బీజేపీది వ్యూహమా? సెల్ఫ్ గోలా?

Publish Date:Jul 5, 2023

Advertisement

చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్లుంది తెలుగురాష్ట్రాలలో పార్టీ ప్రక్షాళన పేరుతో బీజేపీ హైకమాండ్ చేసిన మార్పుల వ్యవహారం. రెండు రాష్ట్రాలలోనూ కూడా బీజేపీ హైకమాండ్ కు రహస్య మిత్రులున్నారు. ఆ విషయాన్ని పార్టీ రాష్ట్ర నాయకులకు కూడా తెలియనీయకుండా హైకమాండ్ జాగ్రత్త పడింది. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి పార్టీ అధిష్ఠానం ఆ రాహస్య మిత్రుల కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని బలి చేసింది. పార్టీ పరువును గంగలో కలిపేయడానికీ సిద్ధ పడింది. తెలుగురాష్ట్రాలలో పార్టీ భవిష్యత్ ను వదిలేసుకుంది. ఆ రహస్య మిత్రుల విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినా బీజేపీ అధిష్ఠానం మాత్రం కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగినట్లు వ్యవహరించింది. వ్యవహరిస్తోంది.అదేదో బ్రహ్మరహస్యం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చింది.

 ఇంతకీ బీజేపీకి ఉన్న ఆ రహస్య మిత్రులు ఎవరంటే తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో జగన్ నాయకత్వంలోని వైసీపీ అని పరిశీలకులు చెబుతున్నారు. సామాన్య జనం కూడా అదే నమ్ముతున్నారు. 

ముందుగా తెలంగాణ విషయం తీసుకుంటే.. బీఆర్ఎస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ కోసం సర్వం ఒడ్డి పోరాడిన బండి వంటి నేతలకు హైకమాండ్ దిమ్మదిరిగేలా షాక్ ఇచ్చింది. పండుగాడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే అన్నట్లుగా రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం ఇక తేరుకోలేనంతగా దెబ్బకొట్టింద. స్వయంగా అధిష్ఠానమే కాళ్ల కింద భూమిని లాగేస్తే.. అందుకోబోతున్న అధికార అందలాన్ని అందకుండా చేస్తే.. ఇక  రాష్ట్రంలో బీజేపీ బలపడేదెలా?  బీజేపీ కోసం అరెస్టులకు, లాఠీ దెబ్బలకు, కేసులకు వెరవకుండా పని చేసిన రాష్ట్ర నాయకులు జనాలకు ముఖం చూపేదెలా అని పార్టీ శ్రేణులే అవేదన వ్యక్తం చేస్తున్నాయి.   బీజేపీ రాష్ట్ర నాయకుడు  బండి సంజయ్  విషయమే తీసుకుంటే.. బండి సంజయ్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తరువాతే తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఆయన కుటుంబ పాలనను, కుటుంబ సభ్యుల అవినీతినీ ప్రతి వేదిక మీదా ఎండగడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ కు పక్కలో బల్లెంగా మారారు. ఇప్పుడు ఆ బాధ్యతలను కేంద్ర మంతి కిషన్ రెడ్డికి అప్పగించింది బీజేపీ హైకమాండ్. దీంతో బీఆర్ఎస్ పార్టీకి   ఫస్ట్ టార్గెట్ గా మారిన బండి సంజయ్ ను ఏ రక్షణా లేకుండా పార్టీ హైకమాండ్ బీఆర్ఎస్ కు ఎరవేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బండి సంజయ్ దూకుడు కారణంగానే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కు దీటుగా ఎదిగింది.  పార్టీకి అధికారంలోకి రాగలమన్న విశ్వాసాన్ని ఇచ్చింది. అయితే బీజేపీ అధిష్ఠానం అనూహ్యంగా తెలంగాణలో బీజేపీ కూర్చున్న కొమ్మనే నరికేసింది.  ఇందుకు జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతన దెబ్బతీయడానికి బీఆర్ఎస్‌తో రహస్య రాజకీయ అవగాహనే కారణమని పార్టీ శ్రేణులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నాయి. కేసీఆర్ ఒత్తిడి కారణంగానే బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బీజేపీ అధిష్ఠానం తప్పించిందని అంటున్నారు.  

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అసలు ఇంత కాలం ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును కొనసాగించడమే వింత అనుకుంటే.. హఠాత్తుగా ఆయనను తప్పించి ఆ బాధ్యతలను పురంధేశ్వరికి అప్పగించడం మరో వింతగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ అగ్ర నేతలు ఏపీ పర్యటనలకు వచ్చినప్పుడు జగన్ సర్కాన్ ను విమర్శలతో ఎండగట్టడం, హస్తినకు వెళ్లగానే సైలెంట్ అయిపోతుండటం ఇటీవలి కాలంలో చూస్తూనే ఉన్నాం.  రాష్ట్ర పార్టీ  మొత్తం సోము వీర్రాజును వ్యతిరేకిస్తున్నా చర్య తీసుకోకుండా ఇంత కాలం నిమ్మకు నీరెత్తినట్లు బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహరించడానికి సోము తీరు ఏపీలో పార్టీకి నష్టం చేసినా అధికారంలో ఉన్న జగన్ కు ప్రయోజనం చేకూర్చేదిగా ఉండటమే కారణమని ఏపీలో ఇంత కాలం విస్తృతంగా చర్చ జరుగుతూ వచ్చింది.  ఇక ఇప్పుడు ఉరుము లేని పిడుగులా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని  ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి అప్పగిం అప్పగించడం ద్వారా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశంతో పొత్తుకు అవకాశాలు లేవన్న సందేశాన్ని బీజేపీ హైకమాండ్ ఇచ్చిందా అన్న అనుమానాలు రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తమౌతున్నాయి.  సోము వీర్రాజును తప్పించడం ద్వారా వైసీపీకి బీజేపీ అనుకూలమన్న  ముద్రను తుడిచేసుకోవడం, అదే సమయంలో  జగన్ కు మేలు చేకూర్చే విధంగా పొత్తుకు అవకాశం లేకుండా చేయడం బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహంగా చెబుతున్నారు.  మొత్తం మీద దక్షిణాదిపై ఆశలు వదిలేసుకున్న బీజేపీ.. జాతీయ స్థాయిలో  ప్రయోజనాల కోసం తెలుగురాష్ట్రాలలో పార్టీని బలి చేయడానికి రెడీ అయ్యిందని అంటున్నారు. 

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.