అనుకున్నదొకటి.. అయినది మరొకటి

Publish Date:Apr 5, 2023

Advertisement

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అంతకు ముందు కేంద్ర మంత్రి, బీజేపే ఏపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్ తోనూ సమావేశమయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా, ప్రధాని మోదీతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశమవుతారని వార్తలు వచ్చినా, ఆయన రెండు రోజులు ఢిల్లీలో ఉన్నా, అలాంటిదేమీ జరగ లేదు. మురళీధరన్, నడ్డాతో సమావేశమై పవన్ కళ్యాణ్ రిటర్న్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ చేరుకున్నారు. 
ఒక విధగా చూస్తే ఈ సమావేశానికి బీజేపీ నాయకత్వం పెద్దగా ఆసక్తి చూపినట్లు లేదు. ఓ మొక్కుబడి తంతుగానే ముచ్చట్లు ముగిశాయి.

రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఎలాగైతే జన సేనతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తారో అదే విధంగా ఢిల్లీ నేతలు వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు తనను పట్టించుకోక పోయినా, ఢిల్లీ నాయకులు తనకు సముచిత గౌరవం ఇస్తారనే భ్రమల్లో ఉన్నపవన్ కళ్యాణ్ కు ఈ పర్యటనలో బీజేపే తత్త్వం బోధ పడేలా వారు ట్రీట్ చేశారని, చూసినవారికి అర్థమైంది. పిలవని పేరంటానికి వచ్చిన పెద్ద ముత్తయిదువును ట్రీట్ చేసిన విధంగానే, ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ తో వ్యవహరించారని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. 

అదలా ఉంటే  నడ్డాతో  సమావేశం అనతరం పవన్ కళ్యాణ్  స్వయంగా పలికిన పలుకులలోని అస్పష్టతను గమనిస్తే  ఆయన ఢిల్లీ వచ్చిన కార్యం నెరవేరలేదని స్పష్టమైందని  అంటున్నారు. అలాగే  మీడియాతో మాట్లాడే సమయంలో పవన్ కళ్యాణ్, ఆయన పక్కన నిలుచున్న నాదెండ్ల మనోహర్ బాడీ లాంగ్వేజ్  గమనిస్తే  పవన్ కళ్యాణ్ నటించిఃన జల్సా సినిమాలోని  కామెడీ సీన్  గుర్తుకొస్తోందని అంటున్నారు. 

నిజానికి  పవన్ ఢిల్లీ యాత్రపై జనసేన వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజలలో కూడా చాలానే అంచనాలున్నాయి. ముఖ్యంగా సంవత్సర కాలానికి పైగా ఎటూ తేలకుండా గాలిలో తేలుతున్న ఎన్నికల పొత్తులపై స్పష్టత వస్తుందని ఆశించారు.ఈ నేపధ్యంలోనే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు  రానున్న ఎన్నికల్లో  పొత్తులపై  అనుసరించాల్సిన వ్యూహంపై  బీజేపీ అగ్రనేతలతో  చర్చించేందుకే  పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినట్టుగా  ప్రచారం జరిగింది. నిజంగా కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశం అదే కావచ్చు. కానీ  బీజేపీ పెద్దల ఆలోచన మరో విధంగా వుందో ఏమో కానీ పొత్తుల విషయం పక్కన పెట్టి కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం గురించి మాట్లాడి పంపించారు. అంటే బీజేపీ ఏపీ రాజకీయాలపై కనీసం ప్రస్తుతానికి ఎలాంటి  నిర్ణయం తీసుకునేందుకు సిద్దంగా లేదనే విషయం స్పష్టమైందని అంటున్నారు. 

ఇతర విషయాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ కు రెండు విషయాల్లో క్లారిటీ వుంది. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమొందించవలసిన చారిత్రక అవశరాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించారు. అలాగే  వైసేపీ అరాచక పాలన అంతమొందించేందుకు  ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే విషయంలోను పవన్ కళ్యాణ్ కు ఫుల్ క్లారిటీ వుంది. కమిట్మెంట్  వుంది. అందుకే  2014 పొత్తులను పునరుద్ధరించి  వైసీపీ అరాచక పాలన అంతమొందించాలనే  ఆలోచనతో బీజేపీతో పొత్తును కొనసాగిస్తున్నారు.

అయితే, బీజేపీ లెక్కలు వేరుగా ఉన్నట్లున్నాయి .. అందుకే,  పొత్తుల విషయం పక్కన పెట్టి కాలయాపన చేస్తోందని అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా బీజేపీ ఉచ్చులోంచి బయటకు రావాలని పరిశీలకులు అంటున్నారు. ఇంకా జాప్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు.

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.