చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. ఇదే సూత్రం బిజెపి టిఆర్ ఎస్‌పై అమలు చేస్తోంది. తెలంగా ణాలో ఎలాగైనా పాగా వేయాలని గట్టి పట్టుదలతో వున్న బిజెపీ కేసీఆర్ ప్రభుత్వ పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, లోపాల చిట్టాను పట్టుకుని వేధించడానికి గట్టి నిర్ణయమే తీసుకుంది. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణా ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని ఘాటుగా విమర్శలు దట్టిస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో కల్పించడానికి బిజెపీ వర్గీయులంతా తెగ కృషి చేస్తున్నారు.
ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ప్రజల్లోకి కమలనాథులు వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ అధ్య యన కమిటీ సమావేశం నిర్వహించనుంది. ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ అధ్యయన కమిటీ కన్వీనర్‌గా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఉన్నారు. కమిటీ నిర్వహించనున్న సమావేశానికి కమిటీ సభ్యులు, ఇతర నేతలు హాజరు కాను న్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేలా బీజేపీ ప్రణాళికలు వేస్తోంది. కేసీఆర్ సర్కార్ ఎన్నికల హామీలను విస్మరించిందని కమల నాథులు చెబుతున్నారు.
కేసీఆర్ ప్రభు త్వం తెలంగాణాను బంగారు తెలంగాణాగా మారుస్తానని భారీ హామీలు ఇచ్చి ప్రజలను ఆకట్టు కోవడం తప్ప వాస్తవానికి ఇప్పటివరకూ రాష్ట్ర అభివృద్ధి శూన్యమని చాలారోజులుగా బిజెపీ నాయ కులు విమర్శ లతో దాడి చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులు వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయో జనం కలుగు తోందన్నది ప్రజలకు తెలియజేయాలన్నది బిజెపీ నాయకులు పెద్ద కార్యక్రమంగా పెట్టు కున్నారు. అం దుకే, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అనేకానేక అంశాలపై వివరాలు తెలుసుకుని ప్రజల ముందు పెట్టాలని బిజెపీ తెలంగాణా నాయకులు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నాయకత్వంలో బిజెపీ నాయకులు కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
బిజెపి నాయకులకు, ఢిల్లీలోని బిజెపీ పెద్దలకు తెలంగాణా మీద అక్కసుతో వ్యవహరించడం తప్ప వేరే పనిలేదని టిఆర్ ఎస్ నాయకులు విరుచుకుపడుతున్నారు. గవర్నర్ తమిళి సై తో మొన్నటి వరకూ ఎలాంటి సమావేశాలూ, మాటలూ లేకుండా కేసీఆర్ దూరంగా వుండడం, సమతా విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ వచ్చినపుడు కేసీఆర్ ప్రోటోకాల్ పాటించకపోవడం మొదలైనవన్నీ బిజెపీ వర్గీయులు చాలా సీరియస్‌గానే తీసుకున్నారు. ప్రతీ చర్చలోనూ తెలంగాణా కేంద్ర సహాయాన్ని విస్మరించిందని ఎదురుదాడులు చేయడమే సిద్ధాంతంగా పెట్టుకున్నారు. ఇపుడు తాజాగా అధ్యయన కమిటీ అనే పేర ఏకంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి టిఆర్ ఎస్ ప్రభత్వం ఇంత కాలం చేసినవన్నీ పెద్ద జాబితాగా తయారు చేయడంలో బిజెపీ నాయకులు నిమగ్నమయ్యారు. ఆగ్రహం వుండడం కూడా ఒక్కింత ప్రేమ వుండడమే నేమో అందుకే కమలనాధులు కేసీఆర్‌ను తమ ధోరణిలో ప్రేమిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-loving-kcr-39-139246.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.