గేట్ర‌ర్‌పై బీజేపీ గురి.. చంద్ర‌బాబు, అమిత్‌షా భేటీలో చ‌ర్చ‌!

Publish Date:Oct 20, 2024

Advertisement

తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆశించిన స్థాయిలో బీజేపీకి స్థానాలు ద‌క్క‌క‌పోయినా.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో మంచి ఫ‌లితాల‌నే రాబ‌ట్టింది. ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌డంతో.. తెలంగాణ‌లో బ‌ల‌మైన పార్టీగా ఎదుగుతున్నట్లు బీజేపీ చాటింది. తాజాగా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ దూకుడుగా ముందుకెళ్తున్నది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తర‌హాలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తూ అధికార పార్టీకి స‌వాళ్లు విసురుతోంది. ఈ క్ర‌మంలోనే గ్రేటర్ ఎన్నిక‌ల‌పై బీజేపీ గురి పెట్టింది. వ‌చ్చే ఏడాది జ‌రిగే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించాల‌ని ఆ పార్టీ నేత‌లు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీలో ఎన్డీయే కూట‌మిలో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు ఉన్నాయి. తెలంగాణ‌లోనూ తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల‌ను క‌లుపుకొని గ్రేట‌ర్ ఎన్నికల్లో పోటీ చేయాల‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం లాంటి బ‌ల‌మైన పార్టీ అండ‌దండ‌లు ఉంటే గ్రేట‌ర్‌లో విజ‌యం న‌ల్లేరుపై బండి న‌డకే అవుతుంద‌ని బీజేపీ అధిష్టానం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌త ప‌దేళ్లుగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో బీఆర్ఎస్ హ‌వా కొనసాగుతూ వ‌చ్చింది. రాజకీయంగా బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏ గేమ్ ఆడితే అదే హైదరాబాద్ లో కీలకంగా మారేది. కానీ, ఇప్పుడు కథ మారింది. బీఆర్ఎస్ క్ర‌మంగా త‌న ప్రాబ‌ల్యాన్ని కోల్పోతుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మితో గ్రేటర్ లోని ప‌లువురు నేతలు పార్టీని వీడారు. గ్రేటర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మరోసారి నిలబెట్టుకోలేక పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రేటర్ పై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో బీఆర్ఎస్ కి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ సహా పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. దీంతో గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది. గ్రేటర్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ లోని కీలక నేతలు ఆ పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతోంది. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ, హైడ్రా పేరుతో హడలెత్తిస్తోంది. ముఖ్యంగా నగరంలో చెరువులు, నాళాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈ పరిణామం నగర వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. మ‌రో ఏడాదిలో గ్రేటర్ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు, మూసీ సుందరీకరణకు ఎందుకు ప్రాధాన్య‌త‌నిస్తున్నార‌న్న‌ది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గ్రేటర్ పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ప్ర‌భుత్వ తీరును  త‌ప్పుప‌డుతున్నారు. మ‌రో వైపు ప్రభుత్వ తీరుపై గ్రేటర్ వాసుల్లోనూ వ్యతిరేకత పెరుగుతోంది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటున్నది. 

గ్రేటర్ పరిధిలో ఎక్కువగా సెటిలర్స్ ఉన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఎన్నోఏళ్లుగా హైదరాబాద్ నగరంలో స్థిరపడిపోయారు. వీరంతా ఎక్కువ శాతం తెలుగుదేశం మద్దతుదారులు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పెదగా క్రీయాశీలంగా లేకపోవటంతో గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం శ్రేణులు, సానుభూతిపరులు బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు.ఇప్పుడు  గ్రేటర్ పరిధిలోని తెలుగుదేశం సానుభూతిపరులను తమవైపుకు తిప్పుకొనేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ ఎన్నికల్లోనూ మూడు పార్టీలూ కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణలో తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది.  బీజేపీతో పొత్తు ఉంటుంద‌ని, ఖ‌మ్మం, హైద‌రాబాద్‌, న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ తోపాటు ప‌లు జిల్లాల్లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, తెలంగాణ బీజేపీలోని కొంద‌రు నేత‌లు తెలుగుదేశంతో పొత్తుకు అభ్యంత‌రం చెప్ప‌డంతో బీజేపీ ఒంట‌రిగా ఎన్నిక‌ల‌కు వెళ్లింది. తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది. దీంతో తెలుగుదేశం సానుభూతిప‌రులు అధిక‌శాతం మంది రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వం వ‌హించిన కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. 

మ‌రో ఏడాది త‌రువాత జ‌ర‌గ‌బోయే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ పోటీలో లేకుంటే ఆ పార్టీ మ‌ద్ద‌తుదారులు కాంగ్రెస్ కే మ‌ద్ద‌తుగా నిలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చేసిన త‌ప్పుచేయ‌కుండా,  తెలుగుదేశంతో క‌లిసి పోటీ చేస్తేనే బాగుంటుంద‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు. తెలుగుదేశంతోపాటు జ‌న‌సేనని కూడా క‌లుపుకొని గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు వెళితే మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకోవ‌టం సాధ్య‌మ‌వుతుంద‌ని బీజేపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. అయితే, ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉండ‌టంతో ఆ స‌మ‌యానికి రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు ఏ విధంగా మారుతోయో వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. మ‌రికొద్ది రోజుల్లో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. స్వ‌యాన సీఎం రేవంత్ రెడ్డిసైతం కేటీఆర్ ను జైలుకు పంపిస్తానంటూ బ‌హిరంగ స‌భ‌ల్లో పేర్కొన్నారు. కేటీఆర్ కూడా జైలుకెళ్లేందుకు, సిద్ధ‌మ‌ని చెప్పడమే కాకుండా, జైల్లో యోగా చేసుకొని, మంచి ఫిట్ నెస్ తో బ‌య‌ట‌కు వ‌చ్చి పాద‌యాత్ర చేస్తానంటూ ప్రకటన కూడా చేశారు. త్వరలో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఓ క్లారిటీతో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి‌.
జగన్ బెయిలు రద్దు పిటిష్ విషయంలో సీబీఐ తన స్టాండ్ మార్చుకుంటుందా? అలా మార్చుకుంటే జగన్ జైలుకు వెళ్లక తప్పదా అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఆ రోజు విచారణ జరిగింది.
  తెలంగాణలో పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం బెల్ట్ షాపులను ప్రోత్సహించింది.  మద్యానికి బానిసలైన  కుటుంబాలు దీనవస్థను ఎదుర్కొన్నాయి. గత డిసెంబర్ లో కెసీఆర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు .
మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా తీరు గురువింద గింజమాదిరగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పేటందుకె నీతులు ఉన్నాయి అన్నట్లు.. తాను చేసిన తప్పులు మరిచిపోయి ఇప్పుడు ఎదుటివారిపై విమర్శలకు తహతహలాడుతున్న రోజా తీరు చూస్తుంటే గురువింద గింజ సామెతే గుర్తుకు వస్తోందంటున్నారు పరిశీలకులు.
నందమూరి బాలకృష్ణ, నటసింహం. సినిమాలలో ఆయన అన్ స్టాపబుల్.. అలాగే రాజకీయాలలో అన్ స్టాపబుల్ ఎవరు? ఈ ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అలాంటిది తాను రాజకీయాలలో అన్ స్టాపబుల్ అని స్వయంగా చంద్రబాబే చెబితే.. ఔను తాను రాజకీయాలలో అన్ స్టాపబుల్ అని చంద్రబాబు స్వయంగా చెప్పారు.
భార‌త‌దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోన్న వేళ‌ బీజేపీ అధినాయ‌క‌త్వం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. పార్టీ నాయ‌క‌త్వంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయ‌న్న చర్చ బీజేపీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా జేపీ న‌డ్డా ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో.. ఆయ‌న వార‌సుడిని ఎంపిక చేసే ప‌నిలో పార్టీ పెద్ద‌లు నిమ‌గ్న‌మ‌య్యారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ప్రాంగణంలో  రెండు రోజుల క్రితం జరిగిన లాఠీ చార్జిపై బిజెపి సీరియస్ గా ఉంది బిజెపి నేత ఈటెల బృందం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది . మజ్లిస్ చెప్పు చేతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు
కేసీఆర్... ఈ మాట వినగానే నిన్నమొన్నటి వరకూ అందరి నోటా మాటల మాంత్రికుడు, రాజకీయ చాక్యుడు.. ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందే ఉంటారు. వారు వ్యూహ రచన చేయడానికి ముందే వాటికి విరుగుడు వ్యాహాలను అమలు చేసి వారిని నిరుత్తరులను చేస్తారు. అన్న మాటలే వినిపించేవి. అయితే ఇదంతా బీఆర్ఎస్ ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్షానికే పరిమితం కావడానికి ముందు వరకూ మాత్రమే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ రాజకీయాలను తట్టుకోవడం కష్టమని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరించేసిన పరిస్థితి.
పరిచయం అక్కర్లేని పేరు సల్మాన్ ఖాన్.. కండల వీరుడిగా అశేషమైన ప్రేక్షకాభిమానం కలగిన స్టార్ హీరో. దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలో ఆయనకు అభిమానులు ఉన్నారు. హీరోగా ఆయన స్థాయే వేరు. తెరపై విలన్లను భయభ్రాంతులకు గురి చేసి, వారిని చీల్చి చెండాని గెలిచే పాత్రలలో సల్మాన్ స్టైలే వేరు. ఎదురులేని హీరోగా ప్రేక్షకుల నీరాజనాలందుకునే సల్మాన్ ఖాన్ ఇప్పుడు భయంతో వణికి పోతున్నాడు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దారులన్నీ మూసుకుపోయాయి. రాజకీయంగా మనుగడ సాగించాలంటే.. తన తీరు మార్చుకోక తప్పదని అర్ధమైంది. వైసీపీకి ఎటూ పొలిటికల్ ఫ్యూచర్ జీరో అని అవగతమైంది. ఇప్పుడు రాజకీయంగా ఉనికి కాపాడుకోవాలంటే కాంగ్రెస్ వినా మరో దిక్కు లేదని అవగతమైంది. కాంగ్రెస్ కు అనుకూలంగా ఎన్ని ప్రకటనలు చేసినా.. అడగకుండానే ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నా.. అటు నుంచి ఎటువంటి స్పందనా కనిపించడం లేదు. ఇందుకు కారణం ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షరాలిగా ఉన్న తన సొంత చెల్లి షర్మిల అనే విషయం బోధపడింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక చకచకా సాగుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టత ఇచ్చారు. నిర్దిష్ట కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్న కృత నిశ్చయంతో ఉన్న చంద్రబాబు.. మూడేళ్లలో అమరావతి పూర్తి చేయాలన్న విస్పష్ట ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇక అమరావతి పనులు పరుగులు పెడతాయనడంలో సందేశం లేదు.
నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ 4వ సీజన్ రెడీ అయ్యింది. తొలి మూడు సీజన్లూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అటు సినిమాలలోనూ బాలయ్య అన్ స్టాపబుల్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. మరో వైపు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలోనూ అందరి మన్ననలూ అందుకుంటున్నారు. ఇక తన అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా ప్రేక్షకులను బుల్లితెరకు కట్టిపారేస్తున్నారు.
బెదరింపు కాల్స్ నేపథ్యంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఖతం చేస్తామన్న బెదరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ రూ.2కోట్లు విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశారు. గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ రూ. 5 కోట్లు ఇవ్వకుంటే ఖతం చేస్తామంటూ సల్మాన్ ఖాన్ కు బెదరింపులు పంపిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.