ఒడిశా, ఏపీ సరిహద్దు వివాదం బీజేపీ రాజకీయమేనా?

Publish Date:Apr 6, 2023

Advertisement

ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య సరికొద్ద సరిహద్దు వివాదం మొలకెత్తింది. అయితే ఈ వివాదానికి కేంద్రం రాజకీయమే కారణమన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ చేసిన ఒక ప్రకటన ఈ వివాదానికి కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల మధ్య  కోరాపుట్‌ జిల్లాలో ఉన్న కోటియా అనే ప్రాంతంనుంచి  ఏపీ పోలీసులు వైదొలగాలంటూ చేసిన ప్రకటన ఈ సరికొత్త సరిమద్దు వివాదానికి కారణమైంది.   కోటియా   ప్రాంతంలోని 21 గ్రామాల నుంచి ఏపీ పోలీసులు వెనక్కు వెళ్లాలని ప్రధాన్ ఒడిశా అవతరణ దినోత్సవం వేదికగా ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ ప్రకటనే సరికొత్త వివాదానికి కారణమైంది.  వాస్తవానికి సరిహద్దు వివాదం సుప్రీం కోర్టులో ఉండగా  సరిగ్గా ఒడిశా అవతరణ దినోత్సవం నాడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వివాదాస్పద ప్రకటన చేశారు.

ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సహజంగానే  ప్రదాన్ ప్రకటనను బీజేపీ ఒడిశా శాఖ సమర్ధించింది. అదే సమయంలో ప్రధాన్ వ్యాఖ్యలను అధికార బీజు జనతాదళ్ ఖండించింది.  దీంతో బిజూ జనతాదళ్‌, బీజేపీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది.  బిజూ జనతా దళ్‌ నాయకురాలు, రాష్ట్ర రెవెన్యూ  మంత్రి ప్రమీలా మల్లిక్‌ ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలంటూ ఎన్‌.డి.ఏ ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.

 ఇది సుప్రీం కోర్టు విచారణలో ఉండగా కేంద్ర మంత్రి దీని గురించి వ్యాఖ్యానించవచ్చా, ఈ విధంగా వ్యాఖ్యానించడం కోర్టు ధిక్కరణ కిందకు రాదా అన్న చర్చ మొదలైంది. రెండు రాష్ట్రాలు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటూ కొద్ది కాలం కిందట కేంద్ర మంత్రి ధర్మేంద్ర పధాన్ స్వయంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ లేఖ రాశారు. ఇంతలోనే ఈ విషయంలో ఆయన వివాదాస్పద ప్రకటన చేయడం రాజకీయ లబ్ధి కోసమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో   బీజేడీని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా ఆయనీ వ్యాఖ్యలు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కోరాపుట్‌ జిల్లా గత ఇరవై ఏళ్లుగా బీజేడీ ఓటు బ్యాంకుగా, పటిష్ఠమైన కంచుకోటగా ఉంది. ఇప్పుడు ఈ జిల్లాపై   బీజేపీ కన్ను వేసింది. దేశవ్యాప్తంగా ఆదివాసీ లేక గిరిజన ప్రాంతాలను చేజిక్కించుకోవడంలో భాగంగా కేంద్రంలోని పాలక బీజేపీ ప్రభుత్వం ఒడిశాలో కూడా ఆదివాసీల అభివృద్ధికి, సంక్షేమానికి అనేక పథకాలను, కార్యక్రమాలను చేపట్టినప్పటికీ,  ఒడిశా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పోటీగా స్వయంగా కొన్ని పథకాలను ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తోంది. దీంతో నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వాన్ని   ఇరకాటంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధాన్‌ సరిహద్దు ఉరుములేని పిడుగులా సరిహద్దు వివాదానికి తెరతీశారని అంటున్నారు.  

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.