పులివెందులలో టీడీపీ దూకుడు..రెండో రౌండ్‌లో 6,325 ఓట్ల ఆధిక్యం.!

Publish Date:Nov 3, 2026

Advertisement

​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది. అధికారిక కౌంటింగ్ ఫలితాల ప్రకారం, రెండు రౌండ్లు పూర్తయ్యే సమయానికి టీడీపీ అభ్యర్థి టి. గీతా కుమారి తన సమీప వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.ఎస్. ప్రమీలపై ఏకంగా 6,325 ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధిచారు..మొదటి రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి టి. గీతా కుమారికి 5,060 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.ఎస్. ప్రమీలకు 4,641 ఓట్లు లభించాయి. ఈ రౌండ్‌లో 259 ఓట్లు చెల్లనివిగా మారగా, నోటాకు 40 ఓట్లు వచ్చాయి. దీంతో తొలి రౌండ్‌లో టీడీపీ 419 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో సరిపెట్టుకుంది. 

అయితే రెండో రౌండ్ లెక్కింపు మొదలయ్యాక ఫలితం పూర్తిగా ఏకపక్షంగా మారిపోయింది. రెండో రౌండ్‌లో నమోదైన 10,000 ఓట్లలో టి. గీతా కుమారికి రికార్డు స్థాయిలో 7,844 ఓట్లు పడగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.ఎస్. ప్రమీల కేవలం 1,938 ఓట్లకే పరిమితమయ్యారు. ఈ రౌండ్‌లో 176 ఓట్లు చెల్లనివిగా తేలగా, 42 ఓట్లు నోటాకు నమోదయ్యాయి. కేవలం రెండో రౌండ్‌లోనే టీడీపీ 5,906 ఓట్ల భారీ మెజారిటీని సొంతం చేసుకుంది. మొత్తం రెండు రౌండ్లు కలిపి లెక్కించిన 20,000 ఓట్లలో టీడీపీ అభ్యర్థి 12,904 ఓట్లను, వైఎస్సార్సీపీ అభ్యర్థి 6,579 ఓట్లను సాధించగా, చెల్లని ఓట్లు 435, నోటా ఓట్లు 82గా నమోదయ్యాయి.

కడప మేయర్ ఫలితాలపై వీడని ఉత్కంఠ – తీవ్ర విస్మయం.!

ఒకవైపు పులివెందులలో రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయి స్పష్టమైన ఫలితాల ట్రెండ్స్ బయటకు వచ్చినప్పటికీ, జిల్లా కేంద్రమైన కడప నగర పాలక సంస్థ (మేయర్) ఎన్నికల ఫలితాల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. కౌంటింగ్ ప్రారంభమై గంటలు గడుస్తున్నా ఇంతవరకు మేయర్ స్థానానికి సంబంధించి కనీసం ఒక్క రౌండ్ ఫలితం కూడా అధికారికంగా విడుదల కాకపోవడంపై రాజకీయ వర్గాల్లో, మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్పొరేషన్ పరిధిలోని బ్యాలెట్ల క్రోడీకరణలో ఎదురవుతున్న సాంకేతిక కారణాలా లేక డివిజన్ల వారీగా లెక్కించడంలో ఆలస్యమా అనే దానిపై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు, ఓటర్లు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

 

 

 

[ Pulivendula Results, TDP, Geetha Kumari, YSRCP, AP Municipal Elections, Counting Results, Chandrababu Naidu, Jagan Mohan Reddy, Andhra Pradesh Politics, Y.S. Pramila  ]


 

By
en-us Political News

  
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.