బెంగాల్లో బీజేపీ మైండ్ గేమ్

Publish Date:Jul 28, 2022

Advertisement

పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ చాలా గట్టి ప్రయత్నాలే చేసింది. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హోం మంత్రి అమిత్ షా, సారధ్యంలో బీజేపీ శక్తి యుక్తులన్నీ ప్రయోగించి  పోరాడింది. అయినా ఫలితం దక్కలేదు. రెండు వందల పైచిలుకు స్థానాలు లక్ష్యంగా అమిత్ షా పావులు కదిపినా, బీజేపీ నంబర్స్ రెండంకెల సఖ్యను దాటలేదు.

మూడింట రెండు వంతుల మెజారిటీతో తృణమూల్ కాంగ్రెస్, ముచ్చటగా మూడవసారి విజయ కేతనం ఎగరేసింది. మమతా బెనర్జీ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. మరో వంక బీజేపీ  అధికారం అందుకోలేక పోయినా, కేవలం నాలుగు స్థానాల నుంచి 70కి పైగా స్థానాలుకు సంఖ్యా బలాన్ని పెంచుకుంది. కాంగ్రెస్,వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా పూర్తిగా తుడిచి పెట్టుకు పోవడంతో తృణమూల్ కు ఏకైక ప్రతిపక్షంగా కమల దళం నిలిచింది. అసెంబ్లీలో  లోపల వెలుపల కూడా తృణమూల్ కు ఏకైక ప్రత్యర్హ్దిగా  బీజేపీ నిలిచింది. 

అదలా ఉంటే, ఇటీవల మహారాష్టలో విజయవంతంగా శివసేన అధినేత, ఉద్ధవ్ థాకరే సారధ్యంలో, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీల మహా వికాస్ అఘాడీ ( ఎంవీఎ) ప్రభుత్వాన్ని కూల్చిన కమల దళం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్’లో అదే తరహ ఆట మొదలు పెట్టిందని అంటున్నారు.నిజమే, మహారాష్ట్రలో ఎంవీఎ ప్రభుత్వాన్ని పడగొట్టినంత తేలిగ్గా  బెంగాల్ ప్రభుత్వాన్ని పడగొట్టడం  అయ్యే పని కాదు. 294 మంది సభ్యులున్న సభలో తృణమూల్ కాంగ్రెస్’ కు 220 కి పైగా స్థానాలున్నాయి. బీజేపీ టికెట్’పై గెలిచిన ఎమ్మెల్యేలలోనూ నలుగురైడుగురు తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు.

అయినా బీజేపీ బెంగాల్లో, ‘మహా’ క్రీడకు శ్రీకారం చుట్టిందా అంటే, అవుననే సమాధానమే వస్తోంది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని,  సినిమ హీరో, బీజేపీ నేత, మిథున్‌ చక్రవర్తి చేసిన సంచలన వ్యాఖ్యలు, అదే సూచిస్తున్నాయని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ వంక ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీ అరెస్టైన సమయంలోనే బీజేపీ ముఖ్యనాయకుడు ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్థా కేసులో తృణమూల్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వత్తిడి ఎదుర్కుంటున్నారు.

కుప్పలుగా పోసిన నోట్ల కట్టలు బయట పడడంతో, సామాన్య ప్రజల్లో తృణమూల్ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయికి చేరిందో, ప్రత్యక్షంగా చూస్తున్నారు. ట్రక్కులలో తరలిస్తున్న నోట్ల కట్టలు తృణమూల్ నాయకత్వాన్ని డిఫెన్సులోకి నెట్టి వేశాయి. ఇదలా ఉంటే పార్థా కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కుప్పలుగా పోసిన నోట్ల కట్టలతో  పాటుగా, రాసులుగా పోసిన బంగారు  ఆభరణాలు కూడా బయట పడుతున్నాయి. 

మరో వంక ఈడీ ఇప్పటికే పార్థా ఛటర్జీ, ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ఇంట్లో ఈడీ జరిపిన తొలి  సోదాల్లో రూ. 21.90 కోట్ల నగదు, రూ. 56 లక్షల విదేశీ కరెన్సీ, రూ. 76 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేస్కున్నామని ఈడీ అధికారికంగా ప్రకటించింది.  ఆ సొమ్ము  సొమ్ము మంత్రి పార్థ ఛటర్జీకి చెందినదేనని విచారణలో అర్పిత ఈడీ అధికారులకు తెలిపారు. కాగా,  పార్థా చటర్జీ అర్పిత ముఖర్జీకి చెందిన మరో ప్లాట్ లో ఈడీ నిర్వహించిన తాజా సోదాలలో కూడా భారీగా నగదు, బంగారం పట్టుబడింది.పలు కీలక డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండో సారి పట్టుబడిన సొమ్ము కూడా కొలువుల కుంభకోణానికి సంబంధించిన సొమ్మేనని అనుమానిస్తున్నారు. 

అదలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని,  మిథున్‌ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, సమయం చూసి, బెంగాల్లో ‘మహా’ క్రీడకు బీజేపీ మైండ్ గేమ్’కు శ్రీకారం చుట్టిందని అయితే చెప్పవచ్చని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.