ముర్ము విజయోత్సవ సభకు తప్పతాగి వచ్చిన కమలం నేత

Publish Date:Jul 27, 2022

Advertisement

క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధత అంటూ ఘనంగా చెప్పుకునే బీజేపీ అసలు రంగు ఏమిటన్నది గుజరాత్ సాక్షిగా తేటతెల్లమైపోయింది. భారత రాష్ట్రపతిగా గిరి పుత్రిక ముర్మ పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భాన్నిపురస్కరించుకుని గుజరాత్ లోని గిరిజన ప్రాబల్యం అధికంగా ఉండే చోటౌడేపూర్ లో విజయోత్సవ సభ నిర్వహించింది

బీజేపీ. భారత ప్రథమ పౌరురాలిగా గిరిపుత్రికను పీఠం ఎక్కించిన క్రెడిట్ ను పూర్తిగా సొంతం చేసుకునే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే గుజరాత్ లోని చోటౌడ పూర్ లో కూడా బీజేపీ విజయోత్సవ సభ నిర్వహించింది. అంత వరకూ బాగానే ఉంది.   ఆ విజయోత్సవ సభకు హాజరైన గుజరాత్ మంత్రి, బీజేపీ నాయకుడు నిమిషా సుతార్ తప్పతాగి హాజరయ్యారు. అలాగే సభకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రష్మాకాంత్ వాసవ కూడా హాజయర్యారు. ఆయన హాజరవ్వడం విశేషం కాదు కానీ.. తప్పతాగి హాజరు కావడమే ఇప్పడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడానికి కారణమైంది.

సభా స్థలికి వచ్చి కారు దిగడమే తూలుతూ వచ్చిన ఆయన సభా వేదికపై కూడా పరిసరాలను గమనించే స్ఫృహ లేని స్థితిలో ఉన్నారు. పక్కను మహిళా మంత్రి ఉన్నారన్న స్ఫృహ కూడా లేనంతగా మత్తులో మునిగిపోయారు. విజయోత్సవ సభ ప్రారంభమైనది మొదలు, ముగిసే వరకూ ఆయన కళ్లు తెరిచింది లేదు. వేదికపై తూగుతూ ఊగుతూనే కూర్చున్నారు. ఇందుకు సంబంధించి  వీడియోలు వైరల్ అయ్యాయి. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతండటంతో గుజరాత్ బీజేపీ ప్రతిష్ట మసక బారింది. దీంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది.

బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు రష్మీకాంత్ ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం పాలనలో ఉన్న రాష్ట్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడి నిర్వాకం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీ సర్కార్ గుజరాత్ లో మద్య నిషేధం అమలు చేస్తున్నామని ఘనంగా చెప్పుకోవడం కాదు.. అది నిజంగా అమలు అవుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సంఘటనపై విపక్షాలు విమర్శల బాణాలు సంధిస్తున్నారు. బీజేపీ దంతా పేరు గొప్ప ఊరు దిబ్బ చందమే ననడానికి రష్మీకాంత్ ఉదంతమే నిదర్శనమని అంటున్నారు. 

By
en-us Political News

  
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.