ, అన్నది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి మెడ మీద వెళ్ళాడుతున్న అక్రమాస్తుల కేసులే అందుకు కారణం అన్నది బహిరంగ రహస్యం. 

అందుకే ఆ రెండు పార్టీల శత్రు మిత్ర సంబంధాల విషయంలో  అప్పుడప్పుదు ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే, ఎవరి రాజకీయం వారిది అయినా, పరస్పరం ఇచ్చి పుచ్చుకునే విషయంలో మాత్రం  ఎలాంటి మొహమాటం లేకుండా  నువ్వొకందుకు పోస్తే, నేనొకందుకు తాగుతున్నా అన్న చందంగా  రెండు పార్టీలు ఎప్పటికీ కలవని రైలు పట్టాల్లాగా కలిసే  ప్రయాణం చేస్తున్నాయి. అందుకే, రెండు పార్టీలను రాజకీయ విశ్లేషకులు  రహస్య ప్రేమికులుగా అభివర్ణిస్తుంటారు. 
వైస్సీపీ ఎన్డీఎ భాగస్వామ్య పార్టీ కాదు కానీ కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ రాజును మించిన రాజభక్తితో అంగీకరించేస్తుంటుంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను మించిన ఉత్సాహంతో జై కొడుతుంటుంది.  అయితే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష బాధ్యతల నుంచి సోము వీర్రాజు వైదొలిగిన తరువాత.. నిజానికి ఆయన వైదొలగలేదు.. బీజేపీ అధిష్ఠానమే ఓ ఫోన్ కాల్ తో ఆయనకు సమాచారం ఇచ్చి ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో పార్టీ రాష్ర్ట అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు పురంధేశ్వరికి అప్పగించింది. ఆ తరువాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే.. వైసీపీ, బీజేపీల లవ్ బ్రేకప్ అయ్యిందా అన్న అనుమానం కలగక మానదు. 

పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం, అడ్డగోలు అప్పులపై ధ్వజమెత్తారు. జగన్ సర్కార్ అప్పుల చిట్టాతో హస్తిన వెళ్లి మరీ కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేసి వచ్చారు.  సోము వీర్రాజు హయాంలో ఏపీ బీజేపీ తీరు జగన్ సర్కార్ కు వంత పాడుతున్నట్లుగానే ఉండేది. పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రక్షాళన చేశారు. 30 మందితో ఏపీ  బీజేపీ కమిటీని నియమించారు.

రాష్ట్ర పార్టీపై ఉన్న వైసీపీ ముద్రను పూర్తిగా తుడిచేసే విధంగా ఆమె నియమించిన కొత్త కార్యవర్గం ఉందని పరిశీలకులు సైతం  ఈ నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ శాఖ నిప్పులు కురిపిస్తోంది. విమర్శల దాడి తీవ్రత పెంచింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ, వైసీపీ లవ్ బ్రేకప్ అయ్యిందని పరిశీలకులు చెబుతున్నారు. ఇక ముందు ముందు కేంద్రం నుంచి ఏపీలోని వైసీపీ సర్కార్ కు సహకారం అందే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. బేవరేజస్ బాండ్ల ద్వారా రుణం కోసం ఏపీ సర్కార్ చేసిన ప్రయత్నం విఫలం కావడం వంటి సంఘటనలను బట్టి చూస్తుంటే రానున్న రోజలు వైసీపీ సర్కార్ కు గడ్డుగానే ఉంటాయన్న భావన కలుగుతోందని అంటున్నారు. 

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.