వలసలతో కాషాయ జోరు.. కారుకు కష్టమేనా! 

Publish Date:Sep 7, 2020

Advertisement

సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో అక్కడ బైపోల్ అనివార్యమైంది. అధికార పార్టీగా ఉండటం, ఎమ్మెల్యే చనిపోయిన సెంటిమెంట్ తో టీఆర్ఎస్ గెలుపు ఈజీగానే ఉంటుందని మొదట అందరూ భావించారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ రికార్డ్ కూడా అద్భుతంగా ఉంది. గతంలో జరిగిన చాలా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయాలు సాధించింది. ఇలా అన్నిఅనుకూలంగా ఉండటంతో దుబ్బాకలో వార్ వన్ సైడ్ గానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమయింది. అయితే ప్రస్తుతం దుబ్బాకలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. విపక్షాలు సవాల్ గా తీసుకోవడంతో కారు పార్టీకి టఫ్ ఫైట్ ఉండే సూచనలు కన్పిస్తున్నాయి. 

 

బీజేపీ నుంచి సీనియర్ నేత రఘునందన్ రావు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న నేతగా ఆయనకు ప్రజల్లో గుర్తింపు ఉంది. వరుసగా ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. మరోవైపు సోలిపేట కుటుంబంపై స్థానికంగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇలా అన్ని అంశాలు కలిసి వస్తుండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు రఘునందన్ రావు. ఇప్పటికే ఆయన సగానికి పైగా గ్రామాలు చుట్టేశారు. యువత టార్గెట్ గా ఆయన ముందుకు పోతున్నారు. బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. యువకులు, యూత్ సంఘాలు రఘునందన్ రావుకు మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో రోజు రోజుకు దుబ్బాకలో బీజేపీ బలం పుంజుకుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

 

కాంగ్రెస్ కూడా దుబ్బాక ఉపఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. మెదక్ మాజీ ఎంపీ విజయశాంతిని రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది.  ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు విజయశాంతి వ్యక్తిగత ఇమేజ్ తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన రాములమ్మ మెదక్ ఎంపీగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాపై ఆమెకు మంచి పట్టుంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. పార్టీలకతీతంగా అన్ని పార్టీలతో ఆమెకు సంబంధాలున్నాయి. గత ఎన్నికలో దుబ్బాక నుంచి కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి లేకున్నా రెండో స్థానం కైవసం చేసుకోగా బీజేపీకి మూడో స్థానం వచ్చింది. విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని హస్తం పార్టీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది.  

 

2019 మార్చిలో జరిగిన ఉత్తర తెలంగాణ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఏకంగా మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఉద్యోగులు, యువకుల్లో టీఆర్ఎస్ పట్ల పెరిగిన వ్యతిరేకత ఆ ఎన్నికల్లో కన్పించింది. ఇప్పుడు అంతకు మించి కేసీఆర్ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కాంగ్రెస్, బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ కు షాకిచ్చేందుకు జనాలు ఉత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు. 

 

బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలతో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిలో సానుకూలంగా లేవని గ్రహించిన సీఎం కేసీఆర్.. మంత్రి హరీష్ రావును ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్.. ఇప్పటికే నియోజకవర్గంలో పలు సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కరోనా సోకడంతో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. అయినా దుబ్బాక రాజకీయాలను ఆయన నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హరీష్ డైరెక్షన్ లో మెదక్ ఎంపీతో పాటు జిల్లాకు చెందిన అధికార ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి గతంలో చాలా ఉప ఎన్నికలను ఈజీగా గెలుచుకున్న టీఆర్ఎస్ కు... దుబ్బాక సవాల్ గా మారిందనే ప్రచారం గులాబీ వర్గాల్లోనూ జరుగుతోంది.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.