వ‌చ్చారు.. త‌ప్పులో కాలేసారు!

Publish Date:Jul 4, 2022

Advertisement

అంతా త‌ర‌లివ‌చ్చారు. యుద్ధానికి సిద్ధ‌ప‌డేందుకు శిబిరాల్లో సేద‌దీరారు. ఆన‌క విప‌క్షాల‌వారిని, కొలువు దీరిన ప్రాంతీయుల‌ను త‌మ ఆధిప‌త్య స‌త్తాను త్వ‌ర‌లో మ‌రింత చ‌విచూపిస్తామ‌ని చిన్న‌పాటి హెచ్చ‌రి క‌లు చేసి వెళ్లారు. ఇంతే జ‌రిగింది బిజెపి కార్య‌వ‌ర్గ స‌మావేశం హ‌డావుడి మొత్తం. 

తెలంగాణాలో పాగా వేయ‌డానికి అనేక మార్గాలు, ఆలోచ‌న‌లు చేసిన బిజెపి కేంద్ర నాయ‌కులు తెలంగాణా రాజ‌ధాని హైద‌రాబాద్‌లోనే త‌మ పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు నిర్వ‌హించి ఇక్క‌డే అస‌లు సంగ‌తి తేల్చుకుందామ‌ని భావించారు. ప్ర‌చారం నుంచి స‌మావేశం జ‌రిగినంత వ‌ర‌కూ బిజెపి వ‌ర్గీయులు నానా హ‌డావుడీ చేసేరు. ప్ర‌ధాని మోదీ, పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు అమిత్ షా త‌దిత‌రులు, బిజెపి పాలిత రాష్ట్రా ల ముఖ్య‌మంత్రుల‌తో స‌హా హైద‌రాబాద్‌లో మ‌కాం వేసి ఇక్క‌డి టిఆర్ ఎస్ శ్రేణుల‌కు వెన్నులో వొణుకు పుట్టేలా చేద్దామ‌నుకున్నారు. అయితే టిఆర్ ఎస్ ప్ర‌చారంలోనే ఎదురుదాడికి దిగి వారిని ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న పెద్ద సంకేత‌మే ఇచ్చింది. 

బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ సైతం తెలంగాణాకు ఎంతో చేశామ‌ని, ఎంతో ఇచ్చా మ‌ని గొంతు చించుకున్నారు. కానీ అవ‌న్నీ అవాస్త‌వాలేన‌న్న‌ది వారికి తెలిసేలా టిఆర్ ఎస్ నాయ‌కులు టీ వీ చర్చ‌ల్లో ఘాటుగా విమ‌ర్శించారు. ప్ర‌ధాని మాట్లాడుతున్నంతసేపూ, ఈయన ప్ర‌ధానేనా, ఇంత అబద్ధా ల కోరేమిటా అని నోరెళ్ల‌బ‌డుతున్నారు. తెలంగాణాలో టిఆర్ ఎస్ చెప్పుకుంటూన్న అభివృద్ధి  అంతా త‌మ ఆర్ధిక మ‌ద్ద‌తుతోనే సాధ్య‌ప‌డింద‌ని అది టిఆర్ ఎస్ నేత‌ల‌కు చెప్పుకోవ‌డానికి ఇబ్బందిగా  మారిం ద‌నే విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము న‌గరాభివృద్ధికి, ముఖ్యంగా రోడ్లు, ఫ్లైఓవ‌ర్ల నిర్మాణానికి వేల కోట్లు ఇచ్చామ‌ని మైకులు బ‌ద్ద‌ల‌య్యేలా అరిచి మ‌రీ చెప్పారు. 

కానీ ప్ర‌ధాని చెప్పినంత మాత్రాన  అది నిజ‌మై పోతుందా అన్న ప్ర‌శ్న టిఆర్ ఎస్ శ్రేణులు సంధిస్తున్నారు.  ప్ర‌ధాని మోదీ, కేంద్ర నాయ‌కులు ఎవ‌ర‌యి నా స‌రే తెలంగాణా గురించి చెప్పిన‌వ‌న్నీ అవాస్త‌వాలేన‌ని  తెలంగాణా ప్ర‌భుత్వం మండిప‌డుతోంది. 

ఎవ‌రు ఎవ‌రిని ప్ర‌శ్నిస్తున్నారు, ఎవ‌ర్ని హెచ్చ‌రిస్తున్నార‌న్న‌ది ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. తెలంగాణావా దులు కేంద్రం నిస్సిగ్గుగా అబ‌ద్ధాలాడ‌టం ప‌ట్ల ఆశ్చ‌ర్య‌ప‌డుతోంది. ఏ ప్రాజెక్టుకీ, రోడ్డు ప‌నుల‌కీ కేంద్రం వీస‌మెత్త సాయం చేయ‌లేదు, ఇవ్వాల్సిన‌వాటి సంగ‌తి దేవుడెరుగు అంటున్నారు. కేవ‌లం పెద్ద నోరు వేసుకుని అమాంతం ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో మైకుల్లో మాట్లాడ‌గానే అన్నీ అంద‌రూ న‌మ్మ‌రు.  ప్ర‌ధాని స్థాయి మ‌నిషి మ‌రీ ఇంత అనాలోచితంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఏ పాటి న్యాయ‌మ‌న్న‌ది టి ఆర్ ఎస్ వ‌ర్గీయుల ప్ర‌శ్న‌. వాస్త‌వానికి తెలంగాణాకు సంబంధించి రావాల్సిన ఆర్దిక మ‌ద్ద‌తు గురించి అడిగినవి  నిర్ల‌క్ష్యం చేసి త‌మ‌కు తోచిన అంకెల‌తో తోచిన విధంగా ప్ర‌చారం చేసుకోవ‌డంలో బిజెపివారీ మాన‌సిక బ‌ల‌హీన‌తే బ‌య‌ట‌ప‌డుతోంది. 

మొత్తానికి బిజెపి యావ‌త్ సైన్యం వ‌చ్చి చేసిన త‌ప్పుడు ప్ర‌చారాలు, ఊక‌దంపు ప్ర‌సంగాల వ‌ల్ల తెలంగా ణాకు, టిఆర్ ఎస్‌కు వ‌చ్చే న‌ష్టం శూన్యం.  ప్ర‌తిగా బిజెపీ వ‌ర్గాలే న‌ష్ట‌పోయే అవ‌కాశాలున్నాయి. తెలం గాణా ఏర్పాట‌యిన‌ప్ప‌టి నుంచి కేంద్రం పెద్ద‌గా స‌హ‌క‌రించిందేమీ లేద‌ని, ఇపుడు మ‌రింత రాజ‌కీయ వైఫల్యాన్ని బిజెపీ స్వ‌యంగా ఇంత దూరం వ‌చ్చి తెలంగాణాలో బ‌య‌ట‌ప‌డ‌టం ప‌ట్ల అంతా న‌వ్వుకుం టున్నారు. తెలంగాణాకు చెంద కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ త‌దిత‌ర బిజెపీ హేమాహేమీలు  మోదీని, అమిత్ షాను, ఇత‌ర కాషాయ హేమాహేమీల‌తో  వ‌చ్చి రెండు రోజ‌ల్లో ప్ర‌జ‌ల్ని ముఖ్యంగా ఓట‌ర్లను త‌మ జండా నీడ‌లోకీ తెచ్చేసుకోవాల‌న్న ఆతృత విజ‌య‌వంతం అయితే కాలేదు. ఢిల్లీలో పెట్టుకుని త‌మ పార్టీ వారు భ‌విష్య‌త్ కార్య‌క్ర‌మాలు నిర్ణ‌యించుకుంటే అయిపోయేదానికి ఇక్క‌డికి వ‌చ్చి ఇక్కడ శిబిరాలు వేసు కుని, ఇక్క‌డ తిండి తిన‌గానే తెలంగాణా వాదులు అయిపోతారా ?  ఇలాంటి ట్రిక్కులు, జిమ్మిక్కులు  తెలంగాణా ప్ర‌జ‌లు అంత‌గా ప‌ట్టించుకోరు. బిజెపీ ఆట‌పాట‌లు, హ‌డావుడీ అంతా బీహార్‌, పంజాబ్‌, రాజ స్థాన్ ల‌లో చెల్లుతుందేమోగాని తెలంగాణా వాదులను క‌దిలించ‌లేదు. 

బిజెపి పాలిత రాష్ట్రాల‌తో పోలుస్తూ తెలంగాణా కూడా త‌మ నీడ‌లోకి తెచ్చేసుకోవ‌డానికి ఇంక ఆట్టే కాలం ప‌ట్ట‌దు, రెడీగా వుండ‌డ‌ని ఎవ‌రికి హెచ్చ‌రిక‌లు జారీచేస్తున్నారు?  తెలంగాణా పోరు, రాష్ట్రావ‌త‌ర‌ణ వెనుక అనేక శ‌తాబ్దాల వెత‌లు వున్నాయి. ఈ ప్ర‌జ‌లు ఇత‌ర రాష్ట్రాల్లో వ‌లె అంత త్వ‌ర‌గా కాషాయం వారి జాతీయ భావ‌న, అతి దేశ భ‌క్తి  ఓవ‌రాక్ష‌న్‌ల‌కు ప‌డ‌రు. టిఆర్ ఎస్ ప్ర‌స్తుతం బిజెపి దృష్టిలో త‌క్కువ స్థాయిలో క‌న ప‌డుతోందేమోగాని టిఆర్ ఎస్‌కి రాష్ట్రంలో ప్ర‌జ‌ల్లో ఏమాత్రం గౌర‌వం, న‌మ్మ‌కం స‌డ‌ల‌లేదు.  క‌ట్ట‌గ‌ట్టుకుని వ‌చ్చాం, భ‌య‌పెట్టి పోయామ‌ని బిజెపి వ‌ర్గాలు అనుకుంటే త‌ప్ప‌కుండా త‌ప్పులో కాలేసిన‌ట్టే!

By
en-us Political News

  
మ‌ళ్లీ  రిజ‌ర్వు బ్యాంక్ నుంచి మ‌రో వెయ్యికోట్లు రుణ స‌మీక‌ర‌ణ చేశారు. ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. దీనిప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. 
ఒక పోలీసాయ‌న‌.. రాత్రి కాస్తంత పొద్దు బోయాక ఇల్లు చేరాడు. టోపీ తీసి టేబుల్ మీద ప‌డేసి అలానే మంచం మీద ప‌డుకున్నాడు. చాలాసేప‌టికి ఇంట్లో వారు లేపితే కాస్తంత తిని ప‌డుకు న్నాడు. అంత‌లో పేద్ధ శ‌బ్దం. బ‌య‌ట‌పెట్టిన టూవీల‌ర్ పేలిపోయింది. ప‌రుగున పోలీసాయ‌న బ‌య‌టికి వ‌చ్చేడు. బండి కాలి బొగ్గ‌యింది. త‌న‌కు తెలిసిన వెధ‌వ‌ల్ని త‌ల‌చుకున్నాడాయ‌న‌. . ఇది చాలా స‌హ‌జంగా మ‌నం చూసే సిని మాలో సీన్‌. స‌రే ఆన‌క ఆయ‌నే బెల్టు స‌ర్దుకుని వెంటాడి వాడేవ‌డినో ప‌ట్టేసుకుంటాడు. కానీ ఈమ‌ధ్య అమృత్‌స‌ర్‌లో దాదాపు ఇదే సీన్ కానీ ఇంతగా ఏమీ జ‌ర‌గ‌లేదు. కార‌ణం ఓ కుక్క‌!
చాలాకాలం క్రితం ఏకంగా పోలీసులు మీద‌నే కాల్పులు జ‌రిపి పారిపోయాడీ ఘ‌నుడు. అలా వెళ్లిన‌వాడు నిన్న‌నే భార‌త్-నేపాల్ స‌రిహ‌ద్దు వ‌ద్ద ప‌ట్టుబ‌డ్డాడు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుతో బేటీ కానున్నారు. మునుగోడులో ఈ నెల 21న జరగనున్న సభకు అమిత్ షా హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగానే సభకు ముందు లేదా తరువాత అమిత్ షా రామోజీరావుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇందు కోసం ఆయన షెడ్యూల్ లో ప్రత్యేకంగా మార్పులు కూడా చేశారు. దాదాపు గంట సేపు రామోజీ రావు, అమిత్ షాల మధ్య భేటీ జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
స్మితా స‌బ‌ర్వాల్ సీనియ‌ర్ ఐఎ ఎస్ అధికారి క‌నుక గుజ‌రాత్ ప్ర‌భుత్వ నిర్వాకం ప‌ట్ల ఆశ్చ‌ర్య‌పోయారు  
తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లొల్లి హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోవడానికి ఆ పార్టీ స్థానిక నేతల్లో అనైక్యతే కారణమనే విమర్శలు తెలంగాణ ఆవిర్భావం నుంచీ ఉన్నాయి. మళ్లీ ఇంత కాలానికి పార్టీ జవసత్వాలు కూడదీసుకుని అధికార రేసులో బలంగా నిలిచిన తరుణంలో మళ్లీ అనైక్యత జాడ్యం మరోసారి జడలు విదిల్చి రంగంలోకి దూకింది.
బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో శిక్ష ప‌డిన 11మందీ జైల్లో ఎంతో స‌త్ప్ర‌వ‌ర్త‌న‌తో మెలిగార‌ట‌. అంచేత వారిని విడిచిపెట్టారు.
బీజేపీ పార్లమెంటరీ బోర్డులో గడ్కరీకి స్థానం లేకపోవడాన్ని పరిశీలకులు సైతం అనూహ్య పరిణామంగానే పరిగణిస్తున్నారు. మోడీ కేబినెట్ లో అమిత్ షా తరువాత గట్టిగా వినిపించే పేరు నితిన్ గడ్కరీ మాత్రమే. అంతే కాదు ఆయన నాగపూర్ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. నాగపూర్ పెద్దలు అనగానే ఆర్ఎస్ఎస్ కీలక నేతలు అన్న విషయం తెలిసిందే. మోడీ 2.0కు ముందు ప్రధాని పదవి కోసం ఆర్ఎస్ఎస్ నితిన్ గడ్కరీ పేరును ఒకింత సీరియస్ గానే పరిగణించింది.
విద్యుదుత్ప‌త్తి సంస్థ‌ల నుంచి రోజూ కొంటున్న విద్యుత్‌కు బిల్లులు స‌కాలంలో చెల్లించాలి. కానీ  ఏపీ స‌ర్కార్ అలా చేయ‌లేద‌ని చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి కేంద్రం నిర్ణ‌యించింది.
ఒక వైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల కోసం పార్టీనీ, క్యాడర్ ను సమాయత్తం చేస్తూ రాకెట్ వేగంతో దూసుకు పోతుంటే.. మరో వైపు పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ తండ్రి స్పీడును అందుకుంటూ.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి పరుగులు తీస్తున్నారు. ఆయనకు పార్టీ బలోపేతంతో పాటు మంగళగిరిలో తన విజయానికి బాటలు వేసుకోవడమన్న అదనపు బాధ్యత కూడా ఉంది. ఎక్కడైతే పరాజయం ఎదురైందో అక్కడే తన విజయాన్ని ఘనంగా చాటాలన్న పట్టుదలతో లోకేష్ ముందుకు సాగుతున్నారు.
సింహాచ‌లం వ‌రాహ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి దేవ స్థానానికి చెందిన పంచ‌గ్రామాల భూము ల్ని ఆక్ర‌మ‌ణ‌దారుల పేరు మీద  క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు ప్ర‌భుత్వం పూనుకుంది. అందుకు ఏకంగా చ‌ట్టం కూడా తెచ్చింది. హై కోర్టు ఆగ్ర‌హించింది
వచ్చే ఏన్నికలలో టీడీపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేగంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న తన శపథాన్ని నెరవేర్చుకునేందుకు సమరసన్నాహాలు చేస్తున్నారు. మినీ మహానాడు కార్యక్రమాల పేరుతో ఒక్కో జిల్లాలో మూడేసి రోజులు పర్యటించిన చంద్రబాబు నాయుడు తాజాగా టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలు ప్రారంభించారు.
ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్యలు విఫలమయ్యాయి. ఉపాథ్యాయుల హాజరు కోసం ప్రభుత్వం తప్పని సరి చేసిన ఫేస్ రికగ్నేషన్ యాప్ పట్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే. ఆ యాప్ డౌన్ లోడ్ చేయడం, దాంట్లో లగిన్ అవ్వడం తప్పని సరి చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.