నడ్డా సారధ్యంలో సెమీస్ కు రె‘ఢీ’!

Publish Date:Jan 18, 2023

Advertisement

నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ  హోం మంత్రి అమిత్ షా జోడీ పార్టీ ప్రధాన జోడీగా  పగ్గాలు చేపట్టిన తర్వాత  బీజేపీ రాజకీయాలు పూర్తిగా ఎన్నికల చుట్టూనే తిరుగు తున్నాయి. సమయం సందర్భం ఏదైనా క్రింది స్థాయి సామాన్య కార్యకర్త నుంచి పార్టీ అగ్ర నేతల వరకు ప్రతి ఒక్కరూ ఎన్నికల ఆలోచనలే చేస్తారనేది  అందరికీ తెలిసిన  అందరూ అంగీకరించే వాస్తవం. నిజమే  ఏ రాజకీయ పార్టీకి అయినా అంతిమ లక్ష్యం అధికారం. అందుకోసమే రాజకీయ పార్టీలు ప్రతి అడుగులోనూ ఓట్లు సీట్లు లెక్కలు వేసుకుంటూ ముందుకు  సాగుతుంటాయి.  భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తమది ఎన్నికల యాత్ర కాదని ప్రకటించినా, అల్టిమేట్ గా  ఆయన ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే  అధికారమే శరణ్యమవుతుంది. బీజేపీ విషయంలోనూ అదే జరిగింది.

సరే అది అలా ఉంచితే, దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇతర ముఖ్య అంశాలు  దేశం ఎదుర్కుంటున కీలక సమస్యల గురించి ఏ మేరకు చర్చించారో ఏమో కానీ  ప్రధాని నరేంద్ర మోడీ  రెండవ సారి పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన (?) జేపీ నడ్డా ప్రసంగాలు మాత్రం  తెలంగాణ సహా ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే తొమ్మది రాష్ట్రాల రాజకీయాల చుట్టూనే తిరిగాయి.  

ముఖ్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక ముగింపు ప్రసంగం చేసిన ప్రధాని మోడీ  ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు కీలకంగా వ్యవహరించాలని  సూచించారు. అంతే కాదు వచ్చే 400 రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై రోడ్డు మ్యాప్ ను నేతల  ముందుంచారు. మరీ ముఖ్యంగా, అన్ని వర్గాలను అక్కున చేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల యువతపై బీజేపీ నేతలు దృష్టిసారించాలని, అందులో విధ్యవంతులైన ముస్లిం యువత కూడా ఉండాలని ప్రధాని మోడీ బీజేపీ నేతలకు సూచించారు.

మరో వంక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  ఉపోద్ఘాతాలు, ఉత్ప్రేక్షలు లేకుండా నేరుగా ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి గెలవాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే 9 రాష్ట్రాలకు గానూ తొమ్మిది రాష్ట్రాల్లోనూ బీజేపీ జయకేతనం ఎగరవేయాల్సిందేనని జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఇందులో మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్ దృష్ట్యా బీజేపీ ప్రస్థానంలో 2023 చాలా ముఖ్యమైన సంవత్సరమని చెప్పిన నడ్డా, ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లో పోరాడి గెలవాలి, ఆపై 2024లో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని స్పష్టం చేశారు. 
అయితే అది అనుకున్నంత మాత్రాన అయ్యే పనేనా అంటే అది వేరే విషయం. వేరే చర్చ. కానీ  జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి బీజేపీ పార్టీ క్యాడర్కు సప్ష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. దిశా నిర్దేశం చేసింది. అసెంబ్లీ ఎన్నికల గుండా 2024 సార్వత్రిక ఎన్నికల ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. 

కాగా ఈ సంవత్సరం ఎన్నికలు జరిగే తొమ్మిది రాష్ట్రాలలో తెలంగాణతో పాటు కర్నాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర,మేఘాలయా,నాగాలాండ్,మిజోరాం రాష్ట్రాలున్నాయి. ఫిబ్రవరి మార్చిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత మేలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబరులో మిజోరం ఎన్నికలు జరగనున్నాయి.  అనంతరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తారు.  2024 మేలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో.. ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు.

By
en-us Political News

  
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ 62 పిటిషన్లు వేసింది.!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది.
దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో వైఎస్సార్‌సీపీకి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
ప్రేమలో పడితే చాలా మంది పిచ్చి పనుల చేస్తుంటారు. నా కోసం ఏం చేస్తావని ప్రియురాలు అడిగితే.. ప్రాణమైనా ఇస్తానని లేదా ఆకాశంలోని చుక్కలైనా తెచ్చిస్తానని సినిమా డైలాగులు చెబుతుంటారు.
చిన్న రీఫండ్ కోసం ప్రయత్నించింది.. చివరకు భారీ మొత్తాన్ని పోగొట్టుకుంది.!
ఫ్రీ బస్సులో భార్య.. నవ్వులు పూయిస్తున్న భర్త ఆవేదన. !
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.