కేసీఆర్ జాతీయ ఆకాంక్షలు మెగ్గలోనే తుంచేయడానికి కమలం వ్యూహాలు

Publish Date:Jul 5, 2022

Advertisement

తెలంగాణలో బీజేపీ రాజకీయ బల ప్రయోగానికి సిద్ధపడింది. తెలంగాణలో అధికారం చేపట్టడమొక్కటే లక్ష్యం కాదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పై చేయి సాధించి ఊరుకోవడం కాదు. ఆ పార్టీ అధినేత జాతీయ ఆశలకు చెక్ పెట్టడం. ఇంకో మాటలో చెప్పాలంటే.. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షకు సమాధి కట్టేయడం. జాతీయ స్థాయిలో బీజేపీయేతర శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు కేసీఆర్ తోనే మొదలు కాలేదు.

కేసీఆర్ తోనే అంతం కావు. అయినా బీజేపీ కేసీఆర్ నే ఎందుకు టార్గెట్ చేసింది. జాతీయ స్థాయిలో బీజేపీయేతర శక్తుల ఏకీకరణ విషయంలో కేసీఆర్ కంటే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఒకింత శక్తిమంతంగా ముందుకు సాగుతున్నారు. ఆమె వెనుక జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిన శరద్ పవార్ వంటి నేతలూ ఉన్నారు. అయినా బీజేపీ కేసీఆర్ నే ఎందుకు టార్గెట్ చేసింది. ఈ ప్రశ్నలకు రాజకీయ పరిశీలకులు చెబుతున్న జవాబు దక్షిణాదిన పార్టీ పునాదులు బలంగా పడాలంటే కర్నాటక ఒక్కటే చాలదు.. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంటే..   ఏపీలో వేళ్లూనుకోవడానికి ఆ పార్టీకి ఒక బేస్ దొరుకుతుంది. ఏపీలో అధికార వైసీపీ ఇప్పటికే కమలం చెప్పు చేతల్లో నడుస్తోంది. ఇక తెలంగాణలో కేసీఆర్ ను నిలువరిస్తే చాలు. ఇప్పటికే ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మరో సారి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.

ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి అభివృద్ధి అజెండాను బలంగా ప్రచారం చేసుకుంటోంది. అదే సమయంలో కేంద్రంలో కూడా గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై కూడా అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. అయినా మరో సారి కేంద్రంలో జెండా ఎగురవేయగలమన్న ధీమా కమలనాధుల్లో వ్యక్తం కావడానికి  విపక్షాల అనైక్యతే అధికారాన్ని పువ్వుల్లో పెట్టి అందిస్తుందన్న విశ్వాసమే. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఆ సంగతి మరోసారి ప్రస్ఫుటమైంది. అయితే ఇక్కడే కేసీఆర్ తన వ్యూహాలతో కేంద్రంలో మూడో సారి అధికారం అన్న కమలనాథుల కలలకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనంగా ఉందనడంలో సందేహం లేదు. ఇక విపక్షాల ఐక్యత ఎండమావే.. కానీ ప్రాంతీయ పార్టీలను ఐక్యం చేసే వ్యూహంతో కేసీఆర్ కదుపుతున్న పావులు తమ కాళ్లకు అడ్డం వస్తాయని కమలనాథులు భావిస్తున్నారు.

కేసీఆర్ వ్యూహాత్మకంగా మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించడం.. మోడీ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయడం వంటి చర్యలతో జాతీయ స్థాయి మీడియాను అట్రాక్ట్ చేశారు.  గుజరాత్ సీఎంగా మోడీ ఏరకంగా అయితే జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారో... ఇప్పుడు అదే దారిలో కేసీఆర్ పాపులర్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోంది అన్న అర్ధం వచ్చేలా జాతీయ మీడియాలో ప్రకటనలు గుప్పించి తన జాతీయ రాజకీయ ప్రవేశానికి ఒక వాతావరణాన్ని కల్పించుకునే ప్రయత్నం బలంగా చేశారు. సరే జాతీయ స్థాయిలో పార్టీలు కలసిరాకపోవడం వేరే సంగతి అయితే బీఆర్ఎస్ అంటూ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి బలంగా మోడీని ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దేశ రాజకీయాలలో బీజేపీ వినా మరో జాతీయ పార్టీ బలంగా కనిపించని పరిస్థితి. అయితే దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఆయా పార్టీల సిద్ధాంతాలూ, ఆకాంక్షలు వేటికవి భిన్నమే అయినా.. కేసీఆర్ ఆ పార్టీల మధ్య సయోధ్య సాధించి 2024 ఎన్నికల నాటికి ఒక బలమైన పోటీదారుగా వచ్చే అవకాశాలున్నాయన్నది కమలనాథుల అంచనా. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం లేకుండా చేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకు వ్యూహరచన నుంచి కార్యాచరణ వరకూ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ మోడీషా ద్వయమే. ఒక నిర్దుష్ట సిద్ధాంతం పునాదిగా ఆవిర్భవించినట్లు చెప్పుకునే బీజేపీ ఇప్పుడు తెలంగాణలో చేరికలను ప్రోత్సహించడానికి సిద్ధపడిపోయింది.

ఈ చేరికల సమన్వయ బాధ్యతలను టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తమ గూటికి చేరిన ఈటలకు అప్పగించింది. అంటే అర్ధమేమిటి? ఈటల టీఆర్ఎస్ లో తన పరిచయాలనూ, పలుకుబడినీ ఉపయోగించి ఆ పార్టీ నుంచి కమలం పార్టీలోని వలసలను ప్రోత్సహించడం.  తెలంగాణలో టీఆర్ఎస్ విజయానికి అవకాశాలు సన్నిగిల్లుతున్నాయన్న వాతావరణాన్ని కల్పిస్తే కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉండదు. ఆయన పూర్తిగా తెలంగాణకే పరిమితమవ్వాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. బీజేపీ చేసింది, చేస్తున్నది అదే. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి కారణంగా కేసీఆర్ పూర్తిగా తెలంగాణపైనే దృష్టి సారించినా ఇక్కడ మరో సారి అధికారం చేజిక్కించుకునేందుకు చెమటోడ్చక తప్పని పరిస్థితి. ఇప్పటికే తెలంగాణలో అటువంటి వాతావరణం ఏర్పడింది. దానిని కొనసాగించడమే బీజేపీ లక్ష్యంగా చెబుతున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న సామెతలా కేసీఆర్ ఇటు తెలంగాణలో అధికారానికి దూరం చేయడం, అటు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం లేకుండా చేయడం లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను అమలు చేస్తున్నది. మరో వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమై కేసీఆర్ కు సవాల్ విసురుతుండటం కూడా కమలానికి కలిసి వస్తున్నది.

By
en-us Political News

  
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.