తెరాస పై బీజేపీ సెంటిమెంట్ వార్ ఢిల్లీలో డే’ వేడుకలు
Publish Date:Jun 1, 2022
Advertisement
భారతీయ జనతా పార్టీ తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించిందా? ఏది ఏమైనా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోందా? అందులో భాగంగానే తెలంగాణ సెంటిమెంట్ ‘ను కూడా సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందా? అంటే అవుననే అంటున్నారు, పార్టీ నాయకులు, రాజకీయ పరిశీలకులు. ఇప్పటికే, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక అష్ట దిగ్భందనంలో బిగించి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా సిద్ధం చేస్తోందా, అంటే, అందుకూ అవుననే సమాధానమే వస్తోంది. నిజం. ఈ రాజకీయ పార్టీ అయినా, అధికారమే లక్ష్యంగా పనిచేస్తాయి. ఈవిషయంలో బీజేపీ ఎక్కువ చదివిందా, తెరాస ఎక్కువ చదివిందా అంటే, నిస్సందేహంగా బీజేపీని ఒకాకు ఎక్కువ చదివింది. అందుకే, 2023 ఎన్నికలు లక్ష్యగా పావులు కడుపుతున్న కమల దళం రాష్ట్రంపై పట్టు పెంచుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ముఖ్యంగా సెంటిమెంట్’ను అడ్డు పెట్టుకుని ఒకటికి రెండుసార్లు,అధికారంలోకి వచ్చిన తెరాస గద్దె దించేందుకు ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని పాటిస్తోంది. సెంటిమెంట్’ అస్త్రంతో రెండుసార్లు విజయం సాధించిన తెరాస ను అదే సెంటిమెంట్ అస్త్రంతో ఓడించాలని, బీజేపీ అగ్రనాయకత్వం, ముఖ్యంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నిర్ణయానికి వచ్చారు. అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 17న, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా పాల్గొన్నారు.అప్పుడే, తెలంగాణలో 2023లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్ వాగ్దానం చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. ఇప్పుడు తెరాస ప్రభుత్వం విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు చేయలేకపోతోందని ప్రశ్నించారు. అప్పుడిచ్చిన వాగ్దానం ఇప్పుడేమైందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీకి బీజేపీ భయపడదని.. ఒక్కసారి బీజేపీకి అధికారమిస్తే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 2023లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని నమ్ముతున్నామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ గౌరవాన్ని శాశ్వతంగా కాపాడుతామని అమిత్ షా చెప్పారు. అదలా ఉంటే ఇప్పుడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలో అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభత్వం నిర్ణయించింది. ఇది కూడా తెలంగాణసెంటిమెంట్’ ను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో భాగంగానే చూడాలని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్’లో చేసిన వ్యాఖ్యలపై తెరాస రాజకీయ దుమారం సృష్టించిన నేపధ్యంలో బీజేపీ, కౌంటర్ అస్త్రాన్ని సిద్ధం చేస్తోందని అంటున్నారు. ఇందులో భాగంగా 2 జూన్, 2022న సాయంత్రం న్యూఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి అమిత్ షా చైర్మన్‌గా ఉన్న నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఆమోదంతో నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత గాయనీ, గాయకులు మంగ్లీ, హేమచంద్ర తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు ఉధృతమైన వేళ కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహిస్తుండటం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం పై యుద్ధం ప్రకటించి, జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాతీయ పార్టీల కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న సమయంలో, బీజేపీ జాతీయ నాయకత్వం, ముఖ్యమత్రి ముందరి కాళ్ళకు బంధాలు వేసే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంకృతంతో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని అంటున్నారు.
అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జూన్ 2న ఢిల్లీలో అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారత ప్రభుత్వం దేశం ఘనమైన చరిత్ర, సంస్కృతి, సాధించిన విజయాలను వేడుకల రూపంలో ప్రదర్శిస్తోంది.
http://www.teluguone.com/news/content/bjp-sentiment-vepon-on-trs-telangana-formation-day-in-delhi-25-136817.html





