రాజాసింగ్ ...  బీజేపీ అర్ధ‌ర‌హిత రాజ‌కీయ నాట‌కం

Publish Date:Aug 30, 2022

Advertisement

నాట‌కానికి మంచి న‌టులు కావాలి. అప్పుడే ర‌క్తిక‌డుతుంది. కానీ బీజేపీవారి నాట‌కానికి ప్ర‌త్యేకించి న‌టు ల‌ను వెతుక్కోన‌వ‌స‌రం లేదు. తెలంగాణాలో పార్టీ నిండా న‌టులేన‌న్న ఆరోప‌ణ‌లు బాగా విన‌ప‌డుతున్నా యి. బీజేపీ గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీనుంచి స‌స్పెండ్ చేయ‌డం పెద్ద డ్రామా అని తెలం గాణా రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తున్న విశ్లేష‌కులే అంటు న్నారు. తాజాగా మ‌జ్లీస్ అధినేత ఎంపీ అస‌దు ద్దీన్ ఒవైసీ అన్నారు. క‌ర్ణాట‌కాలో గ‌ణేష్ చ‌తుర్ధి సంద‌ ర్భంగా మాంసాహారంపై నిషేధం విధించ‌డ మేమి ట‌ని ఆయ‌న మండిప‌డ్డారు.   

బెంగళూరులో మాంసాహారాన్ని నిషేధించడం ద్వారా బీజేపీ ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని ఓవైసీ  ప్రశ్నించారు. మాంసం అమ్మేవారిలో ఎక్కువ మంది ముస్లిం వర్గానికి చెందిన వాళ్లు ఉన్నారన్న అక్కసుతోనే మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తున్నారని ఒవైసీ అన్నారు.  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అంద‌డంలో రాజాసింగ్‌ను షాహినాయత్‌ గంజ్‌ పోలీసు లు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు సోషల్‌ మీడియాలో రాజా సింగ్‌ పెట్టిన వీడియోపై మజ్లిస్‌ ఆందోళనలు చేపట్టింది. మనోభావాలు దెబ్బతీశారంటూ పలు పోలీసు స్టేషన్ల ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. 

రాష్ట్రంలో రెచ్చగొట్టే  ధోరణితో బీజేపీ బలపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నదని  టీఆర్ ఎస్ నేత‌లు కూడా ఆరో పిస్తున్నారు. రాజాసింగ్‌తో ఆ ప్రకటన చేయించి,  ఆయనపై సస్పెన్షన్ వేటు  డ్రామా న‌డ‌ ప‌డం ఎవ్వ‌రికీ తెలియ‌ద‌నుకోవ‌డమే బీజేపీ అవివేక‌మ‌ని టీఆర్ ఎస్ నేత‌ల మాట‌. తెలంగాణ ప్రజలు వీటిని జాగ్రత్తగా గమనించాలని కోరారు. బీజేపీ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్పించి రాజకీయ ప్రయోజ నాలు పొందాలని చూస్తున్నదన్నారు. టీఆర్ఎస్ క్యాడర్‌ను రెచ్చగొట్టి ప్రతీకార దాడులు జరిపించుకోవాలని తీవ్రప్రయత్నం చేస్తున్నదన్నారు. కానీ, కేసీఆర్‌ది, టీఆర్ఎస్‌ది అలాంటి ఆలోచన లు కావని , టీ ఆర్ఎస్ క్యాడరే తిరగబడితే రాష్ట్రంలో బీజేపీ ఉంటుందా? అని  టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేతలు హెచ్చ‌రి స్తు న్నారు. 

అస‌లు మునావ‌ర్ హైద‌రాబాద్ షో గురించి ఎవ్వ‌రికీ లేని అభ్యంత‌రాలు రాజాసింగ్‌కే రావ‌డంతోనే ఘ‌ర్ష ణ‌కు ప‌రిస్థితులు దారితీశాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మహ్మద్‌ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో  భగ్గుమన్న ఎంఐఎం శ్రేణులు పాతబస్తీలో ఆందోళన చేపట్టాయి. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల ఫిర్యాదుతో యూట్యూబ్‌ రాజాసింగ్‌ వీడియోను తొలగిం చింది.

ఇలాఉండ‌గా,  శాంతియుతంగా ఉండే తెలంగాణలో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆయన పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని హోంమంత్రి మహమూద్‌ అలీ ఆగ‌ష్టు 29న‌ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయ‌న్నారు. అందుకే ప్రముఖ బ‌హుళ‌జాతి కంపెనీలు త‌మ కార్యాల‌యాల‌ను ఇక్క‌డ ఏర్పాటు చేసుకోవ‌డానికి ఆస‌క్తి చూపుతున్నాయ‌న్న‌ది బీజేపీ గుర్తించాల‌ని హోం మంత్రి అన్నారు. 

బండి సంజయ్‌ వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనం. సైబర్‌ నేరాల అదుపులో, నేరాల నమోదు, నేరస్తుల అరెస్టులు, డబ్బుల రికవరీ, శాంతిభద్రతల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.  దేశంలోని మరే ఇతర రాష్ట్రం చేయని విధంగా రాష్ట్ర పోలీసులు ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని మొఘల్‌ సరాయిలో సైబర్‌ నేరస్తుల నుండి రూ.9 కోట్లను రికవరీ చేశారు. కానీ బీజేపీ వారికి ఇవేమీ క‌న‌ప‌డ‌వు, విన‌ప డ‌వు. కేవ‌లం గోల చేసి లేని స‌మ‌స్య‌ల్ని సృష్టించి రాష్ట్రంలో రాజ్యాధికారం చేజిక్కించుకోవాల‌న్న ఆతృ తే బీజేపీ క్యాడ‌ర్ క‌న‌ప‌రుస్తోంది. వారికి అరిచి గోల‌చేయ‌డం మీద‌నే ఎక్కువ ఆస‌క్తి అనే విమ‌ర్శ‌లు రాష్ట్ర మంత‌టా ఉన్నాయన్న‌ది  విమ‌ర్శ‌కుల మాట‌. 

తెలంగాణా బీజేపీ నేత‌ల‌కు కేంద్రంలో ఉన్న‌వారిని ఎలాగ‌యినా ఆక‌ట్టుకోవాల‌న్న ఆతృత‌, కేంద్రంలో ఉన్న బీజేపీ సీనియ‌ర్ల‌కు రాష్ట్రంలో ఉన్న‌వారిని ఉసిగొలిపి మ‌రీ రాష్ట్రంలో గొడ‌వ‌లు, పార్టీల క్యాడ‌ర్  మ‌ధ్య విభేదాలు సృష్టించేందుకు ఉత్సాహ‌ప‌ర‌చ‌డం త‌ప్ప వేరే కార్య‌క్ర‌మం ఏమీ ఉండ‌డం లేద‌న్న‌ది ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. గ‌ట్టిగా ఏ స‌మ‌స్యా లేకున్నా మ‌త‌ప‌ర‌మైన చిన్న అంశం అడ్డుపెట్టుకుని మ‌రీ రెచ్చిపోయి దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం బీజేపీ నేత‌లు బాగా అల‌వ‌ర్చుకున్నారు. అటు ఆంధ్రాలో కూడా తాజాగా గ‌ణేష్ మండ‌పాల విష‌యంలో లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. విగ్ర‌హాలు, మండ‌పాల విష‌యంలో అక్క‌డి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సంబంధిత యాజ‌మాన్యాల‌కు త‌గిన సూచ‌న‌లు చేసింది. అయినా వాటికి సంబంధించి స్వ‌యంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేయాల‌న్న ప‌ట్టుద‌ల అర్ధంలేని ద‌ని వైసీపీ, కాంగ్రెస్ కూడా మండిప‌డుతున్నాయి. 

By
en-us Political News

  
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.