బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్.!

Publish Date:Aug 17, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాలలో కవిత వ్యాఖ్యలు మరో సారి తీవ్ర దుమారం రేపాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేర సొంత పార్టీ ఏర్పాటు చేసిన కవిత.. అప్పటి నుంచీ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.  పలు ఇంటర్వ్యూలలో కవిత.. బీఆర్ఎస్ లో తనపై జరిగిన రాజకీయ కుట్రలను, ఎదుర్కొన్న అవమానాలను ఎలంటి శషబిషలూ లేకుండా కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతూ వస్తున్నారు.  తాజాగా మరో సారి ఆమె బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. ఈ సారి ఆమె నేరుగా తన సోదరుడు కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. 

కేటీఆర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  కవితను తాము పార్టీ నుంచి పంపించలేదనీ..  ఆమెకు అనేక రాజకీయ అవకాశాలు కల్పించినప్పటికీ సొంత నిర్ణయాలతో దూరమయ్యారని పేర్కొన్న వ్యాఖ్యలకు కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు. ఏ వివరణ కోరకుండానే సస్పెన్షన్ వేటు వేయడం వెనుక సొంత పార్టీలోనే కొందరు కుట్రపన్నారన్నారు. ఈ  పరిణామాలు తనను మానసిక వేదనకు గురిచేశాయని,  తన కన్నతండ్రి  కేసీఆర్‌ను కూడా కలవనీయకుండా కొందరు  డ్డుకున్నారని కవిత ఈ సందర్భంగా చెప్పారు.

పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కోల్పోయిందని విమర్శించిన కవిత, కేసీఆర్ కుమార్తెగా ఉన్న తనకు పార్టీలో ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, ఇక సాధారణ కార్యకర్తల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త వేదికను ఏర్పాటు చేసి ప్రజల కోసం పోరాట బాట పట్టినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి అడుగుపెట్టే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. అదలా ఉండగా.. కల్వకుంట్ల కవిత విమర్శలు, ఆపోపణలపై బీఆర్ఎస్ అధినాయకత్వం సరైన రీతిలో స్పందించలేకపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, కవిత లేవనెత్తిన సాంకేతిక, వ్యక్తిగత అనుభవాలకు సమాధానం ఇవ్వలేకపోయారు.  

Kalvakuntla Kavitha, KCR KTR BRS Dispute, Telangana Rakshana Sena, Telangana Politics, BRS Internal Conflicts

By
en-us Political News

  
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.