తెలంగాణపై బీజేపీ నజర్.. కేసీఆర్ కు ఇక చిక్కులు తప్పవా?

Publish Date:May 11, 2022

Advertisement

తెలంగాణ  లో బీజేపీయే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అన్న విశ్వాసాన్ని ప్రజలలో కల్పించే యత్నంలో బాగంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పార్టీ అగ్ర నేతలను రంగంలోనికి దింపుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఉన్న అవకాశాలను అంచనా వేసిన అగ్ర నేతలకు కూడా అందుకు సుముఖంగా ఉన్నారు. తరచూ రాష్ట్ర పర్యటనలతో తెలంగాణ బీజేపీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.  

ఇప్పటికే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన, ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు  రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచాయి. ఇక ఈ నెల 14న   అమిత్ షా రా ష్ట్ర పర్యటన ఈ కాకను మరింత పెంచే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.   తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందా? రాజకీయంగా బలపడటమే కాకుండా, కేంద్రంపై విమర్శలతో విరుచుకు పడుతున్న కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోందా? ఈ ప్రశ్నలకు బీజేపీ అగ్ర నేతలు ఒకరి వెంట ఒకరుగా తెలంగాణకు క్యూ కడుతుండటం చూస్తుంటే ఔననే సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించారు. మరి కొద్ది రోజులలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా రానున్నారు. ఆ తరువాత ఈ నెల చివరిలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. వీరు కాకుండా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వారు కూడా తరచుగా తెలంగాణలో పర్యటించేందుకు షెడ్యూల్ రూపొందించుకుంటున్నారు.  

తెలంగాణలో కేసీఆర్ పాలనలోని లోపాలను ఎత్తి చూపడమే కాకుండా.. రాష్ట్రంలో కమలం పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై వీరు రాష్ట్ర నాయకత్వానికి మార్గ నిర్దేశనం చేయనున్నారు. ఇప్పటికే గతంలో కంటే రాష్ట్రంలో బీజేపీ బలపడిందన్న అంచనాలు ఉన్నాయి. ఈటల రాజేందర్, రఘునందర్ వంటి వారి చేరికకు తోడు రానున్న రోజులలో మరి కొందరు ప్రముఖులు కూడా కాషాయి నీడన చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.   కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి, కొండారెడ్డి త్వరలో బీజేపీలో చేరుతారని, వారి చేరికతో కమలం పార్టీ మరింత బలోపేతమౌతుందని అంటున్నారు.  రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేసేందుకు కూడా బీజేపీ అగ్రనాయకత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మిల్లర్ల మాయాజాలంపై ఎఫ్ సీఐ దర్యాప్తు మొదలు పెట్టింది. తనిఖీలు ముమ్మరం చేసింది.

దీని  ఆధారంగా సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే కాళేశ్వరం అవినీతిపై కూడా కేంద్రం దృష్టి సారించిందంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తన ఇటీవలి పర్యటనలో కేసీఆర్ కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ చే దర్యాప్తు జరిపించాలన్న యోచనలో కేంద్రం ఉందని అంటున్నారు. త్వరలోనే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తరచుగా చెబుతుండటమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇలా అన్ని వైపుల నుంచీ కేసీఆర్ ను చక్రబంధంలో బిగించే విధంగా బీజేపీ పావులు కదుపుతున్నది. వీటన్నిటినీ తట్టుకుని కేసీఆర్ జాతీయ స్థాయిలో తన ముద్ర వేసేలా ముందుకు సాగుతారా? అందుకు పరిస్థితులు అనుకూలిస్తాయా అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ముందు రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడంతో పాటు మరో మారు అధికారం చేజిక్కించుకునేందు వ్యూహాత్మకంగా బీజేపీకి దాసోహం అంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఏది ఏమైనా బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టే విధంగా వేగంగా అడుగులు వేస్తున్నదనడంలో సందేహం లేదు. ఎనిమిదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు వేగంగా ప్రజా మద్దతును కోల్పోతున్నారన్న అంచనాతో ఉన్న బీజేపీ ఇదే అదునుగా తన దూకుడు పెంచింది. అదే సమయంలో కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో బీజేపీ బలోపేతంపై దృష్టి సారించింది. దక్షిణాదిలో కర్నాటక వినా మరే రాష్ట్రంలోనూ బీజేపీకి ఇప్పటి వరకూ పట్టు చిక్కలేదు.

తొలి సారిగా తెలంగాణలో పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయన్నది ఆ పార్టీ అగ్ర నేతల అంచనా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీజేపీ మద్దతు పలకడం, కాంగ్రెస్ వైఫల్యాలు, టీఆర్ఎస్ పట్ల ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతలే అలంబనగా రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో అనూహ్యంగా పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకోవడం, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలలో విజయం బీజేపీలో ధీమాను పెంచాయి. అదే సమయంలో పార్టీ అధిష్టానంలో తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించేలా చేశాయి. 

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.