బీజేపీ.. తెలంగాణ స్ట్రాటజీ ఏపీలో!

Publish Date:Jun 20, 2023

Advertisement

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య ఉన్న సంబంధం ఏంటని అడిగితే దోస్త్ మేరా దోస్త్ అని కాస్త రాజకీయంపై అవగాహనా ఉన్న ఎవరైనా విడమర్చి చెప్పేస్తారు. పబ్లిక్ గా కాకపోయినా ప్రైవేట్ గానైనా ఈ సంబంధం అంతా ఓపెనే. ఈ నాలుగేళ్లుగా బీజేపీతో వైసీపీ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. కేంద్రం హామీలని పక్కన పెట్టినా వైసీపీ నోరు మెదపలేదు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులన్నింటికీ  వైసీపీ జీ హుజూర్ అంటూ మొప్పుపొందేందుకు చేయగలిగినంతా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  అంత కంటే ఎక్కువే చేసింది. అడిగింది కాదనకా.. అడిగేదేందుకు నేను ఉండగా అన్నట్లు ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే కేంద్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బీజేపీ అడగకపోయినా తానున్నానంటూ ఏపీ సీఎం జగన్ ముందు నిలబడ్డారు. అందుకు ప్రతిఫలంగా బీజేపీ కూడా వైసీపీ అడిగినవన్నీ చేస్తూ వస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకపోయినా అంతకు మించిన బంధం కొనసాగుతోందనీ.. ఈ బంధాన్ని తెంచుకోవడానికి రెండు పార్టీలకీ ఇసుమంతైనా ఇష్టం లేదని కూడా చెప్పుకున్నారు.

కానీ, ఈ మధ్య బీజేపీ అగ్రనాయకత్వం ఒక్కసారిగా వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. శ్రీకాళహస్తి, విశాఖపట్నంలలో ఏర్పాటు చేసిన సభలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ఇక్కడ చట్టం అమలు కావట్లేదని ఆరోపించారు. స్కాంలు తప్ప ఇక్కడేమీ జరగట్లేదని దుయ్యబట్టారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. దీంతో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పు వెనక కారణాలు ఏంటనే దానిపై  రకరకాల ప్రచారం జరిగింది. బీజేపీ తెలుగుదేశంతో దోస్తీకి సిద్ధమైందనే ప్రచారం అందులో ప్రధానంగా వినిపించింది.  బీజేపీ చేసిన విమర్శలకు వైసీపీ కూడా అదే స్థాయిలో విమర్శల వాన.. వాన ఏంటి  విమర్శల సునామీనే సృష్టించింది.  

అయితే అదే సమయంలో తెలుగుదేశం నేతలు కూడా బీజేపీపై విమర్శలు మొదలు పెట్టారు. జగన్ సర్కార్ అవినీతిపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోదు?  రాష్ట్రంలో అసలు చట్టమే అమలు కావట్లేదని చెప్పిన హోంమంత్రి జగన్ ప్రభుత్వంపై చర్యలు తీసుకుని తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ బీజేపీని నిలదీసింది. దీంతో అసలు ఈ రాజకీయం ఏంటో.. ఎవరు ఎవరికి స్నేహితులో.. ఎవరు ఎవరికి శత్రువులుగా మారబోతున్నారో అర్ధం కాక ప్రజలు రకరకాల చర్చలు సాగిస్తున్నారు. అయితే  దీని వెనక బీజేపీ భారీ స్కెచ్ ఒకటి ఉండొచ్చనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఒక్కసారి తెలంగాణ రాజకీయాలలోకి తొంగిచూస్తే ఈ స్కెచ్ ఏంటన్నది తేటతెల్లం అవుతుంది.

ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో అసలు ఉనికి ఉందా లేదా అన్నట్లున్న బీజేపీ ఈ స్థాయికి ఎదగడం వెనకున్న కారణం అప్పటి టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనేలా రెచ్చిపోవడం. నువ్వా నేనా అన్నట్లున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య బీజేపీ చేరి టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ను సైడ్ చేసింది. నేతల చేరికలతో పాటు ప్రభుత్వ లోపాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ అంచెలంచెలుగా ఎదిగే ప్రయత్నం చేసింది, చేస్తోంది. ఇందులో కొంతవరకు తెలంగాణలో సక్సెస్ అయ్యింది కూడా. ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు చాలా రాష్ట్రాలలో బీజేపీ ఎదుగుదల ఇలాగే జరిగింది. ఆ క్రమంలో మిత్రులను కూడా సైడ్ చేసి ఒక్కోమెట్టు ఎక్కింది. ఇప్పుడు అదే ఫార్ములాను ఏపీలో కూడా బీజేపీ ప్రయోగించాలనే ఆలోచన చేస్తుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

అయితే, బీజేపీ ఫార్ములా ఏపీలో సక్సెస్ అవుతుందా అంటే అనుమానమే. అప్పటి తెలంగాణలో బీజేపీ పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత దారుణం. పైగా తెలంగాణలో దెబ్బకొట్టిన కాంగ్రెస్ జాతీయ పార్టీ కాగా.. ఏపీలో టీడీపీ మూలాల వరకు చొచ్చుకుపోయిన రాష్ట్ర పార్టీ. ఇక  ఏపీలో బీజేపీకి ఇలాంటి ఫార్ములాలను అమలు చేయగల సమర్ధ నేతలు కూడా లేరు. దీంతో అగ్రనేతలొచ్చి కాస్త కీ ఇచ్చినా.. ఇక్కడ లోకల్ గా దానిని అమలు చేసే సత్తా రాష్ట్ర బీజేపీ నాయకులలో కనిపించడం లేదు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతున్నా.. ప్రస్తుతానికి ఏపీలో అందుకు విభిన్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.