సెటిలర్లపై కాషాయం కన్ను.. తెలంగాణలో అధికారానికి అదే దన్ను!

Publish Date:Nov 26, 2022

Advertisement

తెలంగాణలో అధికారం దక్కించుకోవాలంటే. సెటిలర్ల మద్దతు అనివార్యమన్న నిర్ణయానికి బీజేపీ వచ్చేసింది. సెటిలర్ల మద్దతు సంపూర్ణంగా లేకుంటే తెలంగాణలో అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని భావిస్తున్న బీజేపీ ఇక ఇప్పుడు సెటిలర్ల ఓట్లపై గురిపెట్టిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. గంపగుత్తగా సెటిలర్ల ఓట్లను తమ ఖాతాలో వేసుకోవాలంటే.. తెలంగాణలో ఇప్పుడున్న తెలుగుదేశం స్థానానికి బీజేపీ చేరుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా తెలంగాణలో కనీసం 40 స్థానాలలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉందన్న అంచనాలున్నాయి. అందుకే బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం మద్దతు కోరుతోందని పరిశీలకులూ అంటున్నారు. 2019 ఎన్నికల వరకూ కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీని కానీ, ఆ పార్టీకి ఉన్న జన మద్దతును గానీ పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే తెలంగాణలో అధికారం కనుచూపు మేరలో కనిపిస్తోందో.. రాష్ట్రంలో పార్టీ బలోపేతమై.. అధికార పగ్గాలు చేపట్టడానికి చేరువకు వచ్చిందన్న భావన వచ్చిందో.. అప్పటి నుంచీ కమలనాథుల దృష్టి సెటిలర్ల మద్దతు కూడగట్టడంపై కేంద్రీకృతమైంది.

అందులో భాగంగానే ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట రద్దైన ఆంధ్రా బీసీకులాల రిజర్వేషన్ల పునరుద్ధరణ కోసం బీజేపీ ఇప్పుడు గళమెత్తుతోంది. నాడు రద్దు చేసిన ఆంధ్రా బీసీ కులాల రిజర్వేషన్ పునరుద్ధరణ కోరుతూ గవర్నర్ తమిళిసైకి వినతి పత్రం ఇవ్వడం వెనుక కారణం ఇదేనని పరిశీలకులు అంటున్నారు. ఎనిమిదేళ్ల కిందట కేసీఆర్ ఆంధ్రా బీసీ కులాల రిజర్వేషన్ రద్దు చేసినప్పుడు ఏపీ బీసీ సంఘాలు వినా ఎవరూ స్పందించలేదు. ఇన్నేళ్లైన తరువాత ఇప్పుడు బీజేపీ నాడు రద్దు చేసిన రిజర్వేషన్ల పునరుద్ధరణకు గళం ఎత్తడం వెనుక సెటిలర్ల ఓట్లకు గాలం వేయడమనే లక్ష్యమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణపై పట్టు సాధించేందుకు   అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకోవడమే లక్ష్యంగా కాషాయదళం అడుగులేస్తోంది.

అందులో భాగంగానే రద్దైన ఆంధ్రా బీసీ రిజర్వేషన్ల పునరుద్ధరణ నినాదాన్ని అందుకుంది. దీని వల్ల సెటిలర్ల ఓట్లతో పాటు బీసీల ఓట్లు గంపగుత్తగా తమ వైపు మళ్లుతాయని ఆశిస్తోంది. అయితే నాణేనికి రెండో వైపు ఈ రిజర్వేషన్ల పునరుద్ధరణ నిర్ణయం తెలంగాణ బీసీలను దూరం చేసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయంలో బీజేపీ వ్యూహాలు వేరేగా ఉంటున్నాయంటున్నారు. సెటిలర్లు ఇప్పటి వరకూ తెలుగుదేశంకు అనుకూలంగానే ఉన్నారు తప్ప మరో పార్టీ వైపు చూపు సారించలేదు. అందుకే ఏపీలో బీసీ సంఘాలు సంతృప్తి చెందేలా.. రద్దైన రిజర్వేషన్ల పునరుద్ధరణ నినాదం అందుకుంటే వారికి దగ్గర కావచ్చునని బీజేపీ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.

విభజన తరువాత కూడా 21014 ఎన్నికలలో తెలుగుదేశంతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఐదు స్థానాలలో విజయం సాధించిన సంగతిని బీజేపీ ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటున్నది. తెలుగుదేశం పార్టీకి ఆ ఎన్నికలో 15 స్థానాలు వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆ పరిస్థితిని పునరావృతం చేయాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది.  తెలుగుదేశంతో సంబంధం లేకుండానే సెటిలర్లకు దగ్గరవ్వడానికి బీజేపీ ప్రస్తుతం ప్రయత్నిస్తోంది. ఒక వేళ అలా సాధ్యం కాకపోతే.. ఆ పార్టీతో పొత్తుకు కూడా సిద్ధపడేందుకు బీజేపీ ఇప్పటికే ఒక  నిర్ణయానికి వచ్చేశారంటున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.