అక్కడ పొగడ్తలు.. ఇక్కడ తెగడ్తలు.. బీజేపీ డ్యుయెల్ రోల్

Publish Date:May 25, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విషయంలో బీజేపీ చిత్ర విచిత్ర వేషాలు వేస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కార్ జగన్ ప్రభుత్వానికి ఏ చిన్న ఇబ్బందీ రాకుండా అన్ని విధాలుగా జాగ్రత్తగా చూసుకుంటోంది. అడగకుండానే ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నా.. ససేమిరా ఇవ్వనంటున్న బకాయిలను జగన్ కు వెసులుబాటు కలిగే విధంగా ఎన్నికల సంవత్సరంలో విడుదల చేసేసింది. పార్లమెంటు వేదికగా ఎప్పుడూ రుణగొణ ధ్వనేనా అని స్వయంగా విత్తమంత్రి వైసీపీ ఎంపీలపై చిరాకు పడ్డారు. అటువంటి పరిస్థితి నుంచి ఇంకా అప్పు కావాలా అని అడిగి మరీ మంజూరు చేసేస్తున్నారు. 

అదే సమయంలో ఏపీ బీజేపీ మాత్రం జగన్ సర్కార్ పై చార్జిషీట్లు పెడుతూ.. ప్రభుత్వం అన్ని రంగాలలోనూ విఫలమైందంటూ విమర్శలు గుప్పిస్తోంది. వెంటనే ఆయనేమైనా నొచ్చుకుంటారేమోనని తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ పేదలకు లక్షల ఇళ్లు కట్టిస్తూ జగన్ ప్రజారంజకంగా పాలిస్తున్నారంటూ పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. మా ముఖ్యమంత్రి బ్రహ్మాండం. పేదల పాలిటి పెన్నిధి అని చాటుకోవడానికి వైసీపీ కార్యకర్తలకు ఈటల  మాటలు బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి. ఈటల వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేసుకుంటోంది.  ఎందుకంటే  కొద్ది రోజుల కిందటే ఏపీ బీజేపీ నిర్వహించిన ప్రజా చార్జిషీట్‌ ఉద్యమంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. కేంద్ర నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం జరగడం లేదని  విమర్శలు గుప్పించారు.  ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ.. ప్రధాని ఆవాస్ యోజన అని బోర్డు పెట్టడం లేదంటూ మండిపడ్డారు.  కేంద్ర మంత్రి స్వయంగా వచ్చి ఏపీలో ఇళ్ల పరిస్థితి చూడాలని కోరారు. రోజుల వ్యవధిలో అదే బీజేపీకి చెందిన తెలంగాణ నాయకుడు ఈటల రాజేందర్ జగన్ ను ఆకాశానికెత్తేస్తూ వ్యాఖ్యలు చేశారు.   

వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 10 లక్షల ఇళ్లు మంజూరైతే   వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు  కేవలం 30 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందని సోము వీర్రాజు అంటే.. జగన్ సర్కార్ పేదలకు లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చేసిందని ఈటల పొగిడేస్తున్నారు.   జగన్ విషయంలో ఏపీ బీజేపీ ఒకలా, తెలంగాణ బీజేపీ మరోలా మాట్లాడడం వెనుక మర్మమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

By
en-us Political News

  
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.