మెగా స్టార్’కు కమలం గాలం !

Publish Date:Jun 29, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్’లో పట్టు సాధించేందుకు బీజేపీ శత విధాలా ప్రయత్నిస్తోంది. పావులు కదుపుతోంది. అందుకే, సినిమా ఇమేజ్, జనాకర్షణ ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్’ పోకడలు నచ్చక పోయినా జనసేనతో కుదిరిన పొత్తును నిలుపుకుఎందుకు ప్రాధాన్యత ఇస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ తెలుగు దేశంతో పొత్తుకు మొగ్గు చూపుతున్నారు. టీడీపీతో పొత్తు  లేకుండా వైసేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం సాధ్యం కాదని, పవన్ కళ్యాణ్ గుర్తించారు.

అందుకే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. అయితే, టీడీపీతో పొత్తుకు ఏ మాత్రం సుముఖంగాలేని, బీజేపీ పవన్ కళ్యాణ్,ను తమ వైపు నిలుపుకునేందుకు, చాలా గట్టి  ప్రయత్నాలే చేస్తోంది.  అయితే పవన్ కళ్యాణ్ ఇంకా అటూ ఇటూ ఉగుతున్న నేపధ్యంలో, ఇప్పడు మెగా స్టార్ చిరంజీవిపై కమల నాధులు కన్నేసినట్లు కనిపిస్తోందని రాష్ట్ర రాజకీయాలను దగ్గరగా చూస్తున్న,రాజకీయ పండితులు అంటున్నారు.  నిజానికి చిరంజీవి, చాలా కాలంగా రాజకీయలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఆయన మళ్ళీ రాజకీయ అరంగేట్రం చేస్తారని వార్త లొచ్చినా, వైసీపీ తరపున ఆయన రాజ్య సభకు వెళతారని పుకార్లు వినిపించినా, అవేవీ నిజం కాలేదు.

అంతే కాకుండా, ఇటీవల ఒక కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా, రాజకీయాలు రోజు రోజుకు మరింతగా కలుషితం అయిపోయాయని, అవేదన వ్యక్తం చేస్తూ, వేదిక మీద ఉన్న చిరంజీవి రాజకీయాలకు స్వస్తి చెప్పి మంచి పని చేసారని అన్నారు. అలాగే, మళ్ళీ రాజకీయాల వైపు చూడొద్దని, సూచించారు. ఆఫ్కోర్స్ అందుకు చిరంజీవి చిరునవ్వు తప్ప ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అనుకోండి, అయినా, చిరంజీవి సన్నిహిత వర్గాలు అయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రాకపోవచ్చనే, అంటున్నారు. 

అయితే , పవన్ కళ్యాణ్’ను తమ జట్టులో ఉంచుకునేందుకు, అదే విధంగా పార్టీ జాతీయ నాయకులు వచ్చినప్పడు నిర్వహించే బహిరింగ సభలు, మొన్నటి జీపే నడ్డ రాజమండ్రి  సభలా వెలవెలా పోకుండా ఉండేందుకు, ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో జనాకర్షణలో నెంబర్ వన్’గా ఉన్న చిరింజీవి గ్లామర్ ఉపయోగించుకోవాలని బీజేపీ ఆయన వైపు చూస్తోందని అంటున్నారు. 

ఈ నేపధ్యంలోనే, జూలై 4 వ తేదీన భీమవరంలో జరగనున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలకు చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ఆహ్వానించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భీమవరంలో అల్లూరి సీతారారారాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇదే కార్యక్రమానికి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, చిరంజీవికి ఆహ్వానం పంపారు. ఇప్పడు, అదే విషయంగా రాజకీయ, మీడియా వర్గాలలో ఉహగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ బలపడాలంటే..ఓ ప్రజాకర్షక నేత అవసరం ఉందని బీజేపీ పెద్దలు ఎప్పుడోనే గ్రహించారు. ఆ గ్యాప్’ను ఫిల్ చేసందుకు గతంలోనూ చిరంజీవితో చర్చలు జరిపారు. అప్పట్లో చిరంజీవి బీజేపీలో చేరుతారన్న పుకార్లు షికారు చేశాయి. అయితే, అవేవీ నిజం కాలేదు. 

అదలా ఉంటే, బీజేపీ వర్గాలు మాత్రం,  జూలై 4 వ తేదీన భీమవరంలో జరగనున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలకు చిరంజీవిని ఆహ్వానించడం వెనక ఎలాంటి రాజకీయ కారణం లేదని అంటన్నారు.  కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మాజీ మంత్రిగా, ప్రసిద్ధ కళాకారుడిగా మాత్రమే చిరంజీవిని ఆహ్వానించినట్లు చెపుతున్నారు. గతంలో హైదరాబాద్’లో జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లోనూ చిరంజీవి పాల్గొన్నారని గుర్తు చేస్తున్నారు. అయితే అదే సమయంలో చిరంజీవి తమ పార్టీలోకి వస్తానంటే, వద్దని ఎలా అంటామని, ఆయనకు బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, నేతలు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.