బీజేపీ లెక్క త‌ప్పుతోందా? చిక్కులు త‌ప్ప‌వా?

Publish Date:Feb 4, 2022

Advertisement

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో, ముఖ్యంగా దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్న ఉత్తర ప్రదేశ్’లో బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయని, సీట్ల సంఖ్య తగ్గినా, యూపీలో మళ్ళీ కమల దళానిదే అధికారమని, ఇంత వరకు చాలా వరకు సర్వేలు చెపుతూ వచ్చాయి. అయితే అది నిన్నటి మాట, పోలింగ్ తేదీలు దగ్గరుతున్న కొద్దీ సీన్ మారుతోంది అనేది తాజా ఖబర్’గా వినవస్తోంది.  

అవును, తొలివిడతలో ఫిబ్రవరి 10 పోలింగ్ జరిగే, పశ్చిమ ఉత్తర ప్రదేశ్’లోని 58 అసెంబ్లీ నియోజక వర్గాల్లో తాజా, పరిస్థితిని గమనిస్తే, కమల దళానికి ఆదిలోనే ఎదురు దెబ్బ తప్పేలా లేదని స్థానిక రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో గట్టి పట్టున్న ముస్లింలు. అదే విధంగా జాట్లు కారణాలు వేరైనా ఏకమై సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్’డీ) కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రెండు వర్గాలను దూరం చేసేందుకు, జాట్ ఓటును తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసింది.అయినా, ఇంతవరకు ఫలితం కనిపించలేదని అంటున్నారు.  

ముఖ్యంగా 2013 నటి ముజఫర్ నగర్ అల్లర్లు, 2014-16 మధ్య కాలంలో హిందువులపై ముస్లింలు జరిపిన దాడులు, ముస్లిం దాడులకు భయపడి హిందువులు వలసలు పోయిన ఉదంతాలు,అలాగే శ్రీ కృష్ణ జనమ భూమి (మధుర) వంటి అంశాలను బీజేపీ ప్రధాన ప్రచార అస్త్రాలుగా ఉపయిగించుకుంటోంది. హిందూ ఓటు ఏకీకరణ కోసం ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి ఇంటింటి ప్రచారం చేశారు. కైరానా వలస బాధిత హిందూ కుటుంబాలను పరామర్శించారు. అలాగే ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్’  కైరానాలో కశ్మీర్’ను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలను భయబ్రాంతులనుచేసి తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. 

అయితే, ముస్లిం – జాట్ బంధాన్ని తుంచేసి, హిందువుల ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకునేందుకు, బీజేపీ చేసిన, చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలిచలేదని, ఎప్పుడో జరిగిన ముజఫర్ నగర్ అల్లర్లు, ఇంకెప్పుడో జరిగిన కైరానా వలసల కంటే, సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సర కాలంపాటు సాగిన రైతుల ఆందోళన, ఆ సందర్భంగా 700 రైతులు చనిపోయిన విషాదం, అందులో ఎక్కువ భాగం పశ్చిమ యూపీకి చెందిన జాట్’ రైతులే కావడం, అన్నిటినీ మించి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు కర్కశంగా కారుతో తొక్కించి ఎనిమిది మంది రైతులను తొక్కించి చంపిన లఖింపూర్ ఖేరీ సంఘటనే జాట్’ ఓటర్ల పై ఎక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అజయ్ మిశ్రా పై ఎలాంటి చర్య తీసుకోకపోవడం, పుండు మీద కారం చల్లినట్లు జాట్ రైతులను బాధిస్తోందని, అంటున్నారు.  

ఈ నేపధ్యంలో ‘ఫస్ట్ ఫేజ్’లో పోలింగ్ జరిగే పశ్చిమ యూపీలో బీజేపీకి ఎదురుగాలి తప్పదని, స్థానిక పత్రికల సమాచారం. గత ఎన్నికలలో పశ్చిమ యూపీలోని 70 అసెంబ్లీ స్థానాలకు గానూ, కమల దళం 51 స్థానాలను గెలుచు కుంది, అయితే ఏ సారి అందులో  సగం  కుడా రాకపోవచ్చని అంటున్నారు. 
అయితే, ఒక్క బీజీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు పెద్ద సంఖ్యలో ముస్లిం అభ్యర్ధులను బరిలో దించాయి.తొలి విడతలో పోలింగ్ జరిగే 58 స్థానాల్లో ఎస్పీ – ఆర్ఎల్’డీ  కూటమి 13 మంది ముస్లింలకు టికెట్ ఇచ్చింది. బీఎస్పీ 17 అందని ముస్లిం అభ్యర్ధులను బరిలో దించింది. రెండు పార్టీ ఎనిమిది నియోజక వర్గాల్లో ముస్లిం అభ్యర్ధులనే బరిలో దించాయి, లాగే   కాంగ్రెస్ పార్టీ కూడా  పెద్ద సంఖ్యలోనే ముస్లింలకు టికెట్లు ఇచ్చింది. అలాగే, ఎంఐఎం కూటమి ఇంచు మించుగా కూటమి పోటీచేస్తున్న అన్ని స్థానాల్లో ముస్లిం అభ్యర్ధులనే బరిలో దించింది. ఇది,  ముస్లిం ఓట్ల చీలికకు, లేదా ఆఖరి క్షణంలో కౌంటర్ పోలరైజేషన్ ‘కు దారి తీస్తే, అది బీజేపీకి మేలు చేయవచ్చును. నిజానికి 2017లో జరిగింది అదే. అయితే, అదే సీన్ పునరావృతం అయ్యే అవకాశాలు ఇంచుమించుగా లేవనే అంటున్నారు.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.