గవర్నర్ పై వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. రాష్ట్ర బిజెపి డిమాండ్

Publish Date:Aug 19, 2020

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో కోవిద్ 19 వ్యాప్తిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న విషయాన్ని ప్రస్తావించిన రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్య రాజన్ పై టిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడాన్ని బిజేపి రాష్ట్ర నాయకులు తప్పు పట్టారు. సోషల్ మీడియాలో గవర్నర్ పై పోస్టులు పెట్టిన నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్ర గవర్నర్ కు రాజకీయాలను ఆపాదించడం అప్రజాస్వామికం అన్నారు.  గవర్నర్ ని టార్గెట్ చేయడం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమే అన్నారు. కొందరు టిఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్ లను ముఖ్యమంత్రి చేష్టలుడిగి నట్లు చూస్తున్నారని విమర్శించారు. బిజేపి జాతీయ నాయకులు డాక్టర్ కె.లక్ష్మణ్ ,అధికార ముఖ్య ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు, కోర్ కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, మహిళామోర్చా నాయకులు డిమాండ్ చేశారు.

 

రాజ్యంగ పదవిలో ఉన్న గవర్నర్ కు రాజకీయాలు ఆపాదిస్తూ చేసిన విమర్శలను ఉపసంహరించుకోవాలని భారతీయ జనతాపార్టీ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. డాక్టర్ గా ఆమె కోవిద్ 19 వైరస్ వ్యాప్తి జరుగుతున్న తీరు, ప్రజలు పడుతున్న అవస్థలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని, ప్రభుత్వానికి పలు సూచనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 

 

హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తో పాటు ఇతర టిఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంవరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. పార్టీ అదినేత గా ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని కోరారు.. సోషల్ మీడియాలో పోస్టులను పెట్టిన నేతల ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కట్టడి లో విఫలమైన ప్రభుత్వం గవర్నర్ ని టార్గెట్ చేయడం అప్రజాస్వామికం ,శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవి లో ఉండి ఒక వైద్యరాలిగా  ప్రభుత్వానికి, సి ఎస్ కు ,వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పీరియాడికల్ గా విలువైన సూచనలు గవర్నర్ చేశారు. అయితే ఆ సూచనలు ఏవీ పాటించకుండా రాష్ట్రంలో కేసీఆర్ ఒంటెద్దు పోకడలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను గాలికి వదిలేశారు. వాస్తవాలు చెప్పి, బాధ్యతయుతంగా సూచనలు చేసిన గవర్నర్ పై విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమో గమించాలన్నారు. కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్ లను బిగించలేని దుస్థితి లో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు .

 

అధికారపార్టీ కబ్జాల కారణంగానే..
టిఆర్ఎస్ నేతల భూకబ్జాల కారణంగానే వరంగల్ నగరం వరదలకు అతలాకుతలమైనదని విమర్శించారు. రాష్ట్రంలో ఎమ్మార్వో లపై ఏసీబీ దాడులు కేసీఆర్ అవినీతి పాలనకు పరాకాష్ట అని సుధాకర్ రెడ్డి విమర్శించారు .

 

ఇకనైనా పద్దతి మార్చుకోండి - కె. లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ 19 ఎదుర్కోవడంలో దారుణ వైఫల్యం చెంది, సంక్షోభానికి కారణమైన కేసీఆర్ ప్రభుత్వానికి గవర్నర్ డా. తమిళిసై చివాట్లు పెట్టడాన్ని బీజేపీ స్వాగతిస్తోంది. ఇకనైనా టిఆర్ఎస్ ప్రభుత్వం తమ పంథా మార్చుకుని కోవిడ్ విషయంలో వ్యవహరిస్తోన్న పద్ధతిని సరిచేసుకోవాలని డాక్టర్ లక్ష్మణ్ సూచించారు.

 

తెలంగాణ వ్యాప్తంగా, జిల్లాల్లోనూ, హైదరాబాద్ లోనూ చాలా కాలనీల్లో, అపార్టుమెంట్లలో అనేక మరణాలు సంభవిస్తున్నాయి. కానీ వాటి వివరాలు సేకరించే వ్యవస్థ ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. స్వయంగా వైద్యురాలైన గవర్నర్ మార్చి నుంచీ టిఆర్ఎస్ ప్రభుత్వం కరోనా విషయంలో వ్యవహరిస్తోన్న తీరు, నేరపూరిత నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకున్నారు. చివరికి ఇప్పుడు, ఆఖరి అస్త్రంగా బహిరంగంగా టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటకు తెచ్చారు. ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న గవర్నర్ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.