పరాన్నజీవిగా కాషాయ పార్టీ.. విపక్షాల అనైక్యతపైనే మనుగడ!

Publish Date:Apr 27, 2022

Advertisement

రెండు పర్యాయాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోందా? ప్రజా వ్యతిరేకత గూడుకట్టుకున్నప్పటికీ విపక్షాల అనైక్యతపైనే మూడో సారి కూడా అధికార పీఠం దక్కించుకోగలనన్నధీమాతో ఉందా. సొంత బలం తక్కువైనా విపక్షాల అనైక్యతే బలంగా మారి పరాన్న జీవిగా గట్టేక్కే పరిస్థితి ఉందని భావిస్తోందా. 

దేశంలో రాజకీయ వాతావరణాన్ని గమనిస్తుంటే బీజేపీ సొంత బలం కన్నా విపక్షాల అనైక్యతపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుందనే భావించాల్సి ఉంటుంది. పరిశీలకులు కూడా అదే చెబుతున్నారు. బీజేపీ యేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉండటమే ఇందుకు కారణం. సార్వత్రిక ఎన్నికలకు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంగా బీజేపీ యేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు సజావుగా ముందుకు సాగడం లేదు. బీజేపీయేతర కూటమికి నాయకత్వం వహించే పార్టీ ఏదన్న విషయంపై విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. 
రాబోయే లోకసేభ ఎన్నికలలో గతంలో మాదిరిగా వెూదీ ప్రభంజనం ఉండకపోవచ్చన్ని అందరి నిశ్చితాభిప్రాయంగా ఉన్నప్పటికీ...దానికి క్యాష్ చేసుకుని కేంద్రంలో బీజేపీ సర్కార్ ను గద్దె దించేందుకు అవసరమైన రాజకీయ సంకల్పం మాత్రం విపక్షాలలో కనిపించడం లేదు. ఏదోలా బీజేపీయేతర కూటమికి నేతృత్వం వహించి ప్రధాని పీఠం దక్కించుకోవాలన్నదే విపక్ష పార్టీ నేతల ఉద్దేశంలా కనిపిస్తున్నది తప్ప సైద్ధాంతికంగా ఉన్న విభేదాలను పరిష్కరించుకుని బీజేపీయేతర శక్తులన్నిటీని ఏకతాటిపైకి తీసుకురావలన్న చిత్తశుద్ధి ఆయా పార్టీలలో ఇసుమంతైనా కనిపించడం లేదు. 

పరిస్థితిని అంచనా వేసిన కాంగ్రెస్ ఒక అడుగు తగ్గి అయినా బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలన్న ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఆ పార్టీ నాయకత్వంలో పని చేసేందుకు మిగిలిన పార్టీలు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో కలిసి పని చేయడానికి సుతరామూ ఇష్టపడటం లేదు. 
ఆయా రాష్ట్రాలలో ఇంత కాలం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేసి ఇప్పుడు ఆ పార్టీతో జట్టు కడితే ప్రజా వ్యతిరేకత ఎదురౌతుందన్న భయం ఆ పార్టీలది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తు.. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో చేరితే కాంగ్రెస్ వ్యతిరేకత తమ ఓటు బ్యాంకును దెబ్బతీస్తుందని ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీలు భావిస్తున్నాయి.  
అందుకే బీజేపీ యేతర పార్టీల ఐక్యత కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. ఇక కాంగ్రెసేతర, బీజేపీ యేతర కూటమి అన్న ప్రతిపాదనకు.. జాతీయ స్థాయిలో పెద్దగా స్పందన రాలేదు. బీజేపీని ఎదుర్కొనాలంటే కాంగ్రెస్ ను కలుపుకు పోక తప్పదనే దాదాపు అన్ని పార్టీల అధినాయకులు భావిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలో కలిసి  పని చేసే విషయంలో మాత్రం ముందుకు రావడం లేదు. 

 ఎన్నికలకు ముందే బీజేపీయేతర కూటమిని పటిష్ట పరుచాలని, దానికి కాంగ్రెస్‌ కేంద్ర బిందువుగా ఉండాలని కాంగ్రెస్ భావిస్తుంటే..  తమ తమ రాష్ట్రాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఎన్నికల అనంతరం బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ జట్టు కట్టి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతున్నారు. అప్పుడు సీట్ల సంఖ్యను బట్టి సంకీర్ణానికి నాయకత్వం వహించే పార్టీ ఏదన్నది తేలుతుందన్నది ఆయా పార్టీల ఉద్దేశం. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలా పలువురు నాయకులు ఎవరికి వారు బీజేపీ యేతర కూటమికి తామే సరైన నాయకులమని భావిస్తున్నారు.  
అందుకే ప్రజాదరణ తగ్గినా విపక్షాల అనైక్యతే బలంగా మరోసారి అధికారం దక్కించుకో గలమన్న ధీమా కాషాయ పార్టీలో వ్యక్తం అవుతోంది.

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.