మోడీ ప్రతిష్ఠ మసకబారుతోందనడానికి తాజా ఉదాహరణ ఇది. మయూర్ ముండే.. ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం ఉండకపోవచ్చు. కానీ ప్రధాని మోడీకి గుడికట్టిన బీజేపీ కార్యకర్తగా ఆయనను అందరూ గుర్తుపడతారు. పూణెకు చెందిన మయూర్ ముండే మోడీకి వీర భక్తుడు. ఎంతటి భక్తుడంటే మయూర్ ముండే దృష్టిలో మోడీ ఒక దేవుడు. ఎందరు వద్దన్నా, పెద్ద పెద్దవారు అభ్యంతరం పెట్టినా, చివరాఖరికి బీజేపీ జాతీయ నాయకత్వం వారించినా కూడా లెక్క చేయకుండా 2021లో ఆయన మోడీకి ఏకంగా ఒక గుడి కట్టేశారు. ఎందుకంటే మోడీని పూజించడానికి ఒక చోటు కావాలి. అది ఈ గుడే కావాలి అంటూ గట్టిగా వాదించారు.
అటువంటి మయూర్ ముండే ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసేశారు. తన రాజీనామా లేఖలో బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మౌలిక సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చేసిందని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు బీజేపీకి అధికారమే పరమావధిగా మారిపోయిందని పేర్కొన్నారు. ఇందు కోసం పార్టీ బయట నుంచి రాజకీయ నాయకులను దిగుమతి చేసుకుంటోందనీ, దీర్ఘ కాలంగా పార్టీలో ఉంటూ విధేయులుగా ఉన్న వారిని పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు. తన దేవుడు మోడీ కూడా అధికారం వచ్చాకా మారిపోయారనీ, ఆ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం సమంజసం కాదని భావిస్తున్నాననీ మయూర్ ముండే తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-worker-who-build-temple-to-modi-now-resign-party-25-186253.html
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది