వాడుకొని వదిలేశారా?

Publish Date:Dec 17, 2023

Advertisement

తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఇది అతికే పొత్తు కాదని రాజకీయ వర్గాలలో అప్పుడే చర్చ జరిగింది.  అయినా అప్పటికప్పుడు బీజేపీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించింది. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు పడుతున్నట్లే కనిపించారు. ప్రచారంలో ఆయన పాల్గొన్న సభలలో ఆయన కదలిక ఒకింత ఇబ్బందికరంగానే కనిపించింది కూడా. సరే ఇక ఫలితాల విషయానికి వస్తే బీజేపీ కేవలం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా జనసేన అయితే అసలు ఖాతా కూడా తెరవలేదు. దీంతో ఈ పొత్తు వలన బీజేపీ, జనసేనలలో ఎవరికి నష్టం.. ఎవరికి లాభం అన్నదానిపై రకరకాల విశ్లేషణలు సాగాయి. నిజానికి బీజేపీ మొదట ఒంటరిగానే బరిలోకి దిగేందుకు ఆలోచన చేసింది. ఈ మేరకు ప్రకటనలు కూడా చేసింది.

తీరా ఎన్నికల సమయానికి పార్టీ బలహీనంగా ఉందన్న విషయం తెలిసి వచ్చి కనీసం మూడవ ప్రత్యామ్నాయంగా అయినా కనిపించాలంటే జనసేన కూడా కలవాలని భావించింది. అందుకే జనసేనానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ పార్టీని పొత్తుకు ఒప్పించింది.  అయితే, తెలంగాణలో బలంగా వీచిన కాంగ్రెస్ గాలిలో రెండు పార్టీలు కొట్టుకుపోయాయి .

అయితే, జనసేన కారణంగానే తమకు సీట్లు తగ్గాయని తెలంగాణ బీజేపీలోని ఓ వర్గం నేతలు విమర్శలు ఆరంభించారు. జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం వలనే బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైందని తెలంగాణ బీజేపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలని భావించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ మేరకు ప్రకటన కూడా చేసేశారు. మ‌రో ప‌ది రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారని.. అందుకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేయాలని, అలాగే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ నాయ‌కులు ఒంట‌రిగానే సిద్ధం కావాలని కిషన్‌ రెడ్డి తాజాగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  దీన్ని బట్టి చూస్తే బీజేపీ పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉండేందుకు, ఆయనను దూరంగా ఉంచేందుకు సిద్ధపడినట్లు అర్ధమవుతున్నది. . 

అంతకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మన అవసరం ఉందని మనతో బీజేపీ తెలంగాణలో పొత్తు పెట్టుకుందని, బీజేపీ నేతలు వాళ్లంతట వాళ్లే వచ్చి పొత్తు పెట్టుకున్నారని పవన్ కల్యాణ్ ఇటీవల ఏపీలో పార్టీ శ్రేణులకు చెప్పారు. దీనిని బట్టి చూస్తే ఇప్పుడు బీజేపీ పవన్ కల్యాణ్ అవసరం లేదని భావిస్తున్నట్లే అర్ధం చేసుకోవాలి. మొత్తంగా తెలంగాణలో బీజేపీ, జనసేన బంధం ఎన్నికల నాలుగు రోజులకే కలిసి.. ఎన్నికల ఫలితాలొచ్చాక నాలుగు రోజులకే తెగిపోయింది. అయితే బీజేపీ తనకు తానే జనసేనను కలుపుకోవడం, ఇప్పుడు తనకు తానే రాంరాం చెప్పేయడం చూస్తే అప్పటికప్పుడు అవసరానికి వాడుకొని వదిలించుకున్నట్లే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేనతో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రయోజనం పొందిందా లేదా అన్న విశ్లేషణలను పక్కన పెడితే..  ఎన్నికల ఫలితాలొచ్చిన వెంటనే ఎలాంటి చర్చలు లేకుండానే పొత్తు బంధాన్ని బీజేపీ తెంచేసుకోవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో చర్చకు దారితీస్తున్నది. 

తెలంగాణలో పవన్ కల్యాణ్ ద్వారా బీజేపీ నెరవేర్చాలకున్న లక్ష్యం నెరవేరలేదని చెప్పుకోవాలి. తెలంగాణలో బీజేపీకి అధికారం కన్నా.. తన ఉనికిని చాటుకోవడంతో పాటు బీఆర్ఎస్ కు మళ్ళీ అధికారం దక్కేలా చేయడమే కర్తవ్యం. బీజేపీకి అధికారంలోకి వచ్చే స్థాయి లేదన్నది ఆ పార్టీ పెద్దలకు కూడా తెలిసిన నిజమే కనుక.. ఇక మిగిలిన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ను అధికారానికి దూరంగా ఉంచడమే. కాంగ్రెస్ ముక్త భారత్ ఆ పార్టీ లక్ష్యం, అంటే  కాంగ్రెస్ బీజేపీ  ప్రథమ రాజకీయ ప్రత్యర్థి. కాబట్టి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ గెలిస్తే మంచిదని బీజేపీ భావించింది. అందుకు పవన్ కల్యాణ్ ను కూడా వాడుకుంది. కానీ, ఫలితం లేకపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిలువరించలేకపోయిన బీజేపీ ఇప్పుడు లోకసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని మొదలు పెట్టింది. అంతే ఉన్నపళంగా   పవన్ కళ్యాణ్ కు బైబై చెప్పేసింది. అసెంబ్లీ ఎన్నికలలో   జనసేనను దగ్గర చేసుకున్న బీజేపీ..   ఇప్పుడు   అవసరం లేదని పక్కకి నెట్టేసింది. ఏపీలో ఇప్పటికీ జనసేన తమతో పొత్తులోనే ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి ఎన్నికల నాటికి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.