కమలం కడిగిన ముత్యం కాదు.. ఇదిగో సాక్ష్యం
Publish Date:Feb 2, 2022
Advertisement
“కాంగ్రెస్ అంటే కరప్షన్’ కు మారు పేరు. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలలోకి అవినీతి చొచ్చుకు పోయింది. కాంగ్రెస్ హయాంలో ఆకాశం (స్పెక్ట్రమ్) మొదలు భూగర్భం (బొగ్గు) వరకు అంతటా అవినీతే”... 2014కు ముందు బీజేపీ ఇదిగో ఇలాంటి, అసత్య ప్రచారం చేసే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడేళ్ళు పూర్తయినా ఇంతవరకు ఆరోపణల్లో ఏ ఒక్క ఆరోపణను మోడీ ప్రభుత్వం న్యాయస్థానాల్లో నిరూపించ లేక పోయింది. అలాగని,కాంగ్రెస్ కడిగిన ముత్యం అనికాదు, కానీ, కాంగ్రెస్’ను బూచిగా చూపించి అధికారంలోకి వచ్చిన బీజేపీ అంత శుద్దపూస కాదు. నిజానికి, అతనికంటే ఘనుడు అచంట మల్లన్నఅన్నట్లుగా కాంగ్రెస్ పాలనలో కంటే బీజేపీ పాలనలోనే అవినీతి అధికమని, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండూ కాదు, ఏకంగా 54 సంవత్సరాలు పాలించింది. బీజేపీ మొత్తం మీద ఓ 13 ఏళ్ళు పాలించింది. అయినా, అంత సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ అసెట్స్ /ఆస్తుల విలువ జస్ట్ రూ.588.16కోట్లు, కేవలం 13ఏళ్ళు పాలించిన బీజేపీ ఆస్తులు, రూ.4,847.78 కోట్లు. ఎక్కడి ఐదొందల కోట్లు ఎక్కడి, ఐదు వేల కోట్లు. ఇంత వ్యత్యాసానికి కారణం ఏమిటీ? అవినీతి పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పేరొచ్చినా,నిజమైన అవినీతి బీజేపీ ప్లాన్లో జరిగిందని, ఏడేళ్ళలోనే దేశానికీ తెలిసివచ్చిందని ఏడీఆర్ నివేదిక దేశానికీ తెలియ చేసింది. ఆడాలా ఉంటే 2019-20 నాటికి వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలు డిక్లేర్ చేసిన ఆస్తులు, అప్పులు ఆధారం ఏడీఆర్ విశ్లేషించి రూపొందించిన నివేదిక ప్రకారం దేశాన్ని అన్నేళ్ళు పాలించిన కాంగ్రెస్ కంటే, ఒక్క బీజేపీ మాత్రమే కాదు, బీఎస్పీ ఆస్తులుకుడా ఎక్కువగానే ఉన్నాయి. 2020 నాటికి బీఎస్పీ ఆస్తుల విలువ రూ. 698.33 కోట్లు.అంటే కాంగ్రెస్ కంటే ఇంచుమించుగా వంద కోట్లు ఎక్కువ. ఈ లెక్కలను బట్టి చూస్తే, అవినీతి అనకొండ ఎవరో వేరే చెప్ప నక్కరలేదు. అయితే, రాజకీయ పార్టీల ఆస్తులు అన్నీ అవినీతి సొమ్ములేనా అంటే కాకపోవచ్చును. కానీ, ఏడీఆర్ తాజా నివేదిక నిజం అయితే, సభ్యత్వంలోనే కాదు, ఆస్తులు కూడ బెట్టడంలోనూ కూడా బీజేపీదే ఫస్ట్ ప్లేస్.
ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం దేశంలోని (ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన) ఏడు జాతీయ పార్టీ మొత్తం ఆస్తుల విలువ, రూ. 9,988.57 కోట్లు, అలాగే, తెరాస, టీడీపీ, వైసేపీ సహా మొత్తం 44 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం విలువ రూ. 2,129.38కోట్లు. ప్రాంతీయ పార్టీల లెక్కలు పక్కన పెడితే, జాతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో ఒక్క బీజేపీ వాటానే 69.37 శాతం (రూ.4847.78కోట్లు). కాంగ్రస్ పార్టీ షేర్ 8.42 శాతం, (రూ588.16).
http://www.teluguone.com/news/content/bjp-is-not-so-clean-39-131092.html





