పేరుకు బీసీ జపం.. పదవుల వేటే అసలు మంత్రం!

Publish Date:Dec 3, 2024

Advertisement

భక్తి దేవుడిపై కాదు.. ప్రసాదం మీద అన్నట్లుగా ఆర్. కృష్ణయ్య తీరు ఉంటుంది. బీసీలకు తానే నాయకుడినని చెప్పుకుంటూ  ఆ పేరుతో అధికారంలో ఉన్న పార్టీల పంచన చేరి బడా పదవులు కట్టేస్తుంటారు. స్వల్ప వ్యవధిలోనే దాదాపు అన్ని పార్టీలనూ చుట్టేశారు.  ఏ పార్టీలోకి వెళ్లినా బ‌డా ప‌ద‌వులు ద‌క్కించుకోవ‌టం ఆయ‌నకు వెన్న‌తో పెట్టిన విద్య. పార్టీల అధిష్టానాలు సైతం ఆయ‌నకు ప‌ద‌వి ఇస్తే బీసీల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లేన‌ని భావిస్తాయి. కానీ, ఆయ‌న ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మెజార్టీ బీసీలు దూర‌మైన‌ట్లే. ఈ విష‌యం అనేక‌ సార్లు రుజువైంది. కానీ, ఆయ‌న మాత్రం బీసీలంతా తన వెంటే.. తన వైపే అంటూ ఇప్ప‌టికీ రాజకీయ పార్టీలను నమ్మించి పెద్ద పెద్ద పదవులను తన ఖాతాలో వేయించేసుకుంటారు.  తాజాగా మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు ఆయ‌న‌ సిద్ధ‌మ‌వుతున్నారు.. ఈ సారి మ‌రో కొత్త‌ పార్టీ నుంచి. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌ర‌ని తెగ ఆలోచిస్తున్నారా.. అంత అవ‌స‌రం లేదు.. తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న పేరు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మే. ఆయ‌నే రాజ్య‌స‌భ స‌భ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ . కృష్ణ‌య్య. మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగిన కృష్ణ‌య్య‌.  ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ప్ర‌స్తుతం బీజేపీ కండువా క‌ప్పుకొని ఆ పార్టీ నుంచి మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు రెడీ అయిపోయారు. అయితే బీసీ నాయ‌కుడి హోదాలో ఆర్‌. కృష్ణ‌య్య బ‌డా ప‌దవులు ద‌క్కించుకుంటున్న‌ప్ప‌టికీ.. బీసీ వ‌ర్గాల‌కు, ఆయ‌న‌కు ప‌ద‌వి ఇచ్చి గౌర‌వించిన పార్టీల‌కు ఇసుమంతైనా మేలు చేకూర్చ‌లేక పోతున్నారు సరికదా, పదవులిచ్చిన పార్టీలకు ఆయన వల్ల తేరుకోలేని నష్టం వాటిల్లుతోంది. ఆర్.కృష్ణయ్యకు పెద్ద పీట వేసిన వెంటనే ఆయా పార్టీలకు బీసీలు దూరం అవుతున్నారు. పాలిటిక్స్ లో ఇదో సెంటిమెంటుగా ధృవపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆర్.కృష్ణయ్య ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి  మెజార్టీ బీసీలు హ్యాడిచ్చేస్తారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.

ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు మంగళవారం (డిసెంబర్ 3(నోటిఫికేషన్‌ విడుదలైంది. 10వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది. వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీల రాజీనామాలతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాజీనామా చేసిన ముగ్గురు ఎంపీల్లో మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావు తెలుగుదేశంలో చేరారు.  ఆర్‌.కృష్ణయ్య మాత్రం తాను ఏ పార్టీలోనూ చేరను, సొంత పార్టీ పెడతా అంటూ బీరాలు పలికినా.. బీజేపీ పెద్దలతో మాత్రం టచ్‌లో ఉన్నారు.  ఆర్.కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడిగా ఉండగానే రాజీనామా చేశారు. అదీ ఎన్నికలలో తాను ఏ పార్టీ తరఫునైతే ప్రాతినిథ్యం వహిస్తున్నారో ఆ వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తరువాత రాజీనామా చేశారు. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బీజేపీ ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టిన బీసీ నేత‌గా పేరున్న ఆర్‌. కృష్ణ‌య్య బీజేపీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఎందుకంటే ఆ పార్టీ నుంచి మ‌రోసారి ఆయ‌న‌ రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు రూట్ క్లియర్ అయ్యింది కాబట్టి. ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ్లే వారిలో ఇద్ద‌రు తెలుగుదేశం నుంచి నుంచి కాగా.. మ‌రొక‌రు కూటమి కోటాలో బీజేపీ నుంచి వెళ్ల‌నున్నారు. బీజేపీ నుంచి వెళ్లే రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఆర్‌. కృష్ణ‌య్య పేరు   ఖాయ‌మైందని తెలుస్తోంది. ఆర్ కృష్ణ‌య్య‌కు పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు పంపించ‌డం ద్వారా తెలంగాణ‌లోని బీసీలంతా బీజేపీవైపు వ‌స్తార‌ని కమలనాథుల అంచ‌నా వేస్తున్నారు. అయితే, గ‌తంలో ఆర్ కృష్ణ‌య్య‌కు పెద్ద‌పీట వేసిన పార్టీలు కూడా ఇలానే ఆలోచించి చేతులు కాల్చుకున్నాయి.  ప్ర‌స్తుతం బీజేపీ ఆ జాబితాలో చేరేందుకు సిద్ధ‌మైంది.

2014 లో రాష్ట్ర విభ‌జ‌నకు ముందు వ‌ర‌కూ ఆర్‌.కృష్ణ‌య్య బీసీ సంఘం నేత‌గా కొన‌సాగారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత అనూహ్యంగా తెలంగాణ తెలుగుదేశంలో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో ఎల్బీన‌గ‌ర్ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు.  2018లో తెలంగాణ‌లో జరిగిన ముందస్తు ఎన్నికల స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కృష్ణయ్య  కాంగ్రెస్ గూటికి చేరారు.  ఆ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా మిర్యాలగూడ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ త‌రువాత కొద్ది కాలానికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2 019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న జ‌గ‌న్ తో స‌న్నిహిత సంబంధాలు ఏర్ప‌ర్చుకున్నారు. వైసీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. వైసీపీ అధికారానికి దూరం కాగానే ఆ పార్టీకి, ప‌ద‌వికి ఆర్‌. కృష్ణ‌య్య రాజీనామా చేశారు.  ప్ర‌స్తుతం బీజేపీలో చేరి మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక్క‌డ విశేషం ఏమిటంటే.. ఆర్. కృష్ణ‌య్య ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాద‌న్న వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తుంటుంది. దీనికి కార‌ణం లేక‌పోయ‌లేదు. ఆయా పార్టీలు ఆర్‌. కృష్ణ‌య్య మ‌న‌ పార్టీలో ఉంటే బీసీలంతా మ‌న‌వైపు ఉంటార‌న్న భ్ర‌మ‌ల్లో ఉంటారు. కానీ, ఫ‌లితం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటూ వస్తోంది.  ఊసరవిల్లి రంగులు మార్చడం కంటే వేగంగా  కృష్ణయ్య పార్టీలు మార్చేస్తుండటం కూడా సహజంగానే బీసీలలో ఆయన పట్ల విశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నది. అందుకే ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీకీ బీసీలు దూరం అవుతున్నారన్న వాదన కూడా ఉంది. 

ఆ వాదన ప్రకారం వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పాగావేయాల‌ని భావిస్తున్న‌ బీజేపీకి.. ఆర్ కృష్ణ‌య్య చేరిక ఎదురుదెబ్బే అవుతుంద‌న్న భావన రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఆర్. కృష్ణ‌య్య బీజేపీలో చేర‌డాన్ని ఆ పార్టీలోని ప‌లువురు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఒక‌వేళ‌ పార్టీ కండువా క‌ప్పినా కీల‌క ప‌ద‌వులు అప్ప‌గించొద్ద‌ని ప‌లువురు బీజేపీ నేత‌లు ఇప్ప‌టికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. అయితే, బీజేపీ అధిష్టానం మాత్రం ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ఇచ్చి గౌర‌వించేందుకు సిద్ధ‌మైపోయింది. అయితే, ఆర్‌. కృష్ణ‌య్య ఈసారైనా రాజ్య‌స‌భ హోదాలో బీసీ వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంతోపాటు.. బీజేపీ అధికారంలోకి వ‌చ్చేలా ఏమేర‌కు కృషి చేస్తారో వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఐదుగురు ఐపీఎస్ లను బదిలీ చేసింది. చింతపల్లి ఏఎస్పీగా నవజ్యోతి మిశ్రాతో పాటు నంద్యాల ఏఎస్పీగా మందా జావళి అల్ఫోన్, రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామ్‌నాథ్‌ హెగ్డే, కాకినాడ ఏఎస్పీగా దేవరాజ్ మనీష్, తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరిని బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుమ‌ల‌లో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తిరుమ‌ల‌కు వ‌స్తుంటారు. ప్ర‌తీ రోజూ దాదాపు అర‌వై వేల‌కుపైగా భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. తిరుమల నిత్యం స్వామినామ‌స్మ‌ర‌ణంతో మారుమోగిపోతుంది. అలాంటి తిరుమ‌ల‌లో గ‌డిచిన ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో ఎన్నో అప‌చారాలు జ‌రిగాయి.
 రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. హైద్రాబాద్ పరేడ్  గ్రౌండ్ లో  7 వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్  సోమవారం సాయంత్రం ప్రారంభమైంది.
తిరుమల ఘట్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్లిన ఆరుగురు భక్తులు మృత్యువాత ఘటన మరువక ముందే సోమవారం(జనవరి 13) ఉదయం కొండపై శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇచ్చే కౌంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
వికారాబాదు జిల్లా పూడూరు  మండలం శంకర్ పల్లి గ్రామంలో చెల్లా చెదురుగా పడి ఉన్న దాదాపు 55 చారిత్రాత్మక శిల్పాలు ఆలనా లేక  రక్షణ కోసం ఎదురు చూస్తున్నాయని పురావస్తు పరిశోధకుడు,  ప్లీచ్ ఇండియా పరిశోధకుడు డా ఈమని శివనాగిరెడ్డి  చెప్పారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిల్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  పరిస్థితి  రోజు రోజుకు దిగజారుతోంది.  ఆయన పరిస్థితి ఇపుడు కొరివితో తలగోక్కున్నట్టు  తయారయ్యింది. తన పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ కౌశిక్ రెడ్డి దూకుడు తగ్గించుకోకపోవడంతో కొత్త చిక్కులు తెచ్చుకుంటున్నారు. 
ఢిల్లీ లో అధికారంలో ఉన్న ఆప్ కు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల వేళ కాగ్ నివేదిక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కాగ్ నివేదిక మరో సారి ఢిల్లీ మద్యం విధానంలో ఆప్ అవకతవకలపై చర్చను తెరపైకి తీసుకువచ్చింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎంఎల్సీ జీవన్ రెడ్డికి పార్టీ హ్యాండిచ్చినట్లే కనిపిస్తోంది. నిజామాబాద్ గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డికి మరోసారి ఆ చాన్స్ ఇచ్చే విషయంలో అధిష్ఠానం సుముఖంగా లేదని అంటున్నారు.
దాదాపు ఏడాది కాలంగా రేవంత్ తన కేబినెట్ ను ఎప్పుడు విస్తరిస్తారా అన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇదిగో అదిగో అంటూ పలు ముహూర్తాలు కూడా తెరమీదకు వచ్చాయి. కేబినెట్ విస్తరణే లక్ష్యంగా రేవంత్ పలుమార్లు హస్తిన వెళ్లి పార్టీ హైకమాండ్ తో భేటీ అయ్యారు కూడా.
కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయా? ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ల మధ్య పరిస్థితి ఉప్పూ నిప్పులా తయారైందా? పైకి సయోధ్యగా ఉన్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా వారి మధ్య విభేదాలు పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.
జగన్ ఐదేళ్ల అరాచకపాలనను జనం అసహ్యించుకున్నారు. ఆయన కేబినెట్ లోని కొందరు మంత్రుల తీరును, వారి అసహ్యకరమైన భాషను భరించలేకపోయారు. అందుకే ఎన్నికలలో ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఘోరాతి ఘోరంగా ఓడించి బుద్ధి చెప్పారు. తెలుగుదేశం కూటమికి చారిత్రాత్మక విజయం కట్టబెట్టారు.
తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వైకుంఠ ద్వాదశి నాటు అంటే శనివారం (జనవరి 11) శ్రీవారిని మొత్తం 53 వేల 13 మంది దర్శించుకున్నారు.
హైదరాబాద్ శివారు శామీర్ పేట మండలం, మందాయిపల్లి శివాలయం దగ్గర రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడి ఉన్న గణేష్ శిల్పం బాదామి చాళుక్యుల కాలం నాటిదని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.